బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్..

NEFT Timings : బ్యాంకు ఖాతాదారులకు రిజర్వు బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. నెఫ్ట్ లావాదేవీల సేవల్ని 24 గంటల పాటు ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.

news18-telugu
Updated: December 8, 2019, 2:05 PM IST
బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్..
ఆర్బీఐ
  • Share this:
బ్యాంకు ఖాతాదారులకు రిజర్వు బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. నెఫ్ట్ లావాదేవీల సేవల్ని 24 గంటల పాటు ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఈ సేవలు ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇప్పటి వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉండగా, 16 నుంచి రోజంతా వినియోగించుకోవచ్చు. అంతేకాదు.. లావాదేవీ వీలైనంత త్వరగా సెటిల్ అవుతాయని, ఒకవేళ కాకపోతే.. 2 గంటల్లోగా రిటర్న్ అవుతాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. తొలి లావాదేవి డిసెంబరు 16న 00:30 తర్వాత ప్రారంభం అవుతుందని వెల్లడించింది. పేమెంట్స్ సెటిల్‌మెంట్ విజన్ 2019-21 భాగంగా ఆర్బీఐ మొదటిగా నెఫ్ట్, ఆర్టీజిస్ సేవలను ఉచితంగా కస్టమర్లు 24 గంటలూ కొనసాగించుకునేందుకు ఆర్బీఐ వీలు కల్పించనుంది.

ఇదిలా ఉండగా, మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్-NEFT ఛార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకుల్ని ఆర్‌బీఐ ఆదేశించింది. 2020 జనవరి నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ పద్ధతుల ద్వారా జరిపే లావాదేవీలపై ఛార్జీలు ఎత్తేయాలని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 8, 2019, 2:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading