హోమ్ /వార్తలు /బిజినెస్ /

Wallet Balance Jokes: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ లో భారీగా డిస్కౌంట్లు.. పొట్ట చెక్కలయ్యేలా నెటిజన్ల జోక్స్.. మీరూ కాసేపు నవ్వుకోండి

Wallet Balance Jokes: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ లో భారీగా డిస్కౌంట్లు.. పొట్ట చెక్కలయ్యేలా నెటిజన్ల జోక్స్.. మీరూ కాసేపు నవ్వుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫెస్టివల్ షాపింగ్ చేయలేకపోయిన చాలామంది తమ బ్యాంక్ అకౌంట్స్‌, వాలెట్స్‌లో ఉన్న రూ.100, రూ.200 కంటే ఎక్కువగా లేని బ్యాలెన్స్ చూసుకుని కుమిలిపోతున్నారు. ఇక నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా తమ బాధను వెళ్లబోసుకుంటున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఫెస్టివల్ సీజన్ అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), ఇతర ఈ-కామర్స్ కంపెనీలు వివిధ రకాల వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను ప్రకటించాయి. ఈ భారీ డిస్కౌంట్స్‌ చూస్తుంటేనే ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలని చాలామందికి అనిపిస్తోంది. అయితే ఎంత తక్కువ ధరకి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు వచ్చినా.. వాటిని సొంతం చేసుకునేంత ఆర్థిక స్తోమత లేక చాలా మంది ఫీలవుతున్నారు. డబ్బులు ఉన్నవారు ఫెస్టివ్ డీల్స్ యమ ఫాస్ట్‌గా సొంతం చేసుకుంటుంటే.. డబ్బులు లేని వారు మాత్రం.. 'అయ్యో, ఇంత మంచి ఆఫర్స్‌ మిస్ అయిపోతున్నామే'నని బాధపడుతున్నారు. ఫెస్టివల్ షాపింగ్ చేయలేకపోయిన చాలామంది తమ బ్యాంక్ అకౌంట్స్‌, వాలెట్స్‌లో ఉన్న రూ.100, రూ.200 కంటే ఎక్కువగా లేని బ్యాలెన్స్ చూసుకుని కుమిలిపోతున్నారు. ఇక నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా తమ బాధను వెళ్లబోసుకుంటున్నారు. మింత్రా, అమెజాన్ వంటి సైట్స్‌లో ఇప్పుడు లెక్కలేనన్ని ఆఫర్స్‌ ఉన్నా తమ బ్యాంకు వాలెట్‌లో డబ్బులు లేవని పోస్టులు చేస్తూ తమ మీద తామే జోకులు వేసుకుంటున్నారు.

మీమ్స్‌తో సందడి

కొందరు ఇంటర్నెట్ యూజర్లు కడుపుబ్బా నవ్వించే మీమ్స్‌ క్రియేట్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు. ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ యాక్సెసరీలు, స్మార్ట్‌వాచ్‌లు సగానికిపైగా తగ్గింపు ధరలతో అందుబాటులోకి వచ్చినా.. బ్యాంకు బ్యాలెన్స్ తమను వెక్కిరిస్తున్నట్లు ఫన్నీగా ఫొటో మీమ్స్ క్రియేట్ చేసి వదులుతున్నారు. కొందరు ఏకంగా మూవీ పిక్స్ వాడేస్తూ తమ సిచువేషన్‌ హిలేరియస్‌గా వ్యక్తం చేస్తున్నారు.

Flipkart Big Billion Days Sale: రూ.7 వేలకే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్ లో కనీవినీ ఎరగని ఆఫర్లు.. ఓ లుక్కేయండి

ఈసారి ఈ-కామర్స్ కంపెనీలు ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ 11 మొబైల్స్‌పై మునుపెన్నడూ లేని విధంగా ధరలు తగ్గించాయి. కాగా వాటిని త్వరత్వరగా కార్ట్‌లో యాడ్ చేసుకోవడం తప్ప కొనుగోలు చేయలేకపోతున్నామని నెటిజన్స్ ఫస్ట్రేషన్ వెళ్లగక్కుతున్నారు. ఇప్పుడు మొబైల్ పట్టుకుంటే చాలు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఫెస్టివ్ సేల్ నోటిఫికేషన్లు పంపిచేస్తూ ఏదో ఒకటి కొనుగోలు చేసేలా టెంప్ట్ చేస్తున్నాయని.. తీరా వాలెట్‌ ఓపెన్ చేస్తే జీరో బ్యాలెన్స్ కనిపించి తమను ఏడిపిస్తోంది సరదాగా కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Mobile Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.30,000 లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే

ఇంకొందరు తాము అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2022, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అని ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేశామని.. కానీ ఇప్పుడు బ్యాంక్‌లో బ్యాలెన్స్ లేక బాధపడపోతున్నామని పోస్టులు పెడుతున్నారు. మిడిల్ క్లాస్ బతుకులు ఇంతే అన్నట్లు మరికొందరు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. కొందరు తమ వాలెట్‌లో బ్యాలెన్స్ లేకపోయినా ఆయా ప్రొడక్ట్స్‌పై ఉన్న ఆఫర్స్ చూసి ఆహా.. ఓహో.. అని తరిస్తున్నారు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 30 వరకు ఈ సేల్ లైవ్‌లో ఉండనుంది. ఈ సమయంలో గూగుల్ పిక్సెల్ రూ.27 వేలకే దొరుకుతోంది. అమెజాన్‌లో నిన్ననే మొదలైన గ్రేట్ ఇండియన్ సేల్ కూడా సెప్టెంబర్ 30న ముగియనుంది. అంటే చాలామందికి కరెక్ట్‌గా జీతం చేతికందే సమయానికి ఈ రెండు సేల్స్ కూడా ముగిస్తాయి.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Amazon Great Indian Festival Sale, Flipkart Big Billion Days, Offers

ఉత్తమ కథలు