Bank Loan | ఎప్పుడు ఎవరికి డబ్బులతో అవసరం వస్తుందో చెప్పలేం. కొన్ని సార్లు అనుకోకుండా సడన్‌గా డబ్బులతో పని పడొచ్చు. చేతిలో మనీ ఉంటే పర్వాలేదు. ఇబ్బంది ఏమీ ఉండదు. లేదంటే చాలా మంది పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకుంటూ ఉంటారు. అయితే లోన్ (Loan) తీసుకునే వారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఏ అవసరం కోసం రుణం తీసుకుంటున్నామో స్పష్టత ఉండాలి. కొన్నింటికి అయితే మాత్రం లోన్ తీసుకోకపోవడం ఉత్తమం. ఏ ఏ అంశాలకు లోన్ తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంత మంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి లోన్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్‌లో భారీ లాభం పొందొచ్చనే ఆశ. అయితే మీరు మాత్రం ఈ పొరపాటు చేయొద్దు. పర్సనల్ లోన్ తీసుకోని స్టాక్స్‌లో పెట్టుబడిగా పెట్టొద్దు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఇలా చేస్తే మాత్రం భారీగా నష్టపోవాల్సి రావొచ్చు. స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వ్యక్తిగత రుణం తీసుకోవడం ద్వారా పెద్ద తప్పు చేయొద్దు. స్టాక్ మార్కెట్‌లో నష్టాలు వస్తే.. అప్పుడు లోన్ ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది.
కేవలం రూపాయితో రూ.54 కోట్లు.. ఇదెక్కడి మ్యాజిక్ రా మావ!
అలాగే మీరు ఇప్పటికే లోన్ తీసుకొని దాన్ని తిరిగి చెల్లించడానికి మళ్లీ రుణం పొందడం కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల ఒక చోటు లోన్ క్లోజ్ అయినా మరో చోట లోన్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇలాంటప్పుడు మీరు నెలవారీ ఈఎంఐ చెల్లిస్తూనే రావాలి. అటే మీరు వ్యక్తిగత రుణ చక్రంలో చిక్కుకుపోతారు. ఇలాంటి సందర్భంలో మీరు పశ్చాత్తాపం చెందడం తప్ప మీకు వేరే మార్గం కనిపించదు.
రూ.30 వేలకే తులం బంగారం.. కొంటే కలిగే లాభాలివే.. అదొక్కటే మైనస్
ఇంకా పర్సనల్ లోన్ తీసుకొని అనవసరమైన ఖర్చులు చేయొద్దు. అంటే ఉదాహరణకు మీకు డైమండ్ నెక్లెస్ లేదా ఉంగరం కొనాలని ఉంది. లేదంటే ఖరీదైన మొబైల్ కొనాలని భావిస్తున్నారు. ఇలాంటప్పుడు వ్యక్తిగత రుణం తీసుకొని వీటిని కొనొద్దు. మీ అభిరుచులను నెరవేర్చడానికి పర్సనల్ లోన్ తీసుకుంటే, తర్వాత ఇబ్బందులను పడాల్సి వస్తుంది. అందుకే పర్సనల్ లోన్ తీసుకోవాలని భావించే వారు ఈ విషయాలు గుర్తించుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Bank loans, Loan apps, Personal Loan