ఇక్కడ Netra Suraksha వారి ఆన్లైన్ సెల్ఫ్ చెక్అప్ సర్వేను తీసుకోండి.
భారతదేశంలో మధుమేహం వ్యాధి నిస్సందేహంగా పెరుగుతోంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అట్లాస్ 2021 అంచనా ప్రకారం, 2021 నాటికి భారతదేశంలోని వృద్ధుల జనాభాలో దాదాపు 74 మిలియన్ల వరకు డయాబెటిస్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ సంఖ్య 2030లో 93 మిలియన్లకు, 2045లో 124 మిలియన్లకు పెరగవచ్చని ఈ సంస్థ తన ఊహాగానాలను వెల్లడించింది.
డయాబెటిస్ సంబంధిత అత్యంత భయంకరమైన సమస్యలలో డయాబెటిక్ రెటినోపతి ప్రధానమైనది. 21 భారతీయ జిల్లాల్లో AIIMS, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు నిర్వహించిన సర్వే ప్రకారం మరియు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపెయిర్మెంట్ వారి అంచనా ప్రకారం, 17% మంది యాబెటిస్ రోగులు రెటినోపతితో1 బాధపడుతున్నారని వెల్లడైంది. డయాబెటిక్ రెటినోపతి అనేది ఒక విచిత్రమైన వ్యాధి. ప్రారంభ దశలలో గుర్తించదగిన లక్షణాలు ఏవి ఉండవు - కొంత మంది వ్యక్తులకు చదవడంలో ఇబ్బంది ఎదురవుతుంది, కానీ అది వస్తూ వెళ్తూ ఉంటుంది. తరువాతి దశలలో, రెటీనాలోని రక్త నాళాల నుండి రక్తస్రావం మొదలవుతుంది, తద్వారా తేలియాడే మచ్చలు ఏర్పడతాయి, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో దృష్టిని కూడా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంటుంది.
నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ (US నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లోని ఒక విభాగం) ప్రకారం, డయాబెటిస్ వల్ల శరీరంలోని అన్ని రక్తనాళాలు దెబ్బతింటాయి. కళ్లలోని రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు అవి లీకేజీకి గురవుతాయి లేదా రక్తస్రావం జరుగుతుంది. కొన్ని రక్తనాళాలు మూసుకుపోతాయి. డయాబెటిక్ రెటినోపతి అనేది డయాబెటిక్ మాక్యులర్ ఎడెమాకు కూడా దారితీయవచ్చు - ఈ పరిస్థితి డయాబెటిస్ ఉన్న 15 మంది రోగులలో ఒకరికి సంభవిస్తుంది, ఇది మసకబారిన చూపుకు దారితీస్తుంది. డయాబెటిక్ రెటినోపతి రెటీనా నుండి అసాధారణ రక్త నాళాల పెరుగుదలకు కారణమవుతుంది, కంటి నుండి ద్రవం కారడాన్ని అడ్డుకుంటుంది. ఇది ఒక రకమైన గ్లాకోమాకు కారణమవుతుంది, పూర్తిగా అంధత్వానికి దారితీస్తుంది.
మనం ఇక్కడ అంచనా వేసుకున్నట్లయితే, 2021లో కేవలం డయాబెటిక్ రెటినోపతితో బాధపడే వారి సంఖ్య మాత్రమే దాదాపుగా 12.5 మిలియన్ల వరకు ఉంది.
అయితే, ఈ సంఖ్యలు భయానకంగా ఉన్నప్పటికీ, వ్యాధి స్వయంగా అధిగమించలేనిదేమి కాదు. వాస్తవానికి, డయాబెటిక్ రెటినోపతిని మనం సాధారణ కంటి పరీక్షలు, కొన్ని జీవనశైలిలో మార్పుల ద్వారా పూర్తిగా నివారించవచ్చు. అనేక దేశాల్లో సిస్టమాటిక్ స్క్రీనింగ్ అవలంబించబడుతుంది. యునైటెడ్ కింగ్డమ్లో, నేడు డయాబెటిక్ రెటినోపతి అనేది పని-చేసే వయస్సులో ఉన్న జనాభాలో అంధత్వానికి ప్రధాన కారణం కాదు. అదేవిధంగా, వేల్స్లో రెగ్యులర్ స్క్రీనింగ్ అమలు దగ్గర నుండి, దృష్టి లోపం గురించిన కొత్త సర్టిఫికేషన్ల సంభవం అనేది కేవలం 8 సంవత్సరాలలో 40-50% మధ్యన తగ్గింది.
అందుచేతనే Network18, 'Netra suraksha' - డయాబెటిస్ రహిత భారతదేశం అనే కొత్త చొరవను సగర్వంగా ప్రారంభించింది, దీనిపై ప్రజలలో అవగాహన పెంచడానికి, ఈ వ్యాధిని మెరుగ్గా ఎదుర్కోవడానికి భారతీయ వైద్య సంఘం Novartisతో కలిసి, గొప్ప మేధావులు మరియు పాలసీ మేకర్స్‌తో సమర్థవంతమైన భాగస్వామ్యాన్ని నిర్మించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమం తొలుత నవంబర్ 27, 2021న వరుస రౌండ్ టేబుల్ సమావేశాలతో ప్రారంభమైంది, అందులో మొదటిది అదే రోజు సాయంత్రం 6 గంటలకు CNN News18 TVలో ప్రసారం చేయబడింది. మీరు వాటిని YouTube, News18.com మరియు https://www.facebook.com/cnnnews18/ లో కూడా చూడవచ్చు.
ఈ సంభాషణలు ముఖ్యంగా వ్యాధి గుర్తింపు, సకాలంలో నివారణ, అందుబాటులో ఉన్న చికిత్సలపై దృష్టి పెడతాయి. దీని తర్వాత రాబోయే వారాల్లో మరో 2 రౌండ్‌టేబుల్ సెషన్లు జరుగుతాయి. మేము వ్యాధికి సంబంధించిన వివిధ అంశాలను మీ కళ్లకు కట్టినట్టుగా చూపించడానికి వివరణాత్మక వీడియోలను మరియు కథనాలను ఉపయోగిస్తాము, అలాగే ఆశాజనకంగా, డయాబెటిస్ రోగులు వారికి అనుకూలంగా వారే స్వయంగా చర్యలు తీసుకునేలా ప్రేరేపిస్తాము.
విషయాన్నీ బయటికి వెల్లడిస్తూ, ఈ వ్యాధిని సులభంగా నిర్వహించడాన్ని గురించి అవగాహన కల్పిస్తూ, ఈ భయానకమైన సంఖ్యల పరిమాణాన్ని తగ్గించడానికి మా వంతు కృషి చేయాలని మేము ఆశిస్తున్నాము.
ఇక్కడే మీ కర్తవ్యం కూడా మొదలవుతుంది, నేడు, మీరు భారతదేశంలోని ఒక పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, మీ స్నేహితులు, సహోద్యోగులు మరియు మీ ప్రియమైనవారి బంధుత్వంలో ఎవరైనా డయాబెటిస్తో బాధపడుతూనే ఉంటారు. ఈ చొరవ గురించి వారితో మాట్లాడండి (లేదా ఈ కథనాన్ని వారికి షేర్ చేయండి!), వారు వారి కళ్లను చివరి సారిగా ఎప్పుడు పరీక్షించుకున్నారోనని అడగండి. ఒకవేళ కొన్ని నెలల కంటే ఎక్కువ సమయం గడిచినట్లయితే, డయాబెటిక్ రెటినోపతి స్వీయ చెక్అప్ కోసం ఇక్కడ (హైపర్లింక్) క్లిక్ చేయమని మరియు సాధారణ, నొప్పిలేకుండా కంటి పరీక్ష కోసం వారి వైద్యుడిని సందర్శించమని వారిని రిక్వెస్ట్ చేయండి.
మీరు కూడా దాని వద్ద ఉన్నప్పుడు, మిమ్మల్ని కూడా పరీక్షించుకోండి. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ అట్లాస్ 2021 ప్రకారం, భారతదేశంలో 39.3 మిలియన్ల మంది ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని నిర్ధారణ కాలేదు. మిమ్మల్ని మీరు మరొక గణాంకాలుగా మార్చుకోవద్దు. Netra suraksha చొరవ గురించి మరిన్ని అప్డేట్ల కోసం News18.comని అనుసరించండి, డయాబెటిక్ రెటినోపతికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో మిమ్మల్ని మీరు భాగస్వాములుగా చేసుకోవడానికి సిద్ధం అవ్వండి.
Source :
1. నేషనల్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపెయిర్మెంట్ సర్వే 2015-2019, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంటర్ ఫర్ ఆప్తాల్మిక్ సైన్సెస్, AIIMS, న్యూఢిల్లీ
2. https://www.nei.nih.gov/learn-about-eye-health/eye-conditions-and-diseases/diabetic-retinopathy
3. IDF అట్లాస్, ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్, 10వ శీర్షిక, 2021
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.