ఏ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలన్నా రిస్కు ఉంటుంది. రిస్కు లేకుండా మంచి రిటర్న్స్ పొందాలంటే పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు (Post Office Saving Schemes) ఎంచుకోవాలి. పోస్ట్ ఆఫీసులో అనేక పొదుపు పథకాలు ఉంటాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) లాంటి పథకాలు ఉంటాయి. 2022 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వడ్డీ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ పథకాలకు పాత వడ్డీ అమలులో ఉంటుంది. ఎలాంటి రిస్కు లేకుండా తక్కువ కాలంలో మంచి రిటర్న్స్ పొందాలనుకునేవారికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ఉపయోగపడుతుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు ఇస్తాయి. కేవలం ఐదేళ్లలో మంచి రిటర్న్స్ పొందొచ్చు. సాధారణంగా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.5 శాతం ఉంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ 6.8 శాతం ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు లో రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఇది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకు ఓసారి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. వడ్డీ పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు.
ATM Charges: ఏటీఎంలో ఒక ట్రాన్సాక్షన్‌కు రూ.173 సర్వీస్ ఛార్జీ... క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌లో ఒకేసారి డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది. నెలవారీ కంట్రిబ్యూషన్ చేయడం కుదరదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీసం రూ.1,000 చాలు. ఆ తర్వాత రూ.100 చొప్పున జోడిస్తూ ఎంతైనా జమ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఎంత పొదుపు చేయాలనుకున్నా ఒకేసారి చేయాలి.
IRCTC Shirdi Tour: ఫ్లైట్‌లో షిర్డీ టూర్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌లో ఎవరైనా చేరొచ్చు. మైనర్ల పేరు మీద పెద్దవాళ్లు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఎంత పొదుపు చేసినా ఐదేళ్ల వరకు వేచి చూడాలి. మెచ్యూరిటీ సమయంలో అసలుతో పాటు వడ్డీ కూడా వస్తుంది. ప్రస్తుతం 6.8 శాతం వడ్డీ వస్తుంది కాబట్టి ఈ లెక్కన చూస్తే రూ.2,00,000 ఒకేసారి పొదుపు చేసేవారికి రూ.2,77,899 రిటర్న్స్ వస్తాయి. ఇందులో రూ.2,00,000 అసలు కాగా, రూ.77,899 వడ్డీ. దేశంలోని ప్రతీ పోస్ట్ ఆఫీసులో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.