NPS Scheme: మీరు ప్రైవేట్ ఉద్యోగులా? ఈ స్కీమ్ మీకోసమే

NPS Scheme: మీరు ప్రైవేట్ ఉద్యోగులా? ఈ స్కీమ్ మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)

NPS Scheme | మీరు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారా? కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా? అయితే ఈ స్కీమ్ మీకోసమే.

  • Share this:
    భారతదేశంలో పొదుపు పథకాల్లో నేషనల్ పెన్షన్ స్కీమ్-NPS ఒకటి. దీని ద్వారా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. దీంతో పాటు మరో రూ.50,000 ప్రయోజనాలు ఉంటాయి. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేరినవారు మొదట కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత ప్రతీ ఏడాది కనీసం రూ.1,000 జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఉన్నట్టై ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ ప్లాన్ ఇది. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినా పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్-PRAN మార్చకుండా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్‌ని ఎన్‌పీఎస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. 70 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్-NPS లో ఎంత తక్కువ వయస్సులో చేరితే అంత ఎక్కువ లాభం ఉంటుంది. 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి నెలకు రూ.5,000 లోపు జమ చేస్తే చాలు వృద్ధాప్యంలో నెలకు రూ.19,000 పెన్షన్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    2021 Long Weekends: టూర్లు ప్లాన్ చేసుకోండి ఇక... ఈ ఏడాది ఫుల్లుగా లాంగ్ వీకెండ్స్... లిస్ట్ ఇదే

    SBI Home Loan 2021: ఎస్‌బీఐలో హోమ్ లోన్‌కు అప్లై చేస్తే అదిరిపోయే ఆఫర్

    ఈ స్కీమ్‌తో పన్ను ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఎక్కువ ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉండేవారు ఈ స్కీమ్ ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఇందులో ఉద్యోగి వేతనంలో 10 శాతం (బేసిక్+డీఏ) వరకు ఈ స్కీమ్‌లో జమ చేసి పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీసీడీ (1) కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. సెక్షన్ 80 సీసీఈ కింద గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 మాత్రమే జమ చేయొచ్చు. ఇక యజమాని వాటా కూడా ఉద్యోగి వేతనంలో 10 శాతం (బేసిక్+డీఏ) వరకు ఈ స్కీమ్‌లో జమ చేయొచ్చు. సెక్షన్ 80 సీసీడీ (1) కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. సెక్షన్ 80 సీసీఈ కింద గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 మాత్రమే జమ చేయాలి. ఉద్యోగి స్వచ్ఛందంగా రూ.50,000 వరకు అదనంగా కంట్రిబ్యూషన్ చేయొచ్చు. దీనిపై సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద మినహాయింపు పొందొచ్చు.

    LIC New Jeevan Anand Plan: ఇన్స్యూరెన్స్ పాలసీపై ఎక్కువ లాభాలు కావాలా? ఈ ప్లాన్ మీకోసమే

    Cylinder Booking on Paytm: పేటీఎం యాప్ ఉందా? సింపుల్‌గా సిలిండర్ బుక్ చేయండిలా

    ప్రైవేట్ ఉద్యోగులు సెక్షన్ 80సీ కింద గరిష్టంగా ఏడాదికి రూ.1,50,000 వరకు మినహాయింపులు పొందొచ్చు. ఎన్‌పీఎస్ టైర్ 1 అకౌంట్‌లో జమ చేస్తే రూ.50,000 వరకు మినహాయింపు పొందేందుకు అనుమతి ఉంది. ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌లో ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు జమ చేస్తే సెక్షన్ 80సీ కింద మినహాయింపులు ఉండవు. లాకిన్ కూడా వర్తించదు.
    Published by:Santhosh Kumar S
    First published: