Saving Schemes | రిస్క్ ఉండకూడదు. కచ్చితమైన రాబడి కావాలి. అని అనుకుంటున్నారా? అయితే మీకు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెపుకోవచ్చు. పోస్టాఫీస్‌లో (Post Office) పలు రకాల సేవింగ్ స్కీమ్స్ (Scheme) అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మనం ఇప్పుడు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ) గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పథకం కింద అదిరిపోయే రాబడి పొందొచ్చు. కచ్చితమైన రిటర్న్ వస్తుంది. రిస్క్ ఉండదు.
ఈ స్కీమ్‌లో ఎంత మొత్తాన్ని అయిన డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు కలిగి ఉండొచ్చు. మీకు దగ్గరిలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. వడ్డీ మొత్తం వార్షికంగా మీ అకౌంట్లోకి వచ్చి చేరుతుంది. ఇలా ప్రతి ఏటా వడ్డీ మొత్తంపై కూడా మీకు వడ్డీ వస్తుంది.
ఒక్క రూపాయి కట్టక్కర్లేదు.. రూ.10 లక్షల లిమిట్‌తో ఉచితంగా క్రెడిట్ కార్డు పొందండిలా!
ఒక్కసారి ఈ స్కీమ్‌లో చేరితే మెచ్యూరిటీ కాలం వరకు ఆగాల్సిందే. డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల రూ. 1000 డిపాజిట్‌పై మెచ్యూరిటీ సమయంలో రూ. 1403 పొందొచ్చని పోస్టాఫీస్ పేర్కొంటోంది. పోస్టాఫీస్ ఎన్ఎస్‌సీ క్యాలిక్యులేటర్ ప్రకారం చూస్తే.. రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 14 లక్షలకు పైగా లభిస్తాయి. వడ్డీ రూపంలో రూ. 4 లక్షలకు పైగా వస్తాయని చెప్పుకోవచ్చు.
పీఎం కన్యా ఆశీర్వాద్ స్కీమ్‌తో ఆడ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.1,80,000? కేంద్రం ఏమంటోందంటే..
పోస్టాఫీస్‌కు వెళ్లి రూ. 1000 మొత్తంతో మీరు ఎన్‌ఎస్‌సీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. తర్వాత మీకు నచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంతైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్ఎస్‌సీ సర్టిఫికెట్లను మీరు బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీలు తనఖా పెట్టుకొని లోన్ ఇస్తాయి. అలాగే ఈ ఎన్ఎస్‌సీ సర్టిఫికెట్లను ఒక వ్యక్తి పేరు నుంచి మరో వ్యక్తి పేరుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలాగే నామినీ పెసిలిటీ కూడా ఉంది. అందువల్ల ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఈ ప్రయోజనాలు పొందొచ్చు. కాగా పోస్టాఫీస్‌లో ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. అందువల్ల మీరు వాటి గురించి కూడా తెలుసుకోవడం ఉత్తమం. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మీకు ఆర్థిక లక్ష్యాలకు ఏ స్కీమ్ అయితే అనువుగా ఉంటుందో దాన్ని ఎంచుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. అప్పుడు మెరుగైన ప్రయోజనాలు పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Money savings, Nsc, Personal Finance, Post office, Post office scheme, Postal savings, Schemes