యమహా మోటార్స్(Yamaha Motors) ఇండియా(India) ఈ సంవత్సరం ప్రారంభంలో FZ-S DLX అనే కొత్త రేంజ్-టాపింగ్ వేరియంట్‌తో పాటు రిఫ్రెష్ స్టైలింగ్‌తో FZS-Fi మోడల్‌ను ఆవిష్కరించింది. కొన్నేళ్లుగా ఇండియాలో ఉన్న FZ-S బైక్స్.. దేశీయ మార్కెట్లో యమహా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రొడక్ట్స్‌లో (Products) ఒకటిగా మారాయి. తాజా అప్డేటెడ్ స్టైలింగ్‌తో కంపెనీ అమ్మకాలను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో FZS-Fi 2022 వేరియంట్‌ను కంపెనీ డిజైన్ చేసింది. దీని ధర రూ. 1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్). బైక్ DLX వేరియంట్ ధర రూ. 1.19 లక్షలు. మీరు కొత్త 150cc మోటార్‌బైక్‌ను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. Yamaha FZS-Fi మీకు బెస్ట్ ఆప్షన్. దీని ధర, స్పెసిఫికేషన్ల వివరాలు చూద్దాం.
యమహా FZS-Fi 2022 బైక్ స్టాండర్డ్ వేరియంట్ కేవలం రెండు కలర్ ఆప్షన్స్‌లోనే లభిస్తుంది. ఇది మ్యాట్ రెడ్, డార్క్ మ్యాట్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. DLX వేరియంట్ మూడు పెయింట్ స్కీమ్‌లలో.. మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ గ్రే, మెజెస్టి రెడ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. FZS-Fi 2022 మోడల్ బైక్ లీటరుకు 45 కి.మీల వరకు మైలేజ్ అందించగలదని యమహా పేర్కొంది. అయితే రోడ్ కండీషన్, ఇతర ఫ్యాక్టర్స్ ఆధారంగా మైలేజ్ మారవచ్చు. FZS-Fi ఫ్యుయెల్ ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు.
* యమహా FZ-S Fi 2022 ఇంజిన్
FZS-Fi కొత్త బైక్ 12.2 bhp అవుట్‌పుట్, 13.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి అనువైన BS6 కంప్లైంట్ ఎయిర్-కూల్డ్ 149cc, సింగిల్-సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్ట్ "బ్లూ కోర్" ఇంజన్‌తో వస్తుంది. ఈ బైక్ 5.6 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ వరకు వేగాన్ని అందుకోగలదు. బైక్ టాప్ స్పీడ్ 115 కి.మీ. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, 165mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు 11330 mm వీల్‌బేస్ దీని సొంతం. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ మోనో-షాక్ వంటి సస్ఫెన్షన్ ఆప్షన్ ఉన్నాయి.
* యమహా FZ-S Fi 2022 డిజైన్, ఫీచర్లు
ఈ బైక్ ముందు భాగంలో కంపార్ట్మెంటలైజ్డ్ లేఅవుట్‌తో కొత్త LED హెడ్‌లైట్ ఉంది. FZS-fi రైడర్లకు మెరుగైన సౌకర్యాన్ని అందించడానికి ఎడిషనల్ కుషనింగ్‌తో 2లెవల్ సీటుతో వస్తుంది. పిలియన్ సీటు మునుపటి కంటే 16% పెద్ద సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. ఇది హిప్ ప్రాంతంలో 26 మిమీ వెడల్పుగా ఉంటుంది. Dlx వేరియంట్‌ను స్ప్లిట్ సీట్ డిజైన్‌తో డిజైన్ చేశారు.
యమహా FZS-Fiలో LED టైల్లైట్, బ్లూటూత్ కనెక్టివిటీ, మల్టీ-ఫంక్షన్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌లైట్, టైర్ హగ్గింగ్ రియర్ మడ్‌గార్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏబిఎస్‌తో పాటు సింగిల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. స్టాండర్డ్ ఫీచర్స్‌తో పాటు DLX వేరియంట్లో LED ఫ్లాషర్లు, గ్రాఫిక్స్, కలర్ అల్లాయ్ వీల్స్, డ్యుయల్ టోమ్ సీట్ ఉన్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.