హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pension: కేంద్రం స్కీమ్.. నెలకు రూ. 75 వేల పెన్షన్ పొందండిలా!

Pension: కేంద్రం స్కీమ్.. నెలకు రూ. 75 వేల పెన్షన్ పొందండిలా!

నెలకు రూ.75 వేల పెన్షన్

నెలకు రూ.75 వేల పెన్షన్

NPS | మీరు పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే కచ్చితంగా ఇప్పటి నుంచే సరైన ప్రణాళికలు అనుసరించాలి. దీని కోసం మీకు ఒక స్కీమ్ అందుబాటులో ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  National Pension Scheme | రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా? పదవీ విరమణ (Retirement) తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). ఈ స్కీమ్‌లో చేరితే రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ప్రతి నెలా పెన్షన్ (Pension) వస్తుంది. అంతేకాకుండా ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందొచ్చు. ఇంకా ఈ స్కీమ్‌లో చేరడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో ఎన్‌పీఎస్ కూడా ఒకటి. రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఖర్చులను ఎదుర్కొనేందుకు (పదవీ విరమణ తర్వాత జీతం రాదు) ఈ స్కీమ్ అనువుగా ఉంటుందని, రిస్క్ కూడా స్టాక్ మార్కెట్లతో పోలిస్తే తక్కువగా ఉంటుందని, రాబడి పీపీఎఫ్ వంటి పథకాల కన్నా ఎక్కువగా ఉంటుందని ఫినోలజీ వెంచర్స్ సీఈవో ప్రంజల్ కమ్రా తెలిపారు. ఎన్‌పీఎస్‌లో నాలుగు అసెట్ క్లాసెస్ ఉంటాయి. ఈక్విటీ, కార్పొరేట్ డెట్, గవర్నమెంట్ బాండ్స్,అల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ అనేవి ఇవి. ఇన్వెస్టర్లకు రెండు ఆప్షన్లు లభిస్తాయి. యాక్టివ్, ఆటో ఛాయిస్ అనేవి ఇవి.
  రూ.30 వేలకే తులం బంగారం.. కొంటే కలిగే లాభాలివే.. అదొక్కటే మైనస్!
  యాక్టివ్ ఛాయిస్ ఎంచుకుంటే ఇన్వెస్ట్‌మెంట్లు ఎలా ఉండాలి? ఎక్కడ చేయాలి? అనే అంశాలను సబ్‌స్క్రైబర్ నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ కింద గరిష్టంగా 75 శాతం ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని ఈక్విటీలో పెట్టొచ్చు. అయితే సబ్‌స్క్రైబర్ వయసు 50 ఏళ్లు దాటితే మాత్రం ఈక్విటీ అలొకేషన్ తగ్గుతూ వస్తుంది. ఆటో ఛాయిన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ఆటోమేటిక్‌గానే జరిగిపోతుంది. సబ్‌స్క్రైబర్ వయసు ప్రాతిపదికన అలొకేషన్ ఉంటుంది.
  ప్రస్తుతం సబ్‌స్క్రైబర్లు ఎన్‌పీఎస్ అకౌంట్ నుంచి పూర్తిగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వీలు ఉండదు. ఎన్‌పీఎస్ మొత్తంలో 40 శాతాన్నియాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు యాన్యుటీ ప్లాన్స్ అందిస్తూ ఉంటాయి. దీని ద్వారా రెగ్యులర్‌గా పెన్షన్ పొందొచ్చు. 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే సబ్‌స్క్రైబర్లు డబ్బులు విత్‌డ్రా చేసుకోకుండా మొత్తం యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయొచ్చు. అప్పుడు ప్రతి నెలా పెన్షన్ డబ్బులు ఎక్కువగా వస్తాయి.
  SBI గుడ్ న్యూస్.. పెనాల్టీ లేకుండా ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు!


  ఇప్పుడు మనం నెలకు రూ. 75 వేల పెన్షన్ ఎలా పొందొచ్చొ తెలుసుకుందాం. మీరు ప్రతి నెలా కంట్రిబ్యూట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే పెన్షన్ కూడా మారుతుంది. నెలకు రూ. 75 వేల పెన్షన్ పొందాలని భావిస్తే.. ఎన్‌పీఎస్ మొత్తం రూ. 3.83 కోట్లుగా ఉండాలి. ఇక్కడ మనం 40 శాతం యాన్యుటీ ప్లాన్ కొనుగోలు రూల్ పరిగణలోని తీసుకున్నాం. అలాగే యాన్యుటీ రేటు 6 శాతంగా ఉందని అనుకుందాం.
  ఉదాహరణకు మీకు 25 ఏళ్లు ఉన్నాయి. నెలకు రూ.10 వేలు ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నారు. ఇలా మీరు 35 ఏళ్ల పాటు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. 10 శాతం వార్షిక రాబడి ప్రకారం చూస్తే.. మెచ్యూరిటీ సమయంలో ఎన్‌పీఎస్ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 3.8 కోట్లుగా ఉంటుంది. ఇందులో 40 శాతం మొత్తంతో యాన్యుటీ కొంటే నెలకు రూ. 76 వేల వరకు పెన్షన్ వస్తుంది. అలాగే 30 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ ప్రారంభిస్తే.. అప్పుడు నెలకు రూ. 16,500 చెల్లించాలి. అప్పుడే రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 75 వేల పెన్షన్ పొందగలం.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: National Pension Scheme, Nps, NPS Scheme, Pension Scheme, Schemes

  ఉత్తమ కథలు