Byju AD : షారుక్ ఖాన్‌కు కొత్త కష్టాలు...ఆ యాడ్ పై నీలినీడలు...భారీగా బ్రాండ్ వ్యాల్యూ నష్టపోయే చాన్స్..

బైజూస్ యాడ్ లో షారుఖ్ ఖాన్

కొడుకు ఆర్యన్ చేసిన పని తండ్రి షారుఖ్ కెరీర్ పై భారీగానే పడనుంది. డ్రగ్స్ వ్యవహారంలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ జైల్లో రిమాండు ఖైదీగా ఉన్నాడు. కొడుకు చేసిన పని కారణంగా తండ్రి షారుఖ్ బ్రాండ్ వ్యాల్యూ భారీగా పతనం అవుతున్నట్లు తెలుస్తోంది.

 • Share this:
  కొడుకు ఆర్యన్ చేసిన పని తండ్రి షారుఖ్ కెరీర్ పై భారీగానే పడనుంది. డ్రగ్స్ వ్యవహారంలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ జైల్లో రిమాండు ఖైదీగా ఉన్నాడు. కొడుకు చేసిన పని కారణంగా తండ్రి షారుఖ్ బ్రాండ్ వ్యాల్యూ భారీగా పతనం అవుతున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ఇప్పటికే పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ బాలివుడ్ బాద్షా బ్రాండ్ విలువ, ఏ ఇతర హీరోలు అందుకోలేనంత రేంజులో ఉందంటే అతిశయోక్తి కాదు. కానీ కుమారుడు ఆర్యన్ చేసిన పనితో ఒక్కసారిగా షారుఖ్ బ్రాండ్ విలువ పాతాళానికి పడిపోతోందని, మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  షారుఖ్ ఖాన్ అతనితో కలిసి పనిచేస్తున్న కంపెనీలన్నీ నెమ్మదిగా సంబంధాలు తెంచుకునే పనిలో ఉన్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల BYJUs విద్యా సంస్థ షారుఖ్ ఖాన్‌తో తమ బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును నిలిపివేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే కాలంలో BYJUs ప్రకటనల్లో ఇకపై షారుఖ్ ఖాన్ ను చూడలేమని నిపుణులు అంచనా వేస్తున్నారు. షారుఖ్ ఖాన్ స్పాన్సర్ ఒప్పందంలో బైజుస్ ఒక పెద్ద బ్రాండ్. ఈ కంపెనీకి యాడ్స్ చేయడం ద్వారా షారుఖ్ ఖాన్ సంవత్సరానికి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు పొందుతున్నారు. అతను 2017 నుండి బై జ్యూస్ కంపెనీతో సంబంధం కలిగి ఉన్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హ్యుందాయ్, దుబాయ్ టూరిజం, ఐసిఐసిఐ బ్యాంక్‌తో పాటు 40 కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు.

  ప్రస్తుతం, దేశంలోని ప్రసిద్ధ న్యాయవాది సతీష్ మన్షిండే ఆర్యన్ ఖాన్ కేసును చూస్తున్నారు. ఇదిలా ఉంటే  షారుఖ్ ఖాన్ కుటుంబం మొత్తం ఆర్యన్ ఖాన్ జైలు ఖైదు నుంచి ఉపశమనం పొందుతుందని ఆశతో ఉన్నారు. అయితే ఇటీవల ఎన్‌సిబి విచారణ, మేజిస్ట్రేట్ ప్రశ్నల మధ్య, ఆర్యన్ ఖాన్ ను ఆర్థర్ జైలుకు 4 రోజులు పంపించారు. ఆర్థర్ జైలులో నిందితుడు ఆర్యన్ ఖాన్ సాధారణ ఖైదీ వలె నడుచుకోవాల్సి ఉంటుంది. ఒక సాధారణ ఖైదీ చేసే అన్ని పనులను వారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ విషయంపై తదుపరి విచారణలో ఆర్యన్ ఖాన్ కోసం ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి.
  Published by:Krishna Adithya
  First published: