• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • NETFLIX ANNOUNCES FREE SUBSCRIPTION FOR 2 DAYS IN INDIA NO CARD DETAILS REQUIRED BA

Netflix Streamfest బంపర్ ఆఫర్, రెండు రోజులు ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. డేట్స్ గుర్తు పెట్టుకోండి

Netflix Streamfest బంపర్ ఆఫర్, రెండు రోజులు ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. డేట్స్ గుర్తు పెట్టుకోండి

Netflix Streamfest dates: ప్రతీకాత్మక చిత్రం

డిసెంబర్ 5, 6 తేదీల్లో ఈ ఆఫర్ ఉంటుందన్నమాట. యూజర్లు తమ పేరు, ఈ మెయిల్ ఐడీ ఇచ్చి ఓ పాస్ వర్డ్ పొందాలి. ఆ తర్వాత ఇక 48 గంటల పాటు మీ ఇష్టం వచ్చిన వీడియోలను చూసుకోవచ్చు.

  • Share this:
    ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం Netflix అభిమానుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్‌లో రెండు రోజుల పాటు ఫ్రీ యాక్సెస్ కల్పిస్తామని చెప్పింది. సాధారణంగా యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు మాత్రమే వీడియోలను చూసేందుకు యాక్సెస్ ఉంటుంది. కార్డు డిటెయిల్స్ అందించిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే, ఆ రెండు రోజులు మాత్రం ఎలాంటి కార్డు నెంబర్ ఎంటర్ చేయకపోయినా ఉచితంగా యాక్సెస్ కల్పిస్తుంది. ఆ 48 గంటల పాటు వినియోగదారులు తమ ఇష్టం వచ్చిన వీడియో, వెబ్ సిరీస్, సినిమా, లైవ్ షో ఏదైనా చూడొచ్చు. దీనికి Netflix Streamfest అని పేరు పెట్టింది. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఈ ఆఫర్ ఉంటుందన్నమాట. ఈ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ ఫెస్ట్‌లో పాల్గొనాలనుకునే యూజర్లు తమ పేరు, ఈ మెయిల్ ఐడీ ఇచ్చి ఓ పాస్ వర్డ్ పొందాలి. ఆ తర్వాత ఇక 48 గంటల పాటు మీ ఇష్టం వచ్చిన వీడియోలను చూసుకోవచ్చు. ప్రమోషన్‌లో భాగంగా ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి, ఏవో కొన్ని నియమిత వెబ్ సిరీస్‌లు, సినిమాలు, షోలకు మాత్రమే పరిమితం కాదు. NetFlixలో ఉన్న మొత్తం వీడియోలకు వీక్షించేందుకు అనుమతి ఉంటుంది.

    ఇండియాలో Streamfest గురించి Netflix సీఓఓ గ్రెగ్ పీటర్స్ మాట్లాడుతూ ‘ఈ ఐడియా గురించి మేం ఎంతో ఉత్సుకతతో ఉన్నాం. అది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి. ఒక దేశ ప్రజలు మొత్తానికి నెట్ ఫ్లిక్స్ మొత్తం యాక్సెస్ అందించడం అనేది ఓ గ్రేట్ ఐడియా. దీని వల్ల చాలా మంది కొత్త వారి వద్దకు నెట్ ఫ్లిక్స్‌ను తీసుకెళ్లడానికి ఆస్కారం లభిస్తుంది. దీనిపై చాలా ఆత్రుతగా ఉన్నాం. చాలా మంది సైన్ అప్ చేస్తారని ఆశిస్తున్నాం.’ అని అన్నారు. యూజర్స్ ఈ కంటెంట్‌ను యాప్ ద్వారా స్మార్ట్ టీవీ, గేమింగ్ కన్సోల్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌తోపాటు పర్సనల్ కంప్యూటర్‌లో కూడా వీక్షించవచ్చు. అయితే, స్ట్రీమింగ్ క్వాలిటీ SDలో ఉంటుంది.

    30 రోజుల పాటు ఫ్రీ ట్రయల్ సబ్ స్క్రిప్షన్ అందించే ఆఫర్‌ను నెట్ ఫ్లిక్స్ గత ఏడాది నిలిపివేసింది. ఒక్క భారత్‌లోనే కాదు. అన్ని మార్కెట్లలోనూ ఈ రకమైన ఫ్రీ ట్రయల్ ఆఫర్లను నిలిపివేసింది. యూజర్లను ఆకట్టుకునే క్రమంలో ఆ సంస్థ కొత్తగా రూ.199 ప్లాన్ కూడా తీసుకొచ్చింది. నెలకు రూ.199 చెల్లించడం ద్వారా నెట్ ఫ్లిక్స్ యాప్‌లో వారు షోస్ చూడొచ్చు. దీంతో పాటు భారతీయ యూజర్లకు అనువుగా, తక్కువ ఖర్చులో తక్కువ కాలపరిమితి గల ప్యాక్‌లను కూడా తీసుకొచ్చింది.

    ‘భారత్‌లో మెంబర్స్అయిన వారు, మెంబర్స్ కావాలనుకుంటున్న వారి కోసం మేం చాలా అద్భుతమైన, ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాం.’ అని నెట్ ఫ్లిక్స్ సీఓఓ పీటర్స్ తెలిపారు. నెట్ ఫ్లిక్స్ అనేది ప్రస్తుతం భారత్‌లో మోస్ట్ పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్‌లో ఒకటి. దానికి అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, ఆల్ట్ బాలాజీ, వూట్ యాప్స్ భారత్‌లో గట్టి పోటీ ఇస్తున్నాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు