ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) బుధవారం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు న్యూ కార్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకొచ్చేందుకు అనుమతించింది. వీటిలో ‘పే యాస్ యు డ్రైవ్(Pay As You Drive)’, ‘పే హౌ యు డ్రైవ్(Pay How You Drive)’, ‘ఓన్ డ్యామేజ్(ఓడీ) కవర్(Own Damage Cover)’ వంటి టెక్-ఎనేబుల్డ్ కాన్సెప్ట్‌లు ఉన్నాయి. దీంతో వాహన యజమానులు ఇప్పుడు వారి డ్రైవింగ్ ప్రవర్తన, వాహనం నిర్వహణ, మైలేజ్, వినియోగ విధానం ఆధారంగా చౌక అయిన ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయవచ్చు.
* ‘పే యాస్ యు డ్రైవ్’ కాన్సెప్ట్ ఏంటి?
‘పే యాస్ యు డ్రైవ్’ విషయంలో.. నిర్దిష్ట కిలోమీటర్లు ప్రయాణించే వరకు ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది. వాహనాలను అరుదుగా ఉపయోగించే వారికి ఈ ప్రీమియం స్టాండర్డ్ ప్లాన్‌ల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఒక కస్టమర్ అతను/ఆమె తన వాహనాన్ని నడుపుతున్న కిలోమీటర్ల సంఖ్య ఆధారంగా ఇన్సూరెన్స్ కోరుకుంటే ఈ కవర్‌ను ఎంచుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉన్న వ్యక్తి ఫ్లోటర్ ప్రాతిపదికన యాడ్-ఆన్ మోటార్ కవర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు.
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ TA రామలింగం మాట్లాడుతూ..‘ యాడ్ ఆన్ కవర్‌ల ప్రధాన లక్ష్యం ఏంటంటే.. ఈ రోజుల్లో మోటార్ ఇన్పూరెన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. చాలా మంది కస్టమర్‌లు ముఖ్యంగా థర్డ్-పార్టీ కవర్‌లను మాత్రమే తీసుకుని, OD కవర్‌ల ప్రయోజనాలను పట్టించుకోరు. భారతదేశంలో మోటారు ఇన్సూరెన్స్ ఆవశ్యకతను తెలిపేందుకు ఇలాంటి చర్యలు అవసరం.’ అని అన్నారు.
ఇది తక్కువ-మైలేజ్ డ్రైవర్లకు, ఆటో బీమాపై మరింత పారదర్శకత, నియంత్రణను ఇస్తుంది. లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ & రీఇన్సూరెన్స్ ప్రెసిడెంట్ ఉదయన్ జోషి మాట్లాడుతూ.. ‘మేము రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ క్రింద 'పే యాస్ యు డ్రైవ్' అనే ప్రొడక్ట్ కాన్సెప్ట్‌ను పరీక్షించాము. అవకాశం గురించి సంతోషిస్తున్నాము. ఇంకా, యాడ్-ఆన్ కవర్‌ల పరిచయం దేశంలో ఇన్సూరెన్స్ వ్యాప్తిని మరింతగా పెంచడంలో ఉత్ప్రేరకంగా పని చేస్తుంది’ అని అన్నారు.
* ప్రవర్తన ఆధారంగా ప్రీమియం
‘పే హౌ యు డ్రైవ్’ కాన్సెప్ట్‌లో, ఇన్సూరెన్స్ ప్రీమియం వ్యక్తి అతని/ఆమె వాహనాన్ని నడిపే విధానంపై ఆధారపడి ఉంటుంది . అతను/ఆమె వాహనాన్ని మెరుగైన, సమర్థవంతమైన, సురక్షితమైన మార్గంలో ఉపయోగిస్తే ప్రీమియం తక్కువగా ఉంటుంది.కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటికే కొత్త కాన్సెప్ట్‌ల ఆధారంగా పాలసీలను రూపొందించాయి. ఈ పాలసీలు టెలిమాటిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేటిక్స్ ఆధారంగా పని చేస్తాయి. ఇవి డ్రైవింగ్-సంబంధిత డేటాను ట్రాక్ చేయడానికి, స్టోర్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉపయోగపడతాయి.
డ్రైవింగ్ అలవాట్లను ట్రాక్ చేయడంలో సహాయపడే పరికరాలను టెలిమాటిక్స్ ఉపయోగించుకుంటుంది. పరికరం ఇన్‌స్టాలేషన్ పాలసీ కింద చేర్చారు. డ్రైవింగ్ అలవాట్లను పర్యవేక్షించడానికి కస్టమర్‌తో పాటు ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా సహాయపడుతుంది. ఈ పర్యవేక్షణ డివైజ్‌లను ఉపయోగించి, కస్టమర్, ఇతర వాహనాల కోసం రహదారి భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే, ఈ డేటాను ఉపయోగించి, ఇన్సూరెన్స్ కంపెనీ వినియోగాన్ని బట్టి సమగ్రమైన కవర్‌ను అందించే మెరుగైన ప్లాన్‌లను తీసుకు రావచ్చు.
నిరంతరం ట్రాక్ చేయనున్న టెక్నాలజీ
ఈ కొత్త చర్యలు ప్రజలు తమ వాహనాలను జాగ్రత్తగా చూసుకోవడానికి, ట్రాఫిక్ నియమాలను అనుసరించడానికి, మంచి డ్రైవింగ్ ప్రవర్తన మెరుగుపరుచుకునేలా ప్రోత్సహిస్తుందని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రాకేష్ జైన్ అన్నారు. ప్రస్తుతం, ఇన్సూరెన్స్ ప్రీమియం వినియోగదారు ప్రవర్తనపై ఆధారపడి లేకపోవడంతో మోటారు కవర్ కోసం ఒకే ధర ఉంది. కొత్త కాన్సెప్ట్‌లు తక్కువ వినియోగ కస్టమర్‌లకు, ముఖ్యంగా సంవత్సరానికి 10,000 కి.మీ కంటే తక్కువ డ్రైవ్ చేసే వారికి, అలాగే మరింత సురక్షితంగా, సమర్ధవంతంగా డ్రైవ్ చేసే వారికి తక్కువ ఖర్చుతో కవరేజీ అందిస్తాయి.
మోటారు ఇన్సూరెన్స్ భావన నిరంతరం అభివృద్ధి చెందుతోందని IRDAI తెలిపింది. ఇన్సూరెన్స్ విభాగం మరింత అభివృద్ధి చెందేందుకు టెక్నాలజీ సాయం చేస్తోందని, పాలసీదారుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ రంగం వేగవంతం కావాలని IRDAI పేర్కొంది. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డేటా ప్రకారం.. 2022 మార్చితో ముగిసిన సంవత్సరంలో మోటారు వాహనాల కేటగిరీలో బీమా కంపెనీలు 3.98 శాతం వృద్ధితో రూ.70,432 కోట్ల మొత్తం ప్రీమియంను సమీకరించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Car Bike News, New policy, Term insurance