నేను చేసిన తప్పేంటి...బ్యాంకులు నన్ను కూడా ఆదుకోవాలి...విజయ్ మాల్యా రిక్వెస్ట్...

నేను చేసిన తప్పేంటి...జెట్ ఎయిర్ వేస్ చేసిన ఒప్పేంటి...నాడు యూపీఎ ప్రభుత్వానికి కింగ్ ఫిషర్‌ను ఆదుకునేందుకు చర్యలు తీసుకోమని కోరినందుకు నానా యాగీ చేసిన బీజేపీ ప్రతినిధులు...ఇప్పుడు వారి హయాంలో జెట్ ఎయిర్ వేస్‌ను ఎలా కాపాడుతారు...

news18-telugu
Updated: March 26, 2019, 1:35 PM IST
నేను చేసిన తప్పేంటి...బ్యాంకులు నన్ను కూడా ఆదుకోవాలి...విజయ్ మాల్యా రిక్వెస్ట్...
విజయ్ మాల్యా (ఫైల్ ఫొటో)
  • Share this:
అప్పుల్లో కూరుకుపోయి చేతులెత్తేసిన జెట్ ఎయిర్ వేస్‌ను ఆదుకున్నట్లే బ్యాంకులు నన్ను కూడా ఆదుకుంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదని, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వాపోయారు. జెట్ ఎయిర్ వేస్ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కన్సార్షియం రూ.1500 కోట్ల నిధులను సేకరించనుంది. అయితే తన డబ్బు కూడా తీసుకొని జెట్ ఎయిర్ వేస్ ను కాపాడమని విజయ్ మాల్యా ట్వీట్ చేశాడు.

వరుస ట్వీట్లలో భాగంగా విజయ్ మాల్యా పీఎస్‌యూ బ్యాంకుల తీరునూ, ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని విమర్శించారు. "ప్రభుత్వరంగ బ్యాంకులు జెట్ ఎయిర్ వేస్ ను ఆదుకునేందుకు ముందుకు వచ్చినందుకు సంతోషం, ఈ తరహాలోనే కింగ్ ఫిషర్ ను ఆదుకుంటే బాగుండేది"అని మొదటి ట్వీట్‌లో విజయ్‌మాల్యా పేర్కొన్నారు.
అలాగే మాల్యా తన రెండో ట్వీట్‌లో "నా ఆస్తులన్నీ కూడా కర్ణాటక హై కోర్టు ముందు ఉన్నాయి. వీలైతే ప్రభుత్వ బ్యాంకులు నా ఆస్తులు అమ్మి జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడండి"అని చురకలంటించారు.


దీంతో పాటు విజయ్ మాల్యా మరో ట్వీట్ లో "నేను మొత్తం రూ.4000 కోట్లు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బంది, కంపెనీని కాపాడేందుకు పెట్టుబడి పెట్టాను. దీన్ని గుర్తించకుండానే..ప్రభుత్వ బ్యాంకులు నన్ను విమర్శించాయి. కానీ జెట్ ఎయిర్ వేస్ విషయంలో మాత్రం ఇవే ప్రభుత్వ బ్యాంకులు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం రెండు నాల్కల ధోరణికి ఇది ఒక ఉదాహరణ"అని విమర్శించారు.గతంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంస్థను ఆదుకోవాలని లేఖలు రాస్తే ఎన్డీఏ నానా యాగీ చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను ఆదుకోవడం నేరం అన్నట్లు చిత్రీకరించాయి. మరి ఇప్పుడు జెట్ ఎయిర్‌వేస్‌ను ఎన్డీఏ ప్రభుత్వం, బ్యాంకులు ఏ ప్రాతిపదికన ఆదుకున్నాయి..ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చిన మార్పులేమిటో తెలియడం లేదంటూ మాల్యా విమర్శించారు.
First published: March 26, 2019, 1:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading