NBFC REGULATIONS SUPREME COURT RULING ON NBFC REGULATIONS THESE ARE THE KEY THINGS THAT CUSTOMERS NEED TO KNOW GH VB
NBFC Regulations: NBFC నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు.. కస్టమర్లు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..
rbi
స్టేట్ మనీ లెండింగ్ చట్టాలు(State Money Lending Laws ) ఇకపై బ్యాంకింగ్ నాన్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తించవని సుప్రీంకోర్టు మే 10న తీర్పునిచ్చింది. ఇకపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(NBFC)లను పర్యవేక్షిస్తుంది.
స్టేట్ మనీ లెండింగ్ చట్టాలు(State Money Lending Laws ) ఇకపై బ్యాంకింగ్ నాన్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తించవని సుప్రీంకోర్టు మే 10న తీర్పునిచ్చింది. ఇకపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(NBFC)లను పర్యవేక్షిస్తుంది. కోర్టు తీర్పుతో ఎన్బీఎఫ్సీలపై ద్వంద్వ నియంత్రణ ముగిసింది. గతంలో ఎన్‌బీఎఫ్‌సీల నియంత్రణలోని కొన్ని అంశాలపై ఆర్బీఐ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనిశ్చితి ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ జోక్యం లేకుండా, నిపుణుల అభిప్రాయం ప్రకారం, NBFCలు, కస్టమర్లు ఇద్దరూ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కోర్టు తీర్పులోని ఐదు కీలక అంశాల గురించి నిపుణులు మనీకంట్రోల్‌తో మాట్లాడారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
* విరుద్ధమైన నిబంధనలు లేవు
ఎన్‌బీఎఫ్‌సీల నియంత్రణపై కేరళ, గుజరాత్ హైకోర్టుల్లో వ్యాజ్యాలు పరస్పర విరుద్ధమైన తీర్పులకు దారితీశాయి. ఇది NBFCల మనీ లెండింగ్ వ్యాపారంపై నియంత్రణను ప్రశ్నార్థకం చేసింది. NBFC అయిన శాటిన్ క్రెడిట్‌కేర్ నెట్వర్క్ చైర్మన్ HP సింగ్ మాట్లాడుతూ..‘విరుద్ధ తీర్పులు గందరగోళానికి దారితీశాయి. ఎవరికి రిపోర్ట్ చేయాలనే అంశంలో NBFCలకు అర్థం కాలేదు. ప్రధానంగా రుణాలపై వడ్డీ విధించే అంశంలో సందిగ్ధం ఎదురైంది.’ అన్నారు. కొన్ని రాష్ట్ర చట్టాలు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, దీంతో గందరగోళం నెలకొందని పరిశ్రమ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో NBFCల పర్యవేక్షణలో ఇప్పుడు స్పష్టత వచ్చింది.
* రాజకీయ జోక్యం సున్నా
రెగ్యులేటరీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాష్ట్రాలు ఆరోపించిన జోక్యం కారణంగా చిన్న NBFCలు తరచుగా రాజకీయ ఒత్తిడికి గురవుతున్నాయి. ఇలాంటివి ఇప్పుడు తగ్గుతాయి. కార్పోరేట్ గవర్నెన్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ సంస్థ ఇన్‌గవర్న్ వ్యవస్థాపకుడు శ్రీరామ్ సుబ్రమణియన్ మాట్లాడుతూ.. ‘“చిన్న NBFCలు ఇప్పుడు రాజకీయ జోక్యాన్ని నివారించగలవు. రాష్ట్రం నుంచి అధికారిక, అనధికారిక జోక్యం రెండూ ఉండేవి. రాష్ట్రం ఒత్తిడిని ఇప్పుడు నివారించవచ్చు’ అన్నారు.
* వడ్డీ రేట్ల పరిమితి లేదు
రాష్ట్ర ప్రభుత్వాలు మునుపు వడ్డీ రేట్ల పరిమితిని తప్పనిసరి చేయవచ్చు. నో యువర్-కస్టమర్ (KYC) ప్రక్రియల కోసం అదనపు నిబంధనలను విధించవచ్చు. ఇటువంటి రాష్ట్ర నిబంధనలు NBFCలకు అనుగుణంగా ఖర్చును పెంచడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి వాటితో అదనపు కార్యాచరణ విధానాలను అమలు చేయాల్సి వచ్చిందని, కష్టతరమైందని NBFC అయిన MyShubhLife కోఫౌండర్ రాహుల్ శేఖర్ అన్నారు. ఇప్పుడు NBFCల నియంత్రణపై స్పష్టతతో, తమ వ్యాపారంపై దృష్టి పెట్టడానికి స్వేచ్ఛగా ఉంటారు.
* మెరుగైన రిస్క్ ప్రొఫైల్ విశ్లేషణ
రుణగ్రహీతల రిస్క్ ప్రొఫైల్‌ను విశ్లేషించడం మనీ లెండింగ్‌లో కీలకమైన అంశం. ఇప్పుడు జీరో స్టేట్ జోక్యంతో, NBFCలు రుణగ్రహీత రిస్క్ ప్రొఫైల్ అంచనా ఆధారంగా వడ్డీ రేటును నిర్ణయించవచ్చు.
* మెరుగైన కస్టమర్ ఎక్స్పీరియన్స్
ఇప్పుడు NBFCలు పెద్ద కస్టమర్ బేస్‌ను చేరుకోగలుగుతాయి. రుణగ్రహీతలు కూడా విస్తృత అవకాశాలను అందుకోగలరు. NBFCలకే ఒకే రకమైన నిబంధనలు ఉండటంతో.. ఒక వ్యక్తి రుణం తీసుకునే ముందు తనకు నచ్చిన ఎన్బీఎఫ్సీని ఎంచుకొనే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.