Network18 | దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ అయిన నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. క్యూ4 ప్రాఫిట్ 58 శాతం పెరగడం విశేషం.
నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ (Network18 Media & Investments) లాభాల పంట పండిస్తోంది. మార్చిలో ముగిసిన నాలుగో త్రైమాసికం ఫలితాల ప్రకారం ఇయర్ ఆన్ ఇయర్ లాభాలు 58.1 శాతం పెరిగి రూ.61.6 కోట్లకు చేరుకుంది. నెట్వర్క్18 మీడియా కంపెనీ కార్యకలాపాల ద్వారా కన్సాలిడేట్ రెవన్యూ సంవత్సరానికి 14.6 శాతం పెరిగి రూ.1,621.1 కోట్లకు చేరుకోవడం విశేషం. ఆదాయం పెరగడానికి అనేక కారణాలున్నాయి. న్యూస్ బ్రాడ్‌క్యాస్టింగ్, డిజిటల్ కార్యకలాపాల్లో వృద్ధి, ప్రకటనల ఆదాయం పెరగడం, యూజర్ల సంఖ్య కూడా పెరగడం లాంటి కారణాలతో ఆదాయం పెరిగింది.
కొన్ని సంవత్సరాల క్రితం సరికొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలని తీసుకున్న మా నిర్ణయాన్ని ప్రస్తుతం ప్రోత్సాహకరంగా వస్తున్న ఆర్థిక ఫలితాలు సమర్థిస్తున్నాయి. మా కీలకమైన టీవీ సేవల్ని అందిస్తూనే మరోవైపు డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఎదగాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.
2021-22 ఆర్థిక సంవత్సరంలో టీవీ న్యూస్, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ న్యూస్‌లో విభాగాల్లో నెట్వర్క్18 ఆర్థిక పనితీరు అద్భుతంగా ఉంది. 2021-22లో డిజిటల్ వార్తల విభాగం లాభదాయకంగా మారడం హైలైట్‌గా నిలిచింది. గతేడాదితో పోలిస్తే నెట్వర్క్18 గ్రూప్ మొత్తం మార్జిన్లకు దగ్గరగా డిజిటల్ వార్తల విభాగం మార్జిన్లు ఉన్నాయి. అధిక ద్రవ్యోల్బణం వాతావరణం, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వినియోగదారుల డిమాండ్‌ను ప్రభావితం చేసింది. తత్ఫలితంగా, ప్రకటనల ఖర్చులు తగ్గాయి.
బ్రాడ్‌క్యాస్టింగ్
మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్రాడ్‌కాస్టింగ్ వ్యాపారం వృద్ధిని నమోదు చేసింది. నిర్వహణ ఆదాయాలు ఏడాదికి 10 శాతం పెరిగి రూ.346 కోట్లకు చేరుకుంది. బిజినెస్, రీజనల్ న్యూస్, జాతీయ వార్తల విభాగాలలో ప్రకటనల ఆదాయంలో పెరుగుదల కారణంగా 2021-22లో ఆదాయం 14 శాతం పెరిగింది. 2021-22లో ఆపరేటింగ్ మార్జిన్లు 470 బేసిస్ పాయింట్లు పెరిగి 20.7 శాతానికి పెరిగాయి. నిరంతర వ్యయం నియంత్రణలో ఉన్నందున, ఖర్చులలో వృద్ధి 8 శాతానికే పరిమితమైంది.
ఎంటర్టైన్మెంట్ విభాగంలో నాలుగో త్రైమాసికంలో ఆపరేటింగ్ రెవెన్యూ 11 శాతం పెరిగి రూ.1,150 కోట్లకు చేరుకుంది. ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లో వార్షిక ఆపరేటింగ్ ప్రాఫిట్ 23 శాతం పెరిగి రూ.777 కోట్లకు చేరుకుంది. కోవిడ్ కన్నా ముందు 2019-20తో పోలిస్తే 2021-22లో అడ్వర్టైజింగ్ వృద్ధి కనిపించింది. అయితే సెగ్మెంట్ సబ్స్క్రిప్షన్ రాబడి గత ఆర్థిక సంవత్సరంలో ఫ్లాట్‌గా ఉంది. రెండో అర్థభాగంలో సినిమా ఆదాయం సాధారణ స్థితికి చేరుకుంది.
డిజిటల్ న్యూస్
వస్తే నెట్వర్క్18 మీడియాకు డిజిటల్ న్యూస్ వ్యాపారం నిలకడగా ఉంది. ఆపరేటింగ్ రెవెన్యూ 32 శాతం పెరిగి రూ.80 కోట్లకు పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆపరేటింగ్ ప్రాఫిట్ 77 శాతం పెరిగింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.