news18-telugu
Updated: October 5, 2020, 1:00 PM IST
Saving Schemes: రిస్కు లేకుండా ఎక్కువ లాభాలు ఇచ్చిన బాండ్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
మారుతున్న కాలంతో పాటు పెట్టుబడులపై ఆసక్తి పెంచుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఫైనాన్షియల్ ఎవేర్నెస్ పెరగడంతో ఎంతో కొంత రాబడిని ఇచ్చే పెట్టుబడి మార్గాలను చాలామంది అన్వేషిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి నష్టభయం లేకుండా స్థిరమైన ఆదాయం పొందే పెట్టుబడి మార్గాలు తక్కువ రాబడిని అందిస్తున్నాయి. ఇదే సందర్భంలో నేషనల్ పెన్షన్ సిస్టం-NPS అందిస్తున్న ప్రభుత్వ సెక్యూరిటీ ఫండ్లు మాత్రం మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. ప్రముఖ బ్యాంకులు 5-10 సంవత్సరాల సుదీర్ఘ కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై కేవలం 5.4-5.5 శాతం మాత్రమే వడ్డీ రేట్లుగా నిర్ణయించాయి. దీంతో వీటికంటే ఆదాయం ఎక్కువ వచ్చే గవర్నమెంట్ సెక్యూరిటీలను పెట్టుబడిదారులు ఎంచుకుంటున్నారు.
బెంచ్ మార్కును దాటాయిమూడు నుంచి ఐదేళ్ల పీరియడ్లో అన్ని ఫండ్స్ మంచి పనితీరును కనబర్చి, రాబడిని అందించాయి. ఈ వ్యవధిలో CCIL ఆల్ సావరిన్ బాండ్ టిఆర్ఐ ఇస్తోన్న రాబడిని స్కీమ్-జి (టైర్ I అకౌంట్) రిటర్న్స్ అధిగమించాయి. గత మూడేళ్లలో G-sec ఫండ్స్ ఏటా 9.22-10.68 శాతం రాబడిని ఇచ్చాయి. అదే కాలానికి బెంచ్ మార్క్ 9.13 శాతం రిటర్న్స్గా నమోదైంది. గిల్ట్ మ్యూచువల్ ఫండ్ల కంటే వాటి రాబడి అదనంగా నమోదైంది. మూడు, ఐదేళ్ల కాలవ్యవధికి గిల్ట్ మ్యూచువల్ ఫండ్లు వరుసగా 7.79 శాతం, 8.61 శాతం రాబడిని అందించాయి.
PM SVANidhi: చిరు వ్యాపారులకు రుణాలు... రూ.163 కోట్లు ఇచ్చిన మోదీ ప్రభుత్వం... అప్లై చేయండిలా
మూడేళ్ల విభాగంలో ఎల్ఐసీ టాప్
మూడేళ్ల విభాగంలో 10.68 శాతంతో ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ అగ్రస్థానంలో నిలిచింది. దీని తరువాత ఎస్బీఐ పెన్షన్ ఫండ్-9.91 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్-9.67 శాతం రిటర్న్స్ అందించాయి. సెప్టెంబర్ 18, 2020తో ముగిసిన మూడేళ్ల కాలానికి ఈ గణాంకాలు నమోదయ్యాయి. ఇదే విభాగంలో UTI రిటైర్మెంట్ సొల్యూషన్స్ 9.22 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఇది కూడా బెంచ్ మార్కు కంటే ఎక్కువ కావడం విశేషం.
Gold: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండిఐదేళ్ల విభాగంలోనూ మంచి ఫలితాలే
UTI రిటైర్మెంట్ సొల్యూషన్స్ మినహా దీర్ఘకాలంలో అన్ని పెన్షన్ ఫండ్స్ ఐదేళ్ల విభాగంలో రెండంకెల రాబడిని అందుకున్నాయి. ఈ విభాగంలోనూ ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ మిగతా వాటి కంటే ముందంజలో ఉంది. ఇది ఏకంగా 11.21 శాతం రాబడిని నమోదు చేసింది. ఈ జాబితాలో కోటక్ పెన్షన్ ఫండ్ 10.32 శాతంతో రెండవ స్థానంలో ఉంది. హెచ్డిఎఫ్సి పెన్షన్ ఫండ్ ఐదేళ్లలో ఏటా 10.31 శాతం రాబడిని ఇచ్చింది. ఎస్బీఐ పెన్షన్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్లు వరుసగా 10.30 శాతం, 10.13 శాతం రాబడిని నమోదు చేశాయి. UTI రిటైర్మెంట్ సొల్యూషన్స్- స్కీమ్ జి 9.78 శాతం రాబడి పొందింది. ఇది CCIL ఆల్ సావరిన్ బాండ్ టిఆర్ఐ ఇచ్చిన 9.71 శాతం ఎక్కువ కావడం విశేషం. క్రెడిట్ రిస్క్ ఏమాత్రం లేకుండా, చెప్పుకోదగ్గ రాబడిని అందించే గిల్ట్ ఫండ్లపైన కూడా పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది.
Published by:
Santhosh Kumar S
First published:
October 5, 2020, 12:58 PM IST