హోమ్ /వార్తలు /బిజినెస్ /

NPS: క్రెడిట్ కార్డుల ద్వారా ఇక ఈ పేమెంట్లు చేయలేం.. కొత్త రూల్స్!

NPS: క్రెడిట్ కార్డుల ద్వారా ఇక ఈ పేమెంట్లు చేయలేం.. కొత్త రూల్స్!

 క్రెడిట్ కార్డుల ద్వారా ఇక ఈ పేమెంట్లు చేయలేం.. కొత్త రూల్స్!

క్రెడిట్ కార్డుల ద్వారా ఇక ఈ పేమెంట్లు చేయలేం.. కొత్త రూల్స్!

Credit Card | మీరు పాపులర్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో చేరారా? ఈ స్కీమ్‌లో డబ్బులు కడుతూ వస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాల్సిందే.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  National Pension Scheme | మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) స్కీమ్‌లో చేరారా? ప్రతి నెలా లేదంటే ఏడాదికి ఒకసారి డబ్బులు చెల్లిస్తూ ఉంటారా? క్రెడిట్ కార్డు ద్వారా కూడా పేమెంట్లు చేస్తుంటారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) పేమెంట్ రూల్స్‌ను మార్చేసింది. ఎన్‌పీఎస్ అకౌంట్‌లోకి క్రెడిట్ కార్డుల (Credit Card) ద్వారా చెల్లింపులను నిలిపివేసింది. ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌లోకి క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు జమ చేయడం కుదరదు.

  క్రెడిట్ కార్డు పేమెంట్ నిలుపుదల అంశానికి సంబంధించి పీఎఫ్ఆర్‌డీఏ ఇప్పటికే అన్ని పాయింట్స్ ఆఫ్ ప్రిసెన్స్ (పీఓపీ)లకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణం ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌లోకి క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించే ఆప్షన్ తొలగించాలని పేర్కొంది. పీఎఫ్ఆర్‌డీఏ ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి సర్క్యూలర్ కూడా జారీ చేసింది.

  బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. దిగివచ్చిన ధరలు!

  పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్ 2013లోని సెక్షన్ 14 కింద అధికారాన్ని వినియోగించుకొని ఎన్‌పీఎస్ టైర్- 2 ఖాతాలలో క్రెడిట్ కార్డ్‌ల వినియోగాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పీఎఫ్ఆర్‌డీఏ వెల్లడించింది. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, జాతీయ పెన్షన్ సిస్టమ్, పెన్షన్ పథకాల వృద్ధిని ప్రోత్సహించడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

  బంపర్ సేల్.. 50 లక్షల ఉచిత విమాన సీట్లు!

  ఇకపోతే ఎన్‌పీఎస్ స్కీమ్‌లో టైర్ 1 అకౌంటలో మాత్రం క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించొచ్చు. ఈ ఆప్షన్ అందుబాటులోనే ఉంటుంది. ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌కు మత్రమే ఈ నియంత్రణ వర్తిస్తుంది. క్రెడిట్ కార్డుల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ , స్టాక్స్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్లను సాధారణంగా ప్రోత్సహించరు. ఎన్‌పీఎస్ అకౌంట్‌లోకి క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు జమ చేయాలంటే పేమెంట్ గేట్‌వే చార్జీలు 0.6 శాతంగా ఉంటాయి.

  కాగా టైర్ 2 ఎన్‌పీఎస్ అకౌంట్‌ను వాలంటరీ అకౌంట్‌గా చెప్పుకుంటారు. ఇందులో స్వచ్ఛందంగానే డబ్బలు డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే డిపాజిట్ చేసిన డబ్బులను ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ విత్‌డ్రాయెల్, ఎగ్జిట్ రూల్స్ ఉంటాయి. ఇకపోతే ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉండవు. అయితే ఎన్‌పీఎస్ టైర్ 1 అకౌంట్‌లో మాత్రం కచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. ఇది తప్పనిసరి అకౌంట్. ఈ ఎన్‌పీఎస్ టైర్ 1 అకౌంట్‌లో పెట్టిన డబ్బులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Credit cards, National Pension Scheme, Nps, NPS Scheme, Pensions

  ఉత్తమ కథలు