నెట్‌వర్క్ 18 ఘనత.. రోజుకు సగటున 19 కోట్ల మంది వ్యూయర్స్...

42 కోట్ల వ్యూయర్స్‌ను సాధించిన నెట్ వర్క్ 18

మార్చి 21 నుంచి మార్చి 27వ తేదీ వరకు 42 కోట్ల మంది ప్రేక్షకులను నెట్ వర్క్ 18 ఛానల్స్ సాధించడం ద్వారా దేశంలోనే అతి పెద్ద న్యూస్ నెట్ వర్క్‌గా నిలిచింది.

 • Share this:
  కరోనా వైరస్ లాక్ డౌన్ రెండో వారంలో నెట్ వర్క్ 18 ఛానల్స్ రోజుకు సగటున 19 కోట్ల మంది ప్రేక్షకులను రీచ్ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రముఖ రేటింగ్ సంస్థ బార్క్ తెలియజేసింది. మార్చి 21 నుంచి మార్చి 27వ తేదీ వరకు 42 కోట్ల మంది ప్రేక్షకులను నెట్ వర్క్ 18 ఛానల్స్ సాధించడం ద్వారా దేశంలోనే అతి పెద్ద న్యూస్ నెట్ వర్క్‌గా నిలిచింది. గత వారంతో పోలిస్తే ఈ వారం సగటున రోజుకు 19 కోట్ల మంది ప్రేక్షకులను రీచ్ అవ్వడం అంటే సుమారు 90 శాతం పెరుగుదల నమోదైనట్టు. అదే సమయంలో గత వారంతో పోలిస్తే, రోజుకు సగటున లెక్కించినా ఇప్పటికే 50శాతం వృద్ధి నమోదైంది.

  ఓవరాల్‌గా చూస్తే భారతీయుల టీవీ వీక్షించే సమయం కూడా భారీగా పెరిగింది. 1.2 ట్రిలియన్ నిమిషాల సమయాన్ని భారతీయులు టీవీ చూడడంలో గడిపారు. ఇది గతంలో ఎన్నడూ లేదు. కరోనా లాక్ డౌన్ తర్వాత రెండో వారంలో టీవీ చూసే సమయం 37 శాతం పెరిగినట్టు బార్క్ ప్రకటించింది.

  మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజున నెట్ వర్క్ 18కు చెందిన ఇంగ్లీష్, హిందీ, ఇతర చానల్స్ అన్నీ కలిపి 22.12కోట్ల వ్యూయర్‌షిప్‌ను సాధించాయి. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రసారం అయిన ‘100 నగరాలు.. 100 రిపోర్టర్లు’ కార్యక్రమాన్ని సుమారు 2 కోట్ల మంది వీక్షించారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేరకు ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలు అందరూ తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి గేటు ముందు నిలబడి కరోనా వైరస్ మీద పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.

  మార్చి 21 నుంచి 27 మధ్యన సగటున రోజుకు 62 కోట్ల మంది టీవీని వీక్షించారు. అందులో 47.3 కోట్ల మంది టీవీ చానల్స్‌ను వీక్షించారు. అందులో 19 కోట్ల మంది నెట్‌వర్క్ 18ను వీక్షించారు.

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 24న 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన రోజు కూడా దేశంలో భారీ ఎత్తున ప్రజలు టీవీలను వీక్షించారు. ప్రధాని మోదీ 30 నిమిషాల ప్రసంగాన్ని నెట్ వర్క్ 18 ఛానల్స్‌లో 19.46 కోట్ల మంది వీక్షించారు.

  కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత టీవీ, డిజిటల్ మీడియాలో కంటెంట్ కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. బార్క్ - నీల్సన్ డేటా ప్రకారం టీవీ చూసే వారి సంఖ్య దేశంలో 8 శాతం పెరిగింది. అందులో ఎక్కువ మంది న్యూస్ చానల్స్, వినోదం, సినిమాలు చూస్తున్నారు. టీవీ చానల్స్ వ్యూయర్‌షిప్‌లో 57శాతం వృద్ధి నమోదైంది. టీవీ చానల్స్ సగటున చూస్తే 34 శాతం వృద్ధి నమోదైంది. ఇతరత్రా (సినిమా, వినోదం, క్రీడలు, వగైరా) ఎందులో కూడా ఈ స్థాయి గ్రోత్ రేట్ నమోదు కాలేదు.

  ‘టీవీ అనేది ఇంటికి సంబంధించినది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అంతా టీవీలకు అతుక్కుపోయారు.’ అని బార్క్ ఇండియా సీఈవో సునీల్ లల్లా అన్నారు. ‘ప్రేక్షకులు బయటకు వెళ్లడానికి ఏమీ లేదు. విచిత్రంగా ఇప్పుడు పిల్లలు కూడా వార్తలు చూస్తున్నారు. దీంతో న్యూస్ చానల్స్ వ్యూయర్‌షిప్ పెరిగింది. వినియోగదారుడు టీవీలో చూసిన వార్తలను నిజమని నమ్ముతారు.’ అని ఆయన అన్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: