హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules: ఆ స్కీమ్‌లో ఉన్నవారికి అలర్ట్... కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి

New Rules: ఆ స్కీమ్‌లో ఉన్నవారికి అలర్ట్... కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి

New Rules: ఆ స్కీమ్‌లో ఉన్నవారికి అలర్ట్... కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules: ఆ స్కీమ్‌లో ఉన్నవారికి అలర్ట్... కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి (ప్రతీకాత్మక చిత్రం)

New Rules | నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో (NPS) ఉన్నవారికి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఇకపై తమ పెట్టుబడులకు రిటర్న్స్ ఎలా ఉండాలన్నది సబ్‌స్క్రైబర్స్ ఎంచుకోవచ్చు. రిస్క్ లెవెల్‌ను బట్టి రిటర్న్స్ ఉంటాయి.

నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో (NPS) ఉన్నవారికి అలర్ట్. ఈ స్కీమ్‌కు సంబంధించి కొత్త రూల్స్ (New Rules) అమలులోకి వచ్చాయి. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేవారికి వారి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలియజేసేలా మార్పులు వచ్చాయి. ఎన్‌పీఎస్ స్కీమ్‌లో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రేటింగ్స్ ఇవ్వాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA). వీటికి రేటింగ్స్ ఇవ్వడం ఫండ్ మేనేజర్ల బాధ్యత. మొత్తం ఆరు లెవెల్స్ ఉంటాయి. లో రిస్క్, లో టు మాడరేట్ రిస్క్, మాడరేట్ రిస్క్, మాడరేట్లీ హై రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్ పేర్లతో ఆరు లెవెల్స్ ఉంటాయి. రిస్కు లెవెల్‌ను బట్టి రిటర్న్స్ ఉంటాయి. లో రిస్క్ ఎంచుకుంటే తక్కువ రిటర్న్స్, వెరీ హై రిస్క్ ఎంచుకుంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రిటర్న్స్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ లెవెల్ ఎంచుకునేముందు కస్టమర్ తమ రిస్క్ లెవెల్ అంచనా వేసుకోవాలి.

"ప్రతీ ఒక్కరికీ ఎన్‌పీఎస్ స్కీమ్స్ దీర్ఘకాల పెట్టుబడులకు ముఖ్యమైన అసెట్‌గా మారుతున్నాయి. పెట్టుబడులకు సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తే తమ పెన్షన్ కోసం కావాల్సిన కార్పస్ రూపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. సబ్‌స్క్రైబర్లకు వేర్వేరు రిస్క్ లెవెల్స్‌పై అవగాహన కల్పించాలని భావిస్తున్నాం" అని PFRDA సర్క్యులర్‌లో పేర్కొంది.

How to Change UPI Id in Google Pay: గూగుల్ పేలో యూపీఐ ఐడీ సింపుల్‌గా మార్చేయండి ఇలా

పెన్షన్ ఫండ్స్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో రిస్క్ ప్రొఫైలింగ్ ఉంటుంది. పోర్ట్‌ఫోలియో డిస్‌క్లోజర్ సెక్షన్‌లో ప్రతీ క్వార్టర్ ఎండింగ్ మంత్ పూర్తైన 15 రోజుల్లో ఈ వివరాలు అప్‌డేట్ చేయాలి. పెన్షన్ ఫండ్‌లు ప్రతి సంవత్సరం మార్చి 31 నాటికి తమ వెబ్‌సైట్‌లో స్కీమ్‌ల రిస్క్ స్థాయిని వెల్లడిస్తాయి. సంవత్సరంలో రిస్క్ లెవెల్ ఎన్నిసార్లు మారిపోయిందన్న వివరాలు కూడా ఉంటాయి. ప్రతీ మూడు నెలలకోసారి రిస్క్ లెవెల్ మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్‌లో ఉన్నవారు తరచూ వివరాలు చెక్ చేస్తూ ఉండాలి.

Post Office Scheme: రిస్కు లేకుండా తక్కువ టైమ్‌లో రూ.2.78 లక్షల రిటర్న్స్... పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వివరాలివే

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పలు పెన్షన్ పథకాల్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా ఒకటి. 2004 జనవరిలో ఈ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రారంభమైంది. 2009లో ఈ స్కీమ్ అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చింది. ఈ స్కీమ్‌లో ప్రతీ నెలా కొంత మొత్తం చొప్పున పొదుపు చేయాలి. రిటైర్మెంట్ వరకు పొదుపు చేసి రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా కొంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు గలవారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

ఇందులో టైర్ 1, టైర్ 2 పేరుతో రెండు రకాల ఎన్‌పీఎస్ అకౌంట్స్ ఉంటాయి. టైర్ 1 ఆప్షన్ ఎంచుకుంటే జమ చేసిన మొత్తంలో 60 శాతం విత్‌డ్రా చేయొచ్చు. ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. మిగతా 40 శాతాన్ని యాన్యుటీగా పొందొచ్చు. టైర్ 2 ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం నెలకు కనీసం రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. జమ చేసిన మొత్తాన్ని ఎప్పుడైనా విత్‌డ్రా చేయొచ్చు. ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: National Pension Scheme, New rules, Pension Scheme, Pensioners, Personal Finance

ఉత్తమ కథలు