హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pension Scheme: నెలకు రూ.50,000 పెన్షన్ కావాలంటే ఎంత పొదుపు చేయాలో తెలుసా?

Pension Scheme: నెలకు రూ.50,000 పెన్షన్ కావాలంటే ఎంత పొదుపు చేయాలో తెలుసా?

Pension Scheme: నెలకు రూ.50,000 పెన్షన్ కావాలంటే ఎంత పొదుపు చేయాలో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

Pension Scheme: నెలకు రూ.50,000 పెన్షన్ కావాలంటే ఎంత పొదుపు చేయాలో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

Pension Scheme | పెన్షన్ పథకాల్లో చేరాలనుకునేవారికి అనేక ప్రభుత్వ పెన్షన్ స్కీమ్స్ (Govt Pension Schemes) అందుబాటులో ఉన్నాయి. ఓ పెన్షన్ స్కీమ్‌లో పొదుపు చేయడం ద్వారా నెలకు రూ.50,000 పెన్షన్ పొందొచ్చు.

యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు పెన్షన్ గురించి ఆలోచించరు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవారికే పెన్షన్ విలువ తెలుస్తుంది. అయితే ఇటీవల ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెరుగుతోంది. భవిష్యత్తుకోసం డబ్బు పొదుపు చేయాలన్న (Money Saving) ఆలోచన పెరుగుతోంది. భవిష్యత్తు అవసరాల కోసం, వృద్ధాప్యంలో పెన్షన్ కోసం ఇప్పటినుంచే పొదుపు చేస్తున్నవారున్నారు. ప్రభుత్వం కూడా అనేక పెన్షన్ పథకాలను అందిస్తోంది. అందులో కొన్ని పాపులర్ పెన్షన్ స్కీమ్స్ (Pension Schemes) ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే పాపులర్ పెన్షన్ పథకాల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pension System) కూడా ఒకటి.

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌నే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని కూడా అంటారు. ఈ స్కీమ్‌లో దీర్ఘకాలం పొదుపు చేయడం ద్వారా రిటైర్మెంట్ నాటికి సంపద కూడబెట్టుకోవచ్చు. రిటైర్మెంట్ నుంచి బతికి ఉన్నంతకాలం భారీగా పెన్షన్ పొందొచ్చు. ఈ స్కీమ్‌లో పొదుపు చేయడం ద్వారా నెలకు రూ.50,000 పెన్షన్ పొందడం సులువే. అయితే రిటైర్మెంట్ వరకు పొదుపు చేసిన మొత్తంలో కొంత భాగాన్ని పెన్షన్ కోసం కేటాయించాల్సి ఉంటుంది.

Post Office Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.16.26 లక్షల రిటర్న్స్

ప్రస్తుతం ఉన్న నియమనిబంధనల ప్రకారం నేషనల్ పెన్షన్ సిస్టమ్ కార్పస్ నుంచి మెచ్యూరిటీ సమయంలో మొత్తం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండదు. కార్పస్‌లో 40 శాతంతో యాన్యుటీ కొనాలి. దీని నుంచే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుంది. మిగతా 60 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి పన్ను మినహాయింపు ఉంటుంది. లబ్ధిదారులు 40 శాతం కన్నా ఎక్కువతో కూడా యాన్యుటీ కొనొచ్చు. 100 శాతం వరకు అనుమతి ఉంటుంది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కార్పస్ నుంచి యాన్యుటీ కొనేవారికి 6 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ప్రకారం పెన్షన్ లభిస్తుంది. మరి నెలకు రూ.50,000 పెన్షన్ కావాలంటే కార్పస్ ఎంత ఉండాలో తెలుసుకోండి. యాన్యుటీ కొనేందుకు కనీసం 40 శాతం కార్పస్ కావాలి కాబట్టి కనీసం రూ.1 కోటితో యాన్యుటీ కొంటేనే ఏడాదికి రూ.6,00,000 లేదా నెలకు రూ.50,000 పెన్షన్ లభిస్తుంది. 40 శాతానికి రూ.1 కోటి అంటే 100 శాతానికి రూ.2.5 కోట్లు జమ కావాలి.

Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి

మరి రూ.2.5 కోట్లు జమ కావాలంటే ఎంత పొదుపు చేయాలన్న సందేహం మామూలే. ఎంత పొదుపు చేయాలన్నది వయస్సుపై ఆధాపరడి ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి 25 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్‌లో చేరితే 35 ఏళ్ల పాటు నెలకు రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య పొదుపు చేయాలి. 35 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఈ స్కీమ్‌లో చేరితే 25 ఏళ్ల పాటు నెలకు రూ.19,000 నుంచి రూ.23,000 మధ్య పొదుపు చేయాలి. 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఈ స్కీమ్‌లో చేరితే 15 ఏళ్ల పాటు నెలకు రూ.59,000 నుంచి రూ.65,000 మధ్య పొదుపు చేయాలి. అంటే ఈ స్కీమ్‌లో ఎంత ముందుగా చేరితే అంత తక్కువ పొదుపు చేసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి.

First published:

Tags: National Pension Scheme, Pension Scheme, Personal Finance

ఉత్తమ కథలు