NETFLIX KEY DECISION NO MORE PAYING EXTRA FOR PASSWORD SHARING GH VB
Netflix: నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం.. పాస్ వర్ట్ ను మీ ఫ్రెండ్ కు షేర్ చేస్తున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..
(ప్రతీకాత్మక చిత్రం)
ప్రముఖ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తన వినియోగదారులకు అదనపు ఛార్జీలు వేసేందుకు సిద్దమవుతోంది. ఒకే అకౌంట్ ద్వారా మల్టిపుల్ యూజర్లు కంటెంట్ స్ట్రీమింగ్ చేయడాన్ని అరికట్టేందుకు కొత్త రకమైన యూజర్ ఛార్జీలను వసూలు చేయనుంది.
ప్రముఖ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్(Netflix) తన వినియోగదారులకు అదనపు ఛార్జీలు వేసేందుకు సిద్దమవుతోంది. ఒకే అకౌంట్ ద్వారా మల్టిపుల్ యూజర్లు కంటెంట్ స్ట్రీమింగ్ చేయడాన్ని అరికట్టేందుకు కొత్త రకమైన యూజర్ ఛార్జీలను వసూలు చేయనుంది. చాలా మంది ఒక అకౌంట్ తీసుకొని తమ బంధువులు, స్నేహితులకు లాగిన్ డీటెల్స్ షేర్(share) చేస్తుంటారు. దీని వల్ల, ఒకే చెల్లింపుపై ఇతరులు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సేవలు పొందుతున్నారు. ఈ కారణంగా నెట్‌ఫ్లిక్స్ ఆదాయానికి గండి పడుతోంది. అందుకే, ఇకపై షేరింగ్‌తో లాగిన్ అయ్యే యూజర్లకు సైతం ఛార్జీలు వసూలు చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది.
ఒకే పాస్ వర్డ్‌ను ఎక్కువ మందికి షేర్ చేసి.. లాగిన్ అయితే అదనపు ఛార్జీలు వేయాలని నెట్ ఫ్లిక్స్ యోచిస్తోంది. పాస్ వర్డ్‌ను షేర్ చేసే ప్రైమరీ అకౌంట్ హోల్డర్స్ నుంచి ఈ ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా చిలీ, కోస్టారికా, పెరూ దేశాల్లో ఇప్పటికే టెస్ట్ రన్ మొదలుపెట్టింది. ఆయా దేశాల్లో ఒకే అకౌంట్‌తో ఎక్కువ డివైజ్‌లలో లాగిన్ చేసిన వారిని గుర్తించి.. ప్రతి నెలా రెండు నుంచి మూడు అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.150 నుంచి రూ.225) వరకు అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. త్వరలోనే ఈ కొత్త నిబంధనలను భారత్‌లో సహా అన్ని దేశాల్లో అమలు చేయనుంది.
Android Users: ఆండ్రాయిడ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఈ పాత మాల్వేర్ చొరబడితే అంతే ఇక.. బ్యాంక్ ఖాతా ఖాళీ..
లాక్డౌన్ సమయంలో విపరీతంగా పెరిగిన సబ్స్క్రిప్షన్లు..
దీనిపై నెట్‌ఫ్లిక్స్ లో ప్రొడక్షన్ ఇన్నోవేషన్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న చెంగ్యీ లాంగ్ మాట్లాడుతూ ‘‘ఒకేచోట కలసి ఉండే వారి కోసం అకౌంట్లను షేర్ చేసుకునేందుకు మేం అవకాశం కల్పించాం. ప్రత్యేక ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని మొబైల్, టీవీ, కంప్యూటర్లలో స్ట్రీమింగ్ చేసుకునేందుకు స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాం. అయితే, ఈ ప్లాన్లకు ఎంతటి పాపులారిటీ వచ్చిందో.. అకౌంట్ల షేరింగ్ విషయంలో అంతే కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే, కొంతమంది తమ స్నేహితులు, బంధువులకు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి ఉచితంగా కంటెంట్ స్క్రీమింగ్కు అవకాశం కల్పిస్తున్నారు.
దీని ద్వారా, గణనీయంగా రాబడి తగ్గుతోంది. తద్వారా, మా ఒరిజినల్ సబ్స్క్రైబర్లకు మరిన్ని అద్భుతమైన సినిమాలను అందించడంపై ఇది ప్రభావం చూపిస్తోంది.’ అని అన్నారు. ప్రస్తుతం, స్ట్రీమింగ్ టెలివిజన్ మార్కెట్లో పోటీ పెరుగుతోంది. అయినప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ టాప్ ప్లేస్‌లో రాణిస్తోంది. గతేడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్ 221.8 మిలియన్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. కరోనావైరస్ లాక్డౌన్ సమయంలో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, 2022 మొదటి త్రైమాసికంలో పరిస్థితులు మెరుగ్గా కనిపించడం లేదు. అందుకే, ఆదాయ మార్గాలు పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.