నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) చందాదారుల భద్రతను కాపాడేందుకు, విత్‌డ్రా చేసుకున్న నిధులు సకాలంలో క్రెడిట్ అయ్యేందుకు పెన్షన్ రెగ్యులేటర్ పిఎఫ్ఆర్డిఎ ‘పెన్నీ డ్రాప్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సిఆర్‌ఎలు లేదా సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీల సహకారంతో మీ ఎన్పీఎస్ ఖాతాను ఇన్స్టన్ట్గా ధ్రువీకరించుకోవచ్చు. తద్వారా మీ అకౌంట్లో విత్‌డ్రా అమౌంట్ తక్షణమే క్రెడిట్ అవుతుంది. ప్రస్తుత విధానం ప్రకారం, ఎన్‌పిఎస్ చందాదారుడు తన బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్‌తో సహా అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి విత్‌డ్రా రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ విత్‌డ్రా రిక్వెస్ట్‌ను సెంట్రల్ రికార్డ్ కీపింగ్ (CRA) విధానంలో ఆయా ఏజెన్సీలు ధ్రువీకరిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా చందాదారుల బ్యాంక్ ఖాతాకు డబ్బు జమ అవుతుంది.
LIC Policy: ప్రతీ నెలా కొంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు రిటర్న్స్ పొందొచ్చు ఇలా
EPF Account: వారం రోజుల్లో ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త
అయితే కొన్ని సందర్భాల్లో ఇన్వ్యాలిడ్ అకౌంట్ నంబర్/ అకౌంట్ టైప్, ఇన్వ్యాలిడ్ ఐఎఫ్ఎస్సి కోడ్, పేరు తప్పుగా నమోదవ్వడం, అకౌంట్ ఫ్రీజింగ్లో ఉండటం వంటి అనేక సమస్యల కారణంగా విత్‌డ్రా అమౌంట్ సకాలంలో చందాదారుడి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో జమ కావడం లేదు. తద్వారా, చందాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని గ్రహించిన ఎన్‌పిఎస్.. ‘పెన్నీ డ్రాప్’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది.
Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.4,950 మీ అకౌంట్లోకి
Pension Scheme: నెలకు రూ.3,000 పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి... జీతం తక్కువ ఉన్నవారికే అవకాశం
‘పెన్నీ డ్రాప్’ ప్రాసెస్ ద్వారా సులభంగా ఎన్‌పిఎస్ అమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం ప్రకారం ముందుగా, సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా? లేదా? అనేది చెక్ చేస్తాయి. ఆ తర్వాత మీ PRAN (శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య)లోని పేరుతో మీ బ్యాంక్ అకౌంట్లోని పేరును సరిపోల్చుతాయి. ఆ తర్వాత టెస్ట్ ట్రాన్సాక్షన్ ద్వారా మీ సేవింగ్స్ అకౌంట్‌ను ధ్రువీకరిస్తాయి. ఈ టెస్ట్ ట్రాన్సాక్షన్ కోసం ‘పెన్నీ డ్రాప్’ విధానాన్ని అవలంభిస్తాయి. దీనిలో భాగంగా మీ బ్యాంక్ అకౌంట్లో రూ.1 జమ చేసి అకౌంట్‌ను ధ్రువీకరిస్తాయి. తద్వారా ట్రాన్సాక్షన్ సక్సెస్ లేదా ఫెయిల్యూర్‌ను తెలుసుకుంటాయి. సక్సెస్ అయితే చందాదారుడి ఖాతాలో మొత్తం అమౌంట్ క్రెడిట్ చేస్తాయి. ఒకవేళ వెరిఫికేషన్ ఫెయిల్యూర్ అయితే మీ బ్యాంకును సందర్శించి అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.
ఇందుకు చందాదారుల నుంచి ఏజెన్సీలు ఫీజు వసూలు చేస్తాయి. కెఫిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (కెసిఆర్‌ఎ) రూ. 1.90, ఎన్ఎస్డిఎల్ ఇ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌సిఆర్‌ఎ).. రూ. 2.40 వసూలు చేస్తాయి. వీటికి ట్యాక్స్ అదనంగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National Pension Scheme, Pension Scheme, Pensioners, Personal Finance