Home /News /business /

NAVI FINSERV OFFERS HOME LOANS WITH LOWER INTEREST RATES SS

Navi Home Loan: నావి ఫిన్‌సర్వ్ సంచలనం... బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే హోమ్ లోన్

Navi Home Loan: నావి ఫిన్‌సర్వ్ సంచలనం... బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే హోమ్ లోన్
(ప్రతీకాత్మక చిత్రం)

Navi Home Loan: నావి ఫిన్‌సర్వ్ సంచలనం... బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే హోమ్ లోన్ (ప్రతీకాత్మక చిత్రం)

Navi Home Loan | హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. నావి ఫిన్‌సర్వ్ (Navi Finserv) కేవలం 6.46 శాతం వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

    ఫ్లిప్‌కార్ట్ కో-ఫౌండర్ సచిన్ బన్సాల్‌కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) నావి ఫిన్‌సర్వ్ (Navi Finserv) అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ ప్రకటించింది. అర్హులకు నావి యాప్ ద్వారా వెంటనే గృహ రుణాలను మంజూరు చేస్తోంది. హోమ్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం డిజిటల్ పద్ధతిలో పూర్తవుతుంది. బ్యాంకుల కన్నా వేగంగా రుణ మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తోంది నావి యాప్. ఇక వడ్డీ రేట్ల విషయానికి వస్తే వార్షిక వడ్డీ రేటు కేవలం 6.46 శాతం నుంచే ప్రారంభమవుతుంది. సాధారణంగా ప్రైవేట్ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. కానీ నావి ఫిన్‌సర్వ్ వీటితో పోటీ పడుతూ తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ప్రకటించడం విశేషం.

    నావి ఫిన్‌సర్వ్ రూ.20 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు హోమ్ లోన్ అందిస్తోంది. 25 ఏళ్ల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, మైసూరు, హుబ్లీ, దావన్‌గిరి, గుల్బర్గా, చెన్నై, ఢిల్లీ, గురుగ్రామ్ లాంటి ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో ప్రాపర్టీ కొనేవారు ఈ హోమ్ లోన్ తీసుకోవచ్చు. త్వరలో ముంబై, పూణె ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు కూడా ఈ ఆఫర్ అందించనుంది నావి ఫిన్‌సర్వ్.

    Credit Card: క్రెడిట్ కార్డు బిల్ కట్టలేకపోతున్నారా? ఈ టిప్స్ ఫాలో అవండి

    మంచి క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ ట్రాక్ రికార్డ్, క్యాష్ ఫ్లో లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే తక్కువ వడడీకి రుణాలను అందిస్తోంది నావి ఫిన్‌సర్వ్. కస్టమర్లు నావి యాప్‌లోనే హోమ్ లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు. కంపెనీ ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయదు. అడ్మినిస్ట్రేటీవ్ ఛార్జీలు కూడా ఉండవు.

    నావి యాప్‌లో హోమ్ లోన్ అప్లై చేయడానికి కస్టమర్లు ముందుగా యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేయాలి. పాన్ కార్డ్ వివరాలు, పరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, ఉద్యోగం, ఆదాయం లాంటి వివరాలు ఎంటర్ చేసి పాన్ కార్డ్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీ క్రెడిట్ రిపోర్ట్‌ను విశ్లేషించి మీరు హోమ్ లోన్‌కు అర్హులో కాదో తెలుపుతుంది నావి. హోమ్ లోన్ అమౌంట్, టెన్యూర్ లాంటివి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

    Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ ఇచ్చే స్కీమ్... 9 నెలల్లో 65 లక్షల మంది చేరారు

    కస్టమర్ క్రెడిట్ రిపోర్ట్, క్రెడిట్ హిస్టరీని బట్టి వడ్డీ రేట్లు ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకే వడ్డీ రేటు వర్తించదు. కస్టమర్లు మూడేళ్లకు ఫిక్స్‌డ్ రేట్‌ను ఫిక్స్ చేయొచ్చు. లోన్ దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి రుణం మంజూరు చేసేవరకు నావి కస్టమర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకపోవడం విశేషం. ప్రీపేమెంట్ ఛార్జీలు కూడా లేవు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank loan, Home loan, Housing Loans, Navi, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు