హోమ్ /వార్తలు /బిజినెస్ /

డయాబెటిక్ రెటినోపతి - ముందుగా హెచ్చరించేది మీ కోసమే..

డయాబెటిక్ రెటినోపతి - ముందుగా హెచ్చరించేది మీ కోసమే..

Netra Suraksha

Netra Suraksha

దాదాపుగా 20-79 సంవత్సరాల వయస్సు గల 537 మిలియన్ల మంది వృద్ధులు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు, వారి సంఖ్య 2030 నాటికి 643 మిలియన్లకు మరియు 2045 నాటికి 784 మిలియన్లకు చేరుతుందని అంచనా వేయబడింది.

Netra Suraksha వారి ఆన్‌లైన్ సెల్ఫ్ చెక్‌అప్ సర్వేను ఇక్కడ తీసుకోండి.

డయాబెటిస్ అధిక బరువు ఉన్నవారికి, స్వీట్లను ఎక్కువగా ఇష్టపడేవారికి మరియు వయోజనులకు మాత్రమే వస్తుందనే అనేక అపోహల్లో ఇది ఒకటి. అయితే, వాస్తవాలు వేరే కథను చెబుతున్నాయి.

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అట్లాస్ 20211 ప్రకారం: 

● దాదాపుగా 20-79 సంవత్సరాల వయస్సు గల 537 మిలియన్ల మంది వృద్ధులు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు, వారి సంఖ్య 2030 నాటికి 643 మిలియన్లకు మరియు 2045 నాటికి 784 మిలియన్లకు చేరుతుందని అంచనా వేయబడింది.

● అలాగే, అంచనా వేయబడిన 1.2 మిలియన్ల మంది పిల్లలు మరియు యుక్తవయస్కులు (20 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు గలవారు) టైప్1 డయాబెటిస్‌ని కలిగి ఉన్నారు.

● ముఖ్యంగా 2021 సంవత్సరంలోని గర్భధారణతో జన్మించిన 21 మిలియన్ల మంది పిల్లలు హైపర్‌గ్లైసీమియా బారిన పడ్డారు.

భారతదేశంలోని ఈ సంఖ్యలను చూడటం అంత తేలికైన విషయం కాదు. అట్లాస్ ప్రకారం, భారతదేశంలో 2021 నాటికి 74 మిలియన్ల మంది డయాబెటిస్ రోగులు ఉన్నారు, 2030లో వారి సంఖ్య 93 మిలియన్లకు మరియు 20451లో 124 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది. అంతేకాకుండా, అదనంగా భారతదేశంలో దాదాపు 39.3 మిలియన్ల మంది ప్రజలు వ్యాధి నిర్ధారణ1 చేబడని డయాబెటిస్ రోగులుగా ఉన్నట్లు సమాచారం.

డయాబెటిస్ అనేది ప్రధానంగా పట్టణ ప్రాంతానికి సంబంధించిన వ్యాధిగా పరిగణించడం ఒక గంభీరమైన ఆలోచన. ఈ రోజుల్లో భారతీయులు ఎక్కువగా నగరవాసులుగా మారుతున్నారు, నిశ్చలంగా ఉంటున్నారు - తరచుగా ఆఫీస్, ఉద్యోగం సంబంధిత విధులలో బిజీగా ఉంటున్నారు. అయితే, టైప్ II డయాబెటిస్ అనేది ఒక జీవనశైలి వ్యాధిగా పరిగణించబడుతుంది, కావున దీనిని పూర్తిగా నివారించవచ్చు. అందుకు కావలసిందల్లా సమాచారం, సరైన సమయంలో సరైన వైద్యాన్ని పొందడం. నిజానికి, ఈరోజు చాలా మంది వైద్యులు మధుమేహాన్ని ముందుగానే గుర్తించి, చక్కగా నిర్వహించినట్లయితే, దానిని తరిమికొట్టవచ్చని నమ్ముతున్నారు.

కావున మనం ఒక చిన్న సమాచారంతో మొదలుపెడదాం. డయాబెటిస్ అనేది మన శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడం లేదా ఉత్పత్తి చేసిన ఇన్సులిన్‌ను ఉపయోగించలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇన్సులిన్ క్లోమంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్, ఇది మన రక్తంలోని గ్లూకోజ్‌ను శరీరం ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఇక్కడ డయాబెటిస్‌లో 3 రకాలు4 ఉన్నాయి: జెస్టేషనల్ డయాబెటిస్ మెల్లిటస్ (కొన్నిసార్లు తల్లులు గర్భధారణ సమయంలో దీనిని అభివృద్ధి చేస్తారు), టైప్ I డయాబెటిస్ (సాధారణంగా బాల్యంలో వ్యక్తమవుతుంది మరియు జన్యుపరమైన లక్షణాలను కలిగి ఉంటుంది), టైప్ II (సుమారు 90% రోగులు డయాబెటిస్‌ బారిన పడటానికి కారణమయ్యే ఒక జీవనశైలి వ్యాధి మరియు దీనిని సులభంగా నివారించవచ్చు).

మీరు తెలుసుకోవాల్సిన వ్యాధి సంబంధిత లక్షణాలు: తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, అస్పష్టమైన దృష్టి, శక్తి లేకపోవడం, అలసట, స్థిరమైన ఆకలి మరియు కొన్నిసార్లు ఆకస్మిక బరువు తగ్గడం మరియు బెడ్‌వెట్టింగ్4. మీరు ఈ లక్షణాల కలయికను కలిగి ఉంటే, పరీక్ష చేయించుకోవడానికి ఇది సరైన సమయం. ఈ షుగర్ వ్యాధి మిమ్మల్ని కేవలం అలసిపోయేలా మరియు మతిస్థిమితం లేనివారిగా చేయదు; ఇది శరీరానికి నిజమైన హాని చేస్తుంది.

డయాబెటిస్ మరియు రక్తంలో పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని4 రెట్టింపు చేయడంతో సంబంధం కలిగి ఉంటాయి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో కలిసినపుడు ఇది ఏకంగా 80% వరకు చివరి దశ కిడ్నీ వ్యాధికి4 కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40-60 మిలియన్ల మంది ప్రజలు, మధుమేహ పాదం మరియు దిగువ అవయవాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు - తీవ్రమైన అల్సర్ మరియు పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అని పిలువబడే దీర్ఘకాలిక పరిస్థితి వారి చలనశీలతను4 తీవ్రంగా పరిమితం చేస్తుంది.

అయితే, డయాబెటిస్ యొక్క అత్యంత భయానకమైన మరియు తొందరగా నివారించదగిన సమస్య-డయాబెటిక్ రెటినోపతి. US నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారి నేషనల్ ఐ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం, ఇది డయాబెటిస్ ఉన్నవారిలో, వ్యాధి సమయంలోనే2 సగం కంటే ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ వ్యాధి ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. కొందరు వ్యక్తులు తమ చూపులో మార్పులను గమనిస్తారు, చదవడంలో ఇబ్బంది లేదా దూరంగా ఉన్న వస్తువులను మాత్రమే చూడటం, చూపు మందగించడం వంటివి. కానీ అది తరచుగా వస్తూ పోతూ ఉంటుంది. ఆ తరువాతి దశలలో, రెటీనాలోని రక్త నాళాల నుండి రక్తస్రావం మొదలవుతుంది, తద్వారా తేలియాడే మచ్చలు ఏర్పడతాయి మరియు కొన్ని తీవ్రమైన సందర్భాల్లో, దృష్టి2 పూర్తిగా కోల్పోయే అవకాశం కూడా ఉంది.

అందుకే స్క్రీనింగ్ అంది చాలా ముఖ్యం. వాస్తవానికి, డయాబెటిక్ రెటినోపతి కోసం రెగ్యులర్ స్క్రీనింగ్ విధానాన్ని అమలు చేసిన కేవలం 8 సంవత్సరాలలోనే, UK4లో పని-చేసే వయస్సులో ఉన్న జనాభాలోని అంధత్వానికి, ఇది ప్రధాన కారణం కాకుండా పోయింది. వేల్స్‌లో, ఇది దృష్టి లోపం4f కోసం కొత్త సర్టిఫికేషన్‌ల యొక్క 40-50% తగ్గింపుకు దారితీసింది.

కావున, స్క్రీనింగ్ చర్యలు ఎలాంటివో మాకు తెలుసు. కానీ మీరు పాల్గొన్నపుడు మాత్రమే ఇది పని చేస్తుంది. నేషనల్ డయాబెటిస్ అండ్ డయాబెటిక్ రెటినోపతి సర్వే, ఇండియా (2019) ప్రకారం, షుగర్ వ్యాధి ఉన్న దాదాపు 90% మంది రోగులు, డయాబెటిక్ రెటినోపతి3 కోసం కంటిని పరీక్షించుకోవడానికి ఎప్పుడూ ముందంజ వేయలేదు.

ఇదే డయాబెటిక్ రెటినోపతిపై ప్రత్యేకమైన దృష్టి సారించే Novartis Indiaతో కలిసి, 'Netra Suraksha' - డయాబెటిస్ రహిత భారతదేశం' అనే గొప్ప చొరవకు నాంది పలకడంలో నెట్‌వర్క్18ని ప్రేరేపించింది.

ఈ కార్యక్రమం మొట్టమొదట నవంబర్ 27, 2021న, డయాబెటిక్ రెటినోపతిపై వరుస రౌండ్ టేబుల్ సమావేశాలతో ప్రారంభమవుతుంది, అదే రోజు సాయంత్రం 6 గంటలకు CNN News18లో ప్రసారం చేయబడుతుంది. వీటిని మీరు YouTube, News18.com మరియు https://www.facebook.com/cnnnews18/ లో కూడా చూడవచ్చు.లేదాఈ కార్యక్రమం తొలుత నవంబర్ 27, 2021న వరుస రౌండ్ టేబుల్ సమావేశాలతో ప్రారంభమైంది, వీటిని మీరు YouTube, News18.com మరియు https://www.facebook.com/cnnnews18/ లో చూడవచ్చు.

రాబోయే వారాల్లో మరో రెండు రౌండ్‌టేబుల్ సమావేశాలు షెడ్యూల్ చేయబడ్డాయి. ఈ చొరవ కోసం జరిగే పోరాటంలో వైద్య సంఘాలు, గొప్ప మేథావులు మరియు పాలసీ మేకర్‌లు కూడా పాల్గొంటున్నారు. మీరు ఈ విషయమై News18.comలో అనేక వివరణాత్మక వీడియోలు, కథనాల కోసం కూడా చూడవచ్చు.

ఈ చొరవ యొక్క ముఖ్యోద్దేశం: మీకు అవసరమైన సమాచారాన్ని అందించడం మరియు మీకు, మీ ప్రియమైన వారికి ఒక సాధారణ, నొప్పిలేని కంటి పరీక్షకు ప్రోత్సహించడం, ఇది రాబోయే కాలంలో మీ జీవన నాణ్యతకు సహకరిస్తుంది.

డయాబెటిక్ రెటినోపతి సెల్ఫ్ చెక్‌అప్ ఇక్కడ ప్రారంభించండి, మరియు మీరు కొంతకాలంగా రక్త పరీక్ష చేయించుకోనట్లయితే ఇప్పుడు చేయించుకోండి. డయాబెటిస్, డయాబెటిక్ రెటినోపతి చుట్టూ ఉన్న సంఖ్యలను చూడటం చాలా కష్టం, ముఖ్యంగా భారతీయ నగరాల్లో ఆఫీసుకు వెళ్లే వారిలో ఇది గమనించవచ్చు. అయితే, కనీసం వాటిని చూసేందుకు అయినా మన కళ్లను ఉపయోగించుకునే ప్రత్యేకత మనకు ఉంది, కావున, దానిని అలాగే ఉంచుకుందాం.

Netra Suraksha - డయాబెటిస్ రహిత భారతదేశం అనే మా చొరవను గురించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం News18.comని ఫాలో అవ్వండి, డయాబెటిక్ రెటినోపతి పై భారతదేశం చేస్తున్న పోరాటంలో మిమ్మల్ని మీరు భాగస్వాములు చేసుకోండి.

మూలాలు: 

1. IDF అట్లాస్, ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్, 10వ శీర్షిక, 2021

2. https://www.nei.nih.gov/learn-about-eye-health/eye-conditions-and-diseases/diabetic-retinopathy

3. నేషనల్ బ్లైండ్‌నెస్ అండ్ విజువల్ ఇంపెయిర్‌మెంట్ సర్వే 2015-2019, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంటర్ ఫర్ ఆప్తాల్మిక్ సైన్సెస్, AIIMS, న్యూఢిల్లీ 4. IDF అట్లాస్, ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్, 9వ శీర్షిక, 2019

First published:

Tags: Diabetes, News18

ఉత్తమ కథలు