కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023-24 (Budget 2023-24) ప్రవేశపెట్టారు. గత మూడు రోజులుగా దేశంలో అన్ని వర్గాల్లో ఈ బడ్జెట్ గురించి చర్చ జరుగుతోంది. ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజాకర్షక చర్యలు లేని బడ్జెట్‌గా కనిపించింది. అనేక ఏళ్లుగా అధిక ఖర్చుల తర్వాత ఆహారం, ఎరువుల సబ్సిడీలను సడలించడం ఇందులో ఒకటి. మరోవైపు, పన్ను నిర్వహణను సులభతరం చేసేందుకు కొత్త పన్ను విధానంలోకి (New Tax Regime) మారడానికి పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
కోవిడ్ -19, యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారీ మందగమనం ఉన్నా, ఈ ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధితో భారతదేశం ముందుకు సాగుతుందని, అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అత్యధికంగా 'ప్రకాశవంతమైన నక్షత్రం'గా భారత ఆర్థిక వ్యవస్థ గుర్తించబడుతుందని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హైలైట్ చేసిన సంగతి తెలిసిందే.
IRCTC Bharat Gaurav Train: మరో గుడ్ న్యూస్... సికింద్రాబాద్ నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
The Biggest Budget Exclusive Interview with Finance Minister Nirmala Sitharaman @2pm Today | News18 Telugu #FMToNetwork18 #budget2023 #Network18 pic.twitter.com/tNn1xhyh7f
— News18 Telugu (@News18Telugu) February 3, 2023
భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో ఉందని, సవాళ్ల సమయం ఉన్నా, ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బాండ్ మార్కెట్లు ఆర్థిక నిశ్చలతను ఉత్సాహపరిచాయి. పరిశ్రమకు సంబంధించి బడ్జెట్‌తో ఎలాంటి ఫిర్యాదులు లేవు. అయినా ఈ బడ్జెట్‌కు సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని ఒక పెద్ద, మరింత సంపన్న ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
అనేక రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది ప్రారంభంలో సాధారణ ఎన్నికలు ఉన్నందున, స్థూల ఆర్థిక స్థిరత్వ ఆందోళనలు ప్రధాన అంశంగా కొనసాగుతాయా?
ప్రభుత్వం చివరికి పాత వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని తొలగిస్తుందా?
అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ పాలసీ అమలు స్థితి ఏమిటి?
Income Tax Example: లిమిట్ కన్నా రూ.10 ఆదాయం ఎక్కువా? అయితే రూ.26,001 పన్ను కట్టాల్సిందే
ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. Network18 ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఇలాంటి అనేక ఇతర సమస్యలకు సమాధానాలు రానున్నాయి. నెట్వర్క్18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ జోషీ బడ్జెట్ 2023 అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఇంటర్వ్యూ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమయ్యే ఇంటర్వ్యూను న్యూస్18 లో చూడండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023, Network18, Nirmala sitharaman, Personal Finance