• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • NATIONAL PENSION SYSTEM NPS SCHEMES GIVES GOOD RETURNS FOR INVESTORS SS GH

NPS Scheme Returns: ఈ స్కీమ్‌లో చేరినవారికి అదిరిపోయే లాభాలు

NPS Scheme Returns: ఈ స్కీమ్‌లో చేరినవారికి అదిరిపోయే లాభాలు

NPS Scheme Returns: ఈ స్కీమ్‌లో చేరినవారికి అదిరిపోయే లాభాలు (ప్రతీకాత్మక చిత్రం)

NPS కింద ఈక్విటీ, కార్పొరేట్ బాండ్, గవర్నమెంట్ సెక్యూరిటీలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్... వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. దీని ద్వారా వివిధ అసెట్ క్లాస్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు.

  • Share this:
నేషనల్ పెన్షన్ సిస్టమ్-NPS స్కీమ్స్ గత సంవత్సరం మంచి రాబడిని అందించాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వీటిల్లో డెట్, ఈక్విటీ స్కీమ్స్ రెండూ రెండంకెల రాబడిని అందించాయి. టైర్-I, టైర్-II అకౌంట్‌లు ఊహించని విధంగా రాబడిని నమోదు చేశాయి. స్టాక్ మార్కెట్లు అత్యధిక స్థాయికి చేరుకున్నప్పుడు NPS స్కీమ్ E విలువ భారీగా పెరిగింది. గత ఏడాదిలో ఇది బెంచ్‌మార్క్ రిటర్న్స్‌కు అనుగుణంగా 22 శాతం రాబడిని అందించింది. ఇతర స్కీమ్స్ కూడా మంచి రిటర్న్స్ అందించాయి. హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ ఫండ్ టైర్-I అకౌంట్‌లో 21.77 శాతం రాబడిని ఇచ్చింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్ 20.50 శాతం, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ 20.90 శాతంతో ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. టైర్-I ఎన్‌పీఎస్‌ అకౌంట్‌ Scheme Gలో ఎల్‌ఐసీ పెన్షన్ ఫండ్ అతి తక్కువగా 17.96 శాతం రాబడిని సాధించింది.

NPS టైర్-II అకౌంట్‌లోని స్కీమ్ E కూడా చెప్పుకోదగ్గ రాబడిని అందించింది. NPSలోని టైర్- II అకౌంట్ అనేది ఒక యాడ్ ఆన్ అకౌంట్. దీనిద్వారా వివిధ పథకాల్లో ఎగ్జిట్ లోడ్ లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. ఎన్‌పీఎస్ టైర్-I అకౌంట్‌లో కస్టమర్లకు 60 సంవత్సరాలు వచ్చే వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. టైర్-II అకౌంట్‌కు ఎలాంటి లాక్ ఇన్ పీరియడ్ ఉండదు.

Gold Jewellery: వారసత్వ బంగారానికి ఐటీ రిటర్న్‌లో లెక్కలు చెప్పాలా? తెలుసుకోండి

PM Kisan Scheme: ఈ తప్పు చేస్తే మీ అకౌంట్‌లోకి రూ.6000 రావు... మరి ఏం చేయాలో తెలుసుకోండి

డెట్ స్కీమ్స్ కూడా...


స్కీమ్ సి, స్కీమ్ జి వంటి NPS డెట్ స్కీమ్స్ కూడా రెండంకెల రాబడిని ఇచ్చాయి. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెట్టే Scheme C విభాగంలో ఎల్ఐసి పెన్షన్ ఫండ్ గత ఏడాది అత్యధికంగా 15.19 శాతం రాబడిని నమోదు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ ఫండ్ 14.70 శాతం రాబడిని అందించింది. ఈ విభాగంలో అతి తక్కువ రిటర్న్స్ 12.98 శాతంగా ఉంది. గవర్నమెంట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసే Scheme G రాబడి సగటున 13.66 శాతంగా ఉంది. టైర్-II అకౌంట్‌ కూడా ఇలాంటి రాబడినే నమోదు చేసింది.

పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవచ్చా?


NPS కింద ఈక్విటీ, కార్పొరేట్ బాండ్, గవర్నమెంట్ సెక్యూరిటీలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్... వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. దీని ద్వారా వివిధ అసెట్ క్లాస్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు. కానీ కేవలం రిటర్న్స్ ఆధారంగా NPSలో పెట్టుబడులపై నిర్ణయం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. NPS అనేది రిటైర్మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు చేసే లాంగ్‌ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. ఇది మార్కెట్ ఒడిదొడుకులకు ప్రభావితమవుతుంది. దీని రాబడి కూడా స్థిరంగా ఉండదు. అయినా ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా దీర్ఘకాలిక లక్ష్యాలపైనే దృష్టి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇన్వెస్టర్లు రిటర్న్స్‌తో పాటు ఆఫర్లో ఉన్న పథకాల రిస్క్ ప్రొఫైల్స్‌ను కూడా చూసి ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు