మీరు తరచూ మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటారా? ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటారా? అయితే మీకు శుభవార్త. ఇవాళ్టి నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్-NEFT సదుపాయం 24 గంటలు అందుబాటులోకి వచ్చింది. వారంలో ఏడు రోజులు ఈ సేవలు పొందొచ్చు. అంటే మీరు నిరంతరాయంగా నెఫ్ట్ సేవల్ని పొందొచ్చు. గతంలో నెఫ్ట్ లావాదేవీలు కేవలం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే ఉండేవి. చివరి సెటిల్మెంట్ రాత్రి 7.45 గంటల వరకు మాత్రమే జరిగేది. మొదటి, మూడో శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నెఫ్ట్ సేవలు ఉండేవి. అది కూడా బ్యాంకులు పనిచేసే రోజుల్లో మాత్రమే నెఫ్ట్ ట్రాన్స్ఫర్ సాధ్యమయ్యేది. అయితే ఈ విధానాన్ని మార్చాలని, కస్టమర్లకు సేవల్ని 24 గంటలు అందుబాటులో ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కొద్ది రోజుల క్రితమే ఆదేశించింది. నగదు నిర్వహణ సమర్థవంతంగా చేసేందుకు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ తెలిపింది. దీంతో నెఫ్ట్ సేవలు డిసెంబర్ 16 అంటే ఇవాళ్టి నుంచి మీరు 24 గంటల్లో ఎప్పుడైనా నెఫ్ట్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
ఇక ఇప్పట్నించీ ప్రతీ అరగంటకోసారి నెఫ్ట్ సెటిల్మెంట్ జరుగుతుంది. తెల్లవారుజామున 12.30 గంటలకే తొలి సెటిల్మెంట్ మొదలైంది. లాస్ట్ బ్యాచ్ అర్థరాత్రి జరుగుతుంది. అంటే ఉదాహరణకు మీరు ఉదయం 11.15 గంటలకు నెఫ్ట్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఉదయం 11.30 గంటలకు మీ ట్రాన్స్ఫర్ సెటిల్మెంట్ పూర్తవుతుంది. అంటే 11.30 గంటలకు మీరు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఇలా ప్రతీ అరగంటకు బ్యాచ్ సెటిల్మెంట్ జరుగుతూ ఉంటుంది. చివరి సెటిల్మెంట్ రాత్రి 11.30 గంటలకు పూర్తవుతుంది. ఇలా మీరు ఏడాదిలో 365 రోజులు నెఫ్ట్ ద్వారా డబ్బులు పంపొచ్చు. నెఫ్ట్ సేవలకు సెలవులేవీ ఉండవు.
నెఫ్ట్ ఛార్జీల వివరాలు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నెఫ్ట్ లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేయవు. నెఫ్ట్, ఆర్టీజీఎస్ మనీ ట్రాన్స్ఫర్పై ఛార్జీలను జూలైలోనే తొలగించింది ఆర్బీఐ. అంతేకాదు... సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కస్టమర్లకు 2020 జనవరి నుంచి నెఫ్ట్ లావాదేవీలను ఉచితంగానే అందించాలని ఆర్బీఐ బ్యాంకుల్ని కోరింది. నెఫ్ట్ ద్వారా మీరు గరిష్టంగా రూ.2 లక్షల వరకే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆర్టీజీఎస్ ద్వారానే సాధ్యం. అయితే కొన్ని బ్యాంకులు నెఫ్ట్ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు అనుమతి ఇస్తున్నాయి. నెఫ్ట్ ద్వారా ఐసీఐసీఐలో రూ.10 లక్షలు, హెచ్డీఎఫ్సీలో రూ.25 లక్షల వరకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్లో స్మార్ట్ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
New Year Party: న్యూ ఇయర్ పార్టీకి బ్యాంకాక్ తీసుకెళ్తున్న ఐఆర్సీటీసీ... ప్యాకేజీ వివరాలివే
IRCTC Rail Connect: ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ కొత్త ఫీచర్స్ ఇవే
Download Aadhaar: ఆధార్ నెంబర్ మర్చిపోయారా? అయినా కార్డ్ డౌన్లోడ్ చేయొచ్చు ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, BUSINESS NEWS, Hdfc, HDFC bank, Icici, Icici bank, Money, Rbi, Rbi governor, Reserve Bank of India, Sbi, State bank of india