హోమ్ /వార్తలు /బిజినెస్ /

National Pension Scheme: మీ పెట్టుబడికి మంచి రిటర్న్స్ ఇస్తున్న ఎన్‌పీఎస్ పెట్టుబడులు

National Pension Scheme: మీ పెట్టుబడికి మంచి రిటర్న్స్ ఇస్తున్న ఎన్‌పీఎస్ పెట్టుబడులు

National Pension Scheme: మీ పెట్టుబడికి మంచి రిటర్న్స్ ఇస్తున్న ఎన్‌పీఎస్ పెట్టుబడులు
(ప్రతీకాత్మక చిత్రం)

National Pension Scheme: మీ పెట్టుబడికి మంచి రిటర్న్స్ ఇస్తున్న ఎన్‌పీఎస్ పెట్టుబడులు (ప్రతీకాత్మక చిత్రం)

National Pension Scheme | నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినవారికి ఈ ఏడాది మంచి లాభాలు వచ్చాయి. సబ్‌స్క్రైబర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన స్కీమ్స్ ఏవో తెలుసుకోండి.

ఈ రోజుల్లో పెట్టుబడులపై ఆసక్తి చూపేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) స్కీమ్ E (ఈక్విటీ స్కీమ్)ని చాలామంది పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటున్నారు. స్కీమ్ E టైర్ I అకౌంట్ 2020లో మంచి రాబడిని అందించింది. ఈ సంవత్సరం దీనిపై సగటున 13.20 శాతం రిటర్న్ వచ్చింది. స్కీమ్ E టైర్ I లో 14.87 శాతం రాబడితో హెచ్‌డిఎఫ్‌సి పెన్షన్ మేనేజ్‌మెంట్ మొదటి స్థానంలో ఉంది. ఈ సంవత్సరం మొత్తం మార్కెట్లో NPS డెట్ స్కీమ్స్ మంచి పనితీరును కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టే NPS స్కీమ్ G, ఏడాది పొడవునా కస్టమర్లకు మంచి లాభాలను అందించింది. టైర్ I స్కీమ్ G ఈ సంవత్సరం సగటున 14.72 శాతం రాబడిని ఇచ్చింది. ఈ జాబితాలో హెచ్‌డిఎఫ్‌సి పెన్షన్ 15.60 శాతం రాబడితో టాపర్‌గా నిలిచింది. ఎన్‌పిఎస్ టైర్ I గవర్నమెంట్ బాండ్ స్కీమ్ ఆస్తుల విలువ రూ.14,421గా ఉంది. స్కీమ్ E ఆస్తుల విలువ రూ.15,996 కోట్లుగా ఉంది.

HP Gas Booking: హెచ్‌పీ గ్యాస్ వాడుతున్నారా? సింపుల్‌గా సిలిండర్ బుక్ చేయొచ్చు ఇలా

January 2021 Bank Holidays: జనవరిలో బ్యాంకులకు సెలవుల లిస్ట్ ఇదే

రిటైర్‌మెంట్ కోసం


కార్పొరేట్ బాండ్లు, సంబంధిత సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టే మరో డెట్ స్సీమ్.. స్కీమ్ C కూడా గత ఏడాది కాలంలో రెండంకెల రాబడిని ఇచ్చింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే దీర్ఘకాలంలో వీటిపై వచ్చే రిటర్న్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఐదు, ఏడు సంవత్సరాల కాలానికి ఎంచుకున్న స్కీమ్ ఇ, స్కీమ్ జి పెట్టుబడులు రెండంకెల రాబడిని అందించాయి. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. రిటైర్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని వీటిల్లో పెట్టుబడులు పెట్టాలి. అందువల్ల ఎన్‌పిఎస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను ప్రామాణికంగా తీసుకోకూడదు. ఇది మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్. ఎన్‌పిఎస్ పథకాల ద్వారా వచ్చే రాబడి స్థిరంగా ఉండదు. ప్రస్తుతం వస్తున్న రిటర్న్స్‌తో పోలిస్తే కొన్నిసార్లు హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. వీటితో సంబంధం లేకుండా పెట్టుబడి లక్ష్యాలపై దృష్టి పెట్టండి.

Aadhaar PVC Card: ఏటీఎం కార్డు సైజులో ఆధార్ కార్డ్... ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోండి ఇలా

EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ 4 ప్రయోజనాలు మిస్ కావొద్దు

రిస్క్ అంచనా వేయాలి


ఎన్‌పిఎస్‌లో వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈక్విటీ, కార్పొరేట్ బాండ్, గవర్నమెంట్ సెక్యూరిటీలను కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎన్‌పిఎస్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకునేవారు వివిధ స్కీమ్స్ ఎంతవరకు రాబడిని అందిస్తున్నాయో తెలుసుకోవాలి. దీంతోపాటు మీ రిస్క్ ప్రొఫైల్‌ ఆధారంగా మంచి స్కీమ్‌ను ఎంచుకోవాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: National Pension Scheme, Pension Scheme, Personal Finance, Stock Market

ఉత్తమ కథలు