హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2022: ఇది ఎన్నికల బడ్జెట్ కాదు...ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే బడ్జెట్..Network18 Exclusive ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్..

Union Budget 2022: ఇది ఎన్నికల బడ్జెట్ కాదు...ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే బడ్జెట్..Network18 Exclusive ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్..

Rahul Joshi Exclusive interview with Finance Minister Nirmala Sitharaman

Rahul Joshi Exclusive interview with Finance Minister Nirmala Sitharaman

FM Nirmala Sitharaman Exclusive Interview With Rahul Joshi | బడ్జెట్‌ను రూపొందించే సమయంలో ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను పరిగణనలోకి తీసుకోలేదని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

  FM Nirmala Sitharaman Exclusive Interview With Rahul Joshi | బడ్జెట్‌ను రూపొందించే సమయంలో ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను పరిగణనలోకి తీసుకోలేదని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని నిర్మల పేర్కొన్నారు. నెట్‌వర్క్ 18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషితో ప్రత్యేక సంభాషణలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కరోనా మహమ్మారి నుండి బయటపడి సానుకూల పునరుజ్జీవన సంకేతాలను చూపుతున్న ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థకు బలమైన మద్దతు అవసరమని పేర్కొన్నారు.  కరోనా మహమ్మారి నుండి బయటపడి, చాలా సానుకూల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడం కోసం మరింత సహాయం, ఉద్దీపనలను అందించాలని, తద్వారా వ్యవస్థ పునరుజ్జీవనం స్థిరంగా బలంగా ఉంటుంది" అని సీతారామన్ అన్నారు.

  మరో రెండు వారాల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రకటనలు ఏమీ లేకపోవడం గమనార్హం. ఇది గత ఏడాది బడ్జెట్‌కు పూర్తి భిన్నంగా ఉంది, గతంలో ఎన్నికలకు వెళ్లే నాలుగు రాష్ట్రాలకు గణనీయమైన కేటాయింపులు చేశారు. కానీ ఈ సారి మాత్రం ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చోటు చేసుకోలేదని నిపుణులు పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకతను సంతరించుకుంది.

  పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి..

  "ఈ బడ్జెట్‌ ప్రారంభ దశలోనే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడిపై ఎక్కువ దృష్టి సారించామని, అలాగే ప్రభుత్వానికి మూలధన వ్యయం కొనసాగించాలి. గత సంవత్సరం కూడా మేము మంచి పెరుగుదలను సాధించామన ఆమె చెప్పారు.

  రాష్ట్రాలు తమ మౌలిక సదుపాయాల వ్యయంతో ముందుకు సాగేందుకు అవసరమైనంత సాయం చేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఆర్థిక మంత్రి వివరించారు. "కాబట్టి మొదటి నుండి, ప్రధానమంత్రి మనస్సులో స్పష్టత ఉందని నేను భావిస్తున్నాను, ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పనపై ప్రజా వ్యయం ద్వారా మాత్రమే వృద్ధిని నిర్ధారించాలి కొనసాగించాలి," అని ఆమె అన్నారు.

  "ఎన్నికలు వస్తాయి, పోతాయి, కానీ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఈ సమయంలో, బలమైన మద్దతు అవసరం" అని ఆమె అన్నారు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Union Budget 2022

  ఉత్తమ కథలు