హోమ్ /వార్తలు /బిజినెస్ /

NPS: నెల నెలా చేతికి రూ.50 వేలు, ఒకేసారి అకౌంట్‌లోకి రూ.కోటి 50 లక్షలు.. రూ.150 పొదుపుతో..

NPS: నెల నెలా చేతికి రూ.50 వేలు, ఒకేసారి అకౌంట్‌లోకి రూ.కోటి 50 లక్షలు.. రూ.150 పొదుపుతో..

NPS: నెల నెలా చేతికి రూ.50 వేలు, ఒకేసారి చేతికి రూ.కోటి 50 లక్షలు.. కేవలం రూ.150 పొదుపుతో..

NPS: నెల నెలా చేతికి రూ.50 వేలు, ఒకేసారి చేతికి రూ.కోటి 50 లక్షలు.. కేవలం రూ.150 పొదుపుతో..

National Pension System | మీరు రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి రూ.కోటికి పైగా పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రతి నెలా రూ. 50 వేలకు పైగా పెన్షన్ కూడా వస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Pension | రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఆదాయం పొందాలని భావిస్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. దీని పేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). బెస్ట్ రిటైర్మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల పదవీ విరమణ చేసిన తర్వాత ప్రతి నెలా రెగ్యులర్‌గా ఆదాయం పొందొచ్చు. అంతేకాకుండా ఒకేసారి భారీ మొత్తం (Money) పొందొచ్చు.

మీరు 21 ఏళ్ల వయసులో ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరారని అనుకుందాం. నెలకు రూ. 4500 ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే రోజులకు రూ. 150 పొదుపు చేస్తే సరిపోతుంది. ఇలా మీరు 60 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. అంటే 39 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏడాదికి రూ. 54 వేలు చొప్పున 39 ఏళ్లలో మొత్తంగా రూ. 21.06 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది.

జస్ట్ 6 నెలల్లోనే రూ.లక్షకు రూ.3 లక్షలు.. డబ్బుల వర్షం కురిపించిన బ్యాంక్‌

ఇప్పుడు ఎన్‌పీఎస్ రిటర్న్ 10 శాతంగా పరిగణలోకి తీసుకుంటే.. మీకు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 2.59 కోట్లు లభిస్తాయి. అయితే ఎన్‌పీఎస్ రూల్స్ ప్రకారం చూస్తే.. 40 శాతం మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు రూ. 1.04 కోట్లు మొత్తంతో యాన్యుటీ ప్లాన్ కొనాలి. అంటే మీకు చేతికి రూ. 1.56 కోట్లు వస్తాయి. యాన్యుటీ ప్లాన్ కింద మీకు ప్రతి నెలా రూ. 51,848 పెన్షన్ వస్తుంది. యాన్యుటీ మొత్తం పెరిగితే ప్రతి నెలా వచ్చే పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది.

చౌక ధరకే లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కి.మి వెళ్లొచ్చు!

మీరు ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో నుంచే ఎన్‌పీఎస్ అకౌంట్ తెరవొచ్చు. ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు ఈ సర్వీసులు అందిస్తున్నాయి. మీరు సులభంగా ఎన్‌పీఎస్ ఖాతా తెరవొచ్చు. ఎన్‌పీఎస్ ఖాతాపై ఇన్‌కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీసీడీ, సెక్షన్ 80సీ కింద దాదాపు రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే మీరు పెన్షన్ పొందొచ్చు. అలాగే ఒకేసారి భారీ మొత్తం వస్తుంది. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఇలా నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ కింద పలు రకాల బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే మీరు ఇన్వెస్ట్ చేసే నెలవారీ మొత్తం పెరిగే కొద్ది మీకు లభించే బెనిఫిట్స్ కూడా పెరుగుతూ వస్తాయని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Money, National Pension Scheme, Nps, NPS Scheme, Pensions, Saving money

ఉత్తమ కథలు