నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పుడు చందాదారుల పెన్షన్ కార్పస్ ఫండ్ ఐదు లక్షల రూపాయల వరకు ఉంటే.. ఆ మొత్తం డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు లబ్ధిదారులు తమ ఎన్‌పిఎస్ ఖాతా నుంచి రెండు లక్షల రూపాయల వరకూ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటిపోయిన తర్వాత, పెన్షనర్లు తమ కాంట్రిబూషన్లో 60 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే, ప్రస్తుతమున్న నియమం ప్రకారం, కనీసం 40శాతం విరాళాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం ఆమోదించిన యాన్యుటీల్లో ఉంచాలి. ఈ నిబంధనలను కేంద్రం సడలించింది.
SBI Account KYC: మీరు ఎస్బీఐ కస్టమరా? మే 31 లోగా ఈ వివరాలు ఇవ్వకపోతే అకౌంట్ పనిచేయదు
EPFO Insurance: ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ.7,00,000 వరకు ఇన్స్యూరెన్స్... ఎలా పొందాలంటే
నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ప్రభుత్వం ద్వారా నడిచే పెట్టుబడి పథకం. ఇది చందాదారులకు ఒక ఆప్షన్ ఇస్తుంది. ఇందులో వేర్వేరు అసెట్ క్లాజ్‌లకు తాము ఇష్టపడే కేటాయింపును సెట్ చేసుకునే అవకాశం చందాదారునికి ఉంటుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ రెండు రకాల ఖాతాలను ఆఫర్ చేస్తుంది. అవి టైర్-1, టైర్-2 అకౌంట్లు. ప్రభుత్వ బాండ్లు, ఈక్విటీ మార్కెట్, కార్పొరేట్ రుణాలతో పాటు ఈ రెండు రకాల ఖాతాలను ఆఫర్ చేస్తుంది. ఇందులో టైర్-1 ఎన్‌పిఎస్ అకౌంట్... కచ్చితంగా పెన్షన్ అకౌంట్‌గా ఉంటుంది. ఇక టైర్-2 అకౌంట్‌ను పెట్టుబడి అకౌంట్‌గా పిలుస్తారు. ఇది శాశ్వత పదవీ విరమణ అకౌంట్ నెంబర్‌తో (PRAN) అనుసంధానమై ఉండే స్వచ్ఛంద పొదుపు ఖాతా.
PAN Card: మీ పాన్ కార్డుపై ఉన్న 10 డిజిట్స్‌కి అర్థం తెలుసా?
SBI Zero Balance Account: ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయండిలా
ప్రస్తుతం పెట్టుబడిదారులు మూడేళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే ముందస్తుగా డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంలో విత్‌డ్రా చేసుకునే మొత్తం చందాదారులు చేసిన కాంట్రిబూషన్లో 25 శాతాన్ని మించకూడదు. ఇక్కడ విత్‌డ్రాలకు పేర్కొన్న కారణాలకు అనుగుణంగానే అనుమతిస్తారు. పిల్లల ఉన్నత చదువుల కోసం, వారి పెళ్లికి, ఇల్లు కొనుగోలు చేయడానికి.. లేదంటే ఇల్లు నిర్మించుకోడానికి (నిర్దేశించిన పరిస్థితుల్లో), క్లిష్టమైన అనారోగ్యాలకు చికిత్స చేయించుకోవడానికి ఈ అనుమతి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National Pension Scheme, Pension Scheme, Personal Finance