Home /News /business /

NETWORK 18 MEDIA AND INVESTMENTS CLOCKS RECORD OPERATING PROFITS OPERATING REVENUES IN Q3 SS

Network18: లాభాల్లో రికార్డులు సృష్టించిన నెట్వర్క్18

Network18: లాభాల్లో రికార్డులు సృష్టించిన నెట్వర్క్18

Network18: లాభాల్లో రికార్డులు సృష్టించిన నెట్వర్క్18

Network18 | నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (Network 18) మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. మూడో త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది.

    నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (Network 18) మూడో త్రైమాసికానికి రూ.373 కోట్ల క్వార్టర్లీ ఆపరేటింగ్ ప్రాఫిట్‌తో రికార్డులు సృష్టించింది. ఒక త్రైమాసికంలో ఇదే అత్యధిక ఆపరేటింగ్ ప్రాఫిట్ కావడం విశేషం. 2021 డిసెంబర్ 31 నాటికి ముగిసిన మూడో త్రైమాసికానికి సంబంధించిన క్వార్టర్లీ రిజల్ట్స్‌ని (Quarterly Results) నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రకటించింది. టీవీ, డీజిటల్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్‌లో గణనీయమైన లాభాలతో నెట్వర్క్18 దూసుకెళ్లడం విశేషం. క్వార్టర్లీ రెవెన్యూ రూ.1657 కోట్లు కాగా ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 16.5 శాతం పెరిగింది. ఒక త్రైమాసికంలో ఇది కూడా అత్యధికమే.

    నెట్వర్క్18 త్రైమాసిక ఫలితాల్లో ఇతర హైలైట్స్ చూస్తే రీజనల్ మార్కెట్లలో రెవెన్యూ పెరగడంతో రీజనల్ న్యూస్ పోర్ట్‌ఫోలియో తొలిసారిగా లాభాలను తీసుకొచ్చింది. ఆదాయాలు పెరగడం, ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్‌ని నియంత్రించడం, ఫైనాన్స్ ఖర్చులు తగ్గడం కారణంగా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ లెక్కన చూస్తే 31 శాతం పెరిగి రూ.337 కోట్లకు చేరుకుంది. వినియోగదారులు, అడ్వర్టైజర్లు డిజిటల్ అడ్వర్టైజింగ్ వైపు మొగ్గుచూపుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే డిజిటల్ న్యూస్ ద్వారా అడ్వర్టైజింగ్ రెవెన్యూ రెండు రెట్లు వచ్చినట్టు తెలిపింది. డిజిటల్ అడ్వర్టైజింగ్‌లో అధిక వాటాను పొందడానికి బలమైన రీచ్‌పై దృష్టి పెట్టామని, డిజిటల్ వినియోగం పెరిగిందని తెలిపింది.

    Jio New Plan: జియో నుంచి మరో యాన్యువల్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

    బలమైన ప్రకటనల డిమాండ్ కారణంగా తమ నెట్‌వర్క్ ఇయర్ టు డేట్ ప్రకటనల ఆదాయాలు ఇప్పటికే 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి సంవత్సర రికార్డును చేరుకుందని తెలిపింది. గత 18 నెలలుగా డిజిటల్ న్యూస్ సెగ్మెంట్ నిరంతరాయంగా విస్తరిస్తోందని, పెరుగుతున్న డిజిటల్ యూనివర్స్‌లో తమ పోర్ట్‌ఫోలియో రీచ్ గత 18 నెలలుగా పెరుగుతోందని నెట్వర్క్18 వెల్లడించింది. రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధి 41 శాతం ఉందని, లాభదాయకతలో కూడా పెరుగుదల కనిపించిందని, ఈ వ్యాపారం బ్రేక్ ఈవెన్ అయిన ఒక సంవత్సరంలోనే సమానమైన మార్జిన్‌లను అందిస్తుందని తెలిపింది. ఆపరేటింగ్ మార్జిన్ 21.2 శాతంగా ఉందని తెలిపింది.

    మేము భారతీయ ప్రేక్షకులకు నాణ్యమైన కంటెంట్‌ను అందించడమే కాకుండా వాటాదారులకు విలువను అందించే బలమైన, స్థిరమైన మీడియా ఫ్రాంచైజీని నిర్మిస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా, మేము లాభదాయకత సాధించేందుకు అనేక చర్యలు తీసుకున్నాము. మాధ్యమాల్లో కంటెంట్ వినియోగం పెరుగుతూనే ఉన్నందున, వారి స్థానిక భాషలు, సినిమాలు, స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు సంబంధించిన వార్తలు, వినోద కంటెంట్ కోసం వెతుకుతున్న వినియోగదారుల కోసం కావాల్సిన ప్లాట్‌ఫామ్ రూపొందించడమే మా లక్ష్యం.
    ఆదిల్ జైనుల్‌భాయ్, టీవీ18 ఛైర్మన్


    Gas Cylinder: గుడ్ న్యూస్... ఫుడ్ డెలివరీ లాగానే 2 గంటల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ

    మొబైల్ ఫస్ట్ ఇంటర్నెట్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని వేర్వేరు టాపిక్స్, వినూత్నమైన రిపోర్టింగ్ ఫార్మాట్స్ పరిచయం చేస్తున్నందున నెట్వర్క్18 డిజిటల్ వార్తల ప్లాట్‌ఫామ్స్ రీచ్ ఇయర్ ఆన్ ఇయర్‌లో 50 శాతం పెరుగుతున్నట్టు తెలిపింది. ఇంటర్నెట్ యూజర్లలో, జనరల్ న్యూస్, ఫైనాన్స్, క్రికెట్, ప్రంతీయ భాషల్లో 50 శాతానికి పైగా రీచ్ సాధించడంతో అడ్వర్టైజర్లు వినియోగదారుల్ని చేరుకోవడానికి తమ వెబ్‌సైట్స్ సరైన వేదికగా నిలుస్తున్నాయని వివరించంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Network18

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు