Netflix : మీకు ఏవియేషన్ రంగంలో స్థిరపడాలనే కోరిక ఉందా? అయితే మీ కోసం ఓ అద్భుతమైన అవకాశం ఎదురుచూస్తోంది. ఏవియేషన్ రంగంలో(Aviation sector) ఉద్యోగం అంటే.. ఏదో ప్రముఖ విమానయాన సంస్థలో అనుకుంటే పొరపాటే.. ఈ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్(Netflix). అభివృద్ధి నెమ్మదించడం, స్ట్రీమింగ్ స్పేస్‌లో పోటీ పెరగడంతో ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వందల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కంపెనీ ఫ్లైట్ అటెండెంట్‌ను రిక్రూట్ చేసుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగానికి ఏడాదికి దాదాపు రూ.3 కోట్ల వరకు జీతం అందిస్తామని ప్రకటించింది.
వివరాల్లోకి వెళ్తే.. నెట్‌ఫ్లిక్స్ తన ప్రైవేట్ జెట్‌లలో ఒకదానికి ఫ్లైట్ అటెండెంట్‌ని రిక్రూట్ చేసుకుంటోంది. సెలక్ట్ అయిన ఉద్యోగికి సంవత్సరానికి 385,000 డాలర్లు (రూ.3,14,34,287) చెల్లిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఉద్యోగ ప్రకటన వివరాల ప్రకారం.. అభ్యర్థికి తప్పనిసరిగా ఇండిపెండెంట్ జడ్జ్‌మెంట్, విచక్షణ, అత్యుత్తమ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి. లిటిల్ డైరెక్షన్‌తో, చాలా సెల్ఫ్ మోటివేషన్‌తో పని చేయడం తెలుసుకోవాలి. జాబ్ రోల్‌కు క్యాబిన్, ప్రయాణీకుల భద్రత, విమాన అత్యవసర తరలింపులో వృత్తిపరంగా శిక్షణ అవసరమని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.
నెట్‌ఫ్లిక్స్‌కు ఫ్లైట్ అటెండెంట్ ఎందుకు అవసరం?
నెట్‌ఫ్లిక్స్ ఫ్లైట్ అటెండెంట్ జాబ్ ఏవియేషన్‌లో ఉంది. నెట్‌ఫ్లిక్స్ గత ఏడాది రెండుసార్లు ఉద్యోగులను తొలగించింది. కనీసం 500 మందిపై వేటు పడింది. ప్రధానంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగాల కోత చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది. ఈ OTT ప్లాట్‌ఫారంకి ప్రపంచవ్యాప్తంగా 220 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి 148.11 బిలియన్ల డాలర్ల నెట్ వర్త్ ఉంది. కాబట్టి పొటెన్షియల్ ఇన్వెస్టర్లు, కొత్త క్రియేటివ్ కొలాబొరేట్స్‌తో ఒప్పందాలు లేదా సమావేశాలను నిర్వహించడానికి కాలిఫోర్నియా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు అమెరికా, ఇతర దేశాలలో ప్రయాణించడానికి ఒక జెట్ లేదా రెండు అవసరం కావచ్చు. 36,000 అడుగుల ఎత్తులో ప్రైవేట్ జెట్‌లో అవసరాలను తీర్చడానికి ఫ్లైట్ అటెండెంట్‌లు కచ్చితంగా అవసరం.
Vastu Tips: డ్రీమ్ జాబ్ కోసం బెస్ట్ వాస్తు టిప్స్.. వీటిని పాటిస్తే సంపద, శ్రేయస్సు మీ సొంతం..
ఫ్లైట్ అటెండెంట్ బాధ్యతలు
కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో పని చేయాల్సి ఉంటుంది. USలో, ఇతర దేశాల్లో ప్రయాణించాలి. సూపర్ మిడ్‌సైజ్ జెట్‌లో అటెండర్ విధుల్లో టేకాఫ్‌కి ముందు కాక్‌పిట్, క్యాబిన్, గ్యాలరీలోని అత్యవసర పరికరాలను తనిఖీ చేయాలి. అభ్యర్థి ఎక్కువ సేపు నిలబడగల సామర్థ్యంతో పాటు, బ్యాగేజీ లోడ్ చేయడంలో కూడా సహాయం చేయగలగాలి. నెట్‌ఫ్లిక్స్ ప్రకారం.. అభ్యర్థి ప్రయాణాలకు ముందు ఎయిర్‌క్రాఫ్ట్ స్టాక్‌ను కొనుగోలు చేయడంలో తోడ్పాటు అందించాలి. విమానాన్ని లోడ్ చేస్తున్నప్పుడు, స్టాక్ చేస్తున్నప్పుడు 13.6 కేజీల వరకు మోసే సామర్థ్యం ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.