Secured Loan Options: అర్జంటుగా డబ్బు అవసరం పడిందా..? చాలా తక్కువ వడ్డీకే అందించే ఈ నాలుగు లోన్లు తీసుకుంటేనే బెటర్..!

ప్రతీకాత్మక చిత్రం

ఆన్ లైన్ యాప్ప్ లో అత్యవసరం కొద్దీ తీసుకున్న వారిని బెదిరించి, వారి పరువు బజారుకీడ్చి ప్రాణాలు కోల్పోయేదాకా పరిస్థితిని తీసుకొస్తున్నారు. అందుకే ఎప్పుడైనా డబ్బు అవసరం పడినా ఇలాంటి లోన్లు కాకుండా తక్కువ వడ్డీకే దొరికే..

  • Share this:
ఈమ‌ధ్య కాలంలో యాప్‌ల రూపంలో, మ‌రో మార్గంలో నిమిషాల్లో ల‌క్షల కొద్దీ లోన్‌లు ఇచ్చేవాళ్లు పెరిగిపోయారనే వార్తలు వింటూనే ఉన్నాం. అత్యవసరం కొద్దీ తీసుకున్న వారిని బెదిరించి, వారి పరువు బజారుకీడ్చి ప్రాణాలు కోల్పోయేదాకా పరిస్థితిని తీసుకొస్తున్నారు. అందుకే ఈ తరహా లోన్ యాప్ లను తాజాగా నిషేధించింది ప్రభుత్వం. ఒకవేళ ఎప్పుడైనా డబ్బు అవసరం పడినా ఇలాంటి లోన్లు కాకుండా తక్కువ వడ్డీకే దొరికే వేరే లోన్లను ప్రయత్నించండి. వాటి ద్వారా మీ ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు మీకు తిరిగి చెల్లించడంలో ఇబ్బంది ఉండదు. పైగా వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఇలాంటి సెక్యూర్ లోన్లు తీసుకోవ‌డం వ‌ల్ల మీ ఆస్తుల‌ను అమ్ముకోవాల్సిన అవ‌స‌రం రాదు. అలాగే క్లిష్ట‌మైన ఆర్ధిక అవ‌స‌రాలనూ నిశ్చింత‌గా పూర్తిచేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి లోన్లు రుణం అందించేందుకు సంస్థలు సెక్యూరిటీగా ఏదో ఒకటి తీసుకొని అప్పు ఇస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. .

సెక్యూరిటీల‌పై రుణాలు
బాండ్లు, షేర్లు, ఈటిఎఫ్‌లు, మ్యూచువ‌ల్ ఫండ్‌లు, ఎన్ ఎస్ సి, లైఫ్ ఇన్స్యూరెన్స్ పాల‌సీలు, కెవిపిల మొద‌లైన వాటిపై సెక్యూరిటీల‌పై రుణాలు (Loan against securities - LAS) ఆఫ‌ర్ చేస్తారు. లోన్ టెన్యూర్‌లో రుణ‌గ్ర‌హీత‌లకు వారిచ్చిన సెక్యూరిటీల‌పై వ‌డ్డీ, డివిడెండ్లు, బోన‌స్‌లు తీసుకోవ‌డం కొన‌సాగుతూనే ఉంటుంది. అలాగే, సెక్యూరిటీల‌కు ఆర్‌బిఐ విధించిన ఎల్‌టివి నిష్ప‌త్తిని బ‌ట్టి రుణం మొత్తానికి కొలేట‌ర‌ల్‌గా ముందే ఒప్పుకున్న సెక్యూరిటీల రిస్క్ ఎసెస్‌మెంట్‌పైన లోన్ మొత్తం ఆధార‌ప‌డి ఉంటుంది. సెక్యూరిటీల‌పై రుణం అనేది మీకు నిర్ణయించిన క్రెడిట్ ప‌రిమితితో క‌లిపి ఓవ‌ర్ డ్రాఫ్ట్ సౌక‌ర్యం రూపంలో ఆఫ‌ర్ చేస్తారు. దీనితో అవ‌స‌రాన్ని బ‌ట్టి రుణ‌గ్ర‌హీత మంజూరైన మొత్తాన్ని గానీ, లేదంటే అందులో కొంత గానీ తీసుకోవ‌చ్చు. ఇక్క‌డ రుణం పైన వ‌డ్డీ కూడా తక్కువగానే ఉంటుంది. ఈ లోపే వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించే వీలుంటుంది. ప్రతి నెల వడ్డీ మాత్రం తప్పక చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

గోల్డ్ లోన్
బంగారంపై రుణం త్వ‌ర‌గా వ‌చ్చేస్తుంది. దర‌ఖాస్తు చేసుకున్న‌ రోజే రుణం కూడా ఇచ్చేస్తారు. ఇందులో తిరిగి చెల్లించే స‌మ‌యం సాధ‌ర‌ణంగా మూడేళ్లు ఉంటుంది. కొంద‌రైతే కాస్త పెంచి 4-5 ఏళ్లు టెన్యూర్‌ని ఉంచుతారు. అయితే లోన్ ఎంత ఇవ్వాలనేది మ‌నం పెట్టే బంగారాన్ని బ‌ట్టి నిర్ణ‌యిస్తారు. ఇది కూడా ఎల్‌టివి నిష్ప‌త్తిని బ‌ట్టే నిర్ణ‌యిస్తారు. ఇందులో ఉన్న పెద్ద ఉప‌యోగం ఏమంటే రుణ‌దాత‌లు రీపేమెంట్ ఫ్లెక్సిబిలిటీని ఇవ్వ‌డం. సాధార‌ణంగా ఉండే ఈఎమ్ ఐ ద్వారానే కాకుండా చాలా మంది బుల్లెట్ రీపేమెంట్ చేయ‌మంటారు. లేక‌పోతే ముందు వ‌డ్డీ మొత్తం క‌ట్టేసి, లోన్ టెన్యూర్ అయ్యే లోపు ప్రిన్సిప‌ల్ అమౌంట్‌ను క‌ట్టొచ్చు. ఈ ప‌ద్ధ‌తి ఈఎమ్ ఐలు క‌ట్టే ప‌రిస్థితి లేకుండా, డ‌బ్బు కావాల‌నుకునేవారికి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

ఆస్తిపై రుణం
లోన్ ఎగెనెస్ట్ ప్రొప‌ర్టీ (ఎల్ ఏ పి) అనేది నివాస‌, వ్యాపార‌, ప‌రిశ్రమల వంటి ఆస్తుల త‌న‌ఖాపై ఇస్తారు. స‌ద‌రు ఆస్తికి మార్కెట్లో ఉన్న విలువ‌ను బట్టి అందులో 50-70 శాతం వ‌ర‌కూ లోన్ మొత్తం ఉంటుంది. రీపేమెంట్ టెన్యూర్ 15 సంవత్స‌రాల వ‌ర‌కూ ఉంటుంది. కొంత‌మంది 20 ఏళ్ల టెన్యూర్ కూడా ఇస్తున్నారు. ఇది ఎక్కువ రుణం కావాల‌నుకునే వారికీ, ఈఎమ్ ఐల రూపంలో తిరిగి చెల్లించ‌డానికి ఎక్కువ కాలం కావాల‌నుకునే వారికి ఉప‌యోగంగా ఉంటుంది. అయితే ఇందులో మ‌రో కోణాన్ని చూస్తే, త్వ‌ర‌గా డ‌బ్బులు కావాల‌నుకునే వారికి ఇది అంత స‌రి కాదు. ఎందుకంటే దీని ప్రాసెస్ 2-3 వారాలు ప‌డుతుంది.
ఇది కూడా చదవండి: ప్రియుడితో తల్లి ఎస్కేప్.. తండ్రి బాధను చూడలేక.. పదేళ్ల తర్వాత కన్న కొడుకే పనోడిలా చేరి ఇలా పగతీర్చుకున్నాడు..!

టాప్‌-అప్ హోమ్‌ లోన్‌
ఇది కేవ‌లం అప్ప‌టికే హోమ్ లోన్ తీసుకొని, సక్ర‌మంగా క‌డుతున్న రుణ గ్రహీతలకు మాత్రమే ఇస్తారు. ఈ లోన్ మొత్తం సాధార‌ణంగా మంజూరు చేయ‌బ‌డిన అస‌లు హోమ్‌లోన్ మొత్తం, ఔట్ స్టాండింగ్ లోన్ మొత్తం మ‌ధ్య ఉన్న వ్యత్యాసాన్ని బ‌ట్టి ఉంటుంది. ఇదే విధంగా టాప్‌-అప్ హోమ్ లోన్ టెన్యూర్ అనేది అస‌లు హోమ్‌లోన్ యొక్క మిగిలిన టెన్యూర్ కంటే ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు. అందుకే ఎక్కువ మంది రుణ‌దాత‌లు 15 సంవ‌త్స‌రాల‌కు క్యాపింగ్‌ను పొడిగిస్తారు. టాప్అప్ హోమ్‌లోన్ వ‌డ్డీరేటు సాధార‌ణంగా ఒకేలా ఉంటుంది. లేదంటే అత‌ర్లీనంగా హోమ్ లోన్‌పై విధించే వ‌డ్డీ రేటుకంటే ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే అప్ప‌టికే హోమ్‌లోన్ తీసుకొని ఉన్న రుణ‌దాత‌ల‌కు ఇది చాలా చౌకైన క్రెడిట్ సోర్స్‌గా చెప్పొచ్చు. దీనికీ 1-3 వారాల ప్రాసెస్ టైమ్ ప‌ట్టొచ్చు. కొంత‌మంది రుణ‌దాత‌లైతే అప్ప‌టికే హోమ్‌లోన్ తీసుకున్న‌వారికి ఒక్క రోజులోనే ప్రీ-అప్రూవ్డ్ టాప్‌-అప్ హోమ్‌లోన్లు ఆఫ‌ర్‌ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: గర్భవతి అయినప్పటికీ భర్తతో శృంగారంలో పాల్గొన్న భార్య.. కడుపులో బిడ్డ ఎదుగుదలను చూసేందుకు స్కానింగ్ తీస్తే షాకింగ్ రిజల్ట్

మొత్తానికి ఏ మొత్తం బెట‌ర్‌?
ఇప్పటికే హోమ్‌లోన్ తీసుకొని, ఎక్కువ కాలం టెన్యూర్ ఉన్న రుణ‌గ్ర‌హీత‌ల‌కు టాప్‌-అప్ హోమ్‌లోన్ ఎంతో మంచి ఆఫ‌ర్‌. ఎందుకంటే ఇందులో వ‌డ్డీ రేటు త‌గ్గుతుంది. త‌న‌ఖా పెట్ట‌డానికి ఎక్కువ ఆస్తులు ఉన్న‌వారు సెక్యూర్ చేసిన లోన్ ఆప్ష‌న్ల వ‌డ్డీ రేటును బ‌ట్టీ, రీపేమెంట్ టెన్యూర్‌, ప్రాసెసింగ్ ఫీజు, ప్రిపేమెంట్ చార్జీలు, అందుబాటులో ఉన్న ఆస్తులు, సెక్యూరిటీల‌పై ఆఫ‌ర్ చేసిన ఎల్‌టి వి ఆధారంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం మంచిది.
Published by:Hasaan Kandula
First published: