National Pension Scheme: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్... ప్రభుత్వ కంట్రిబ్యూషన్ 14 శాతం

National Pension Scheme | ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులు, సామాన్యులు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. కంపెనీలు కూడా ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈపీఎఫ్‌తో కలిపి ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

news18-telugu
Updated: March 31, 2019, 8:28 PM IST
National Pension Scheme: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్... ప్రభుత్వ కంట్రిబ్యూషన్ 14 శాతం
National Pension Scheme: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్... ప్రభుత్వ కంట్రిబ్యూషన్ 14 శాతం
news18-telugu
Updated: March 31, 2019, 8:28 PM IST
నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేరిన వాళ్లకు శుభవార్త. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. జాతీయ పెన్షన్ స్కీమ్‌‌లో గతంలో కేంద్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ మూలవేతనం+డీఏలో 10 శాతం మాత్రమే ఉండేది. కొన్ని నెలల క్రితం కంట్రిబ్యూషన్‌ను 14 శాతానికి పెంచింది కేంద్రం. అయితే ఉద్యోగుల కంట్రిబ్యూషన్ 10 శాతంగానే ఉంటుంది. అంతేకాదు ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత 60 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఇది 40 శాతం మాత్రమే. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. పెన్షన్ ఫండ్స్ ఎంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయమిది. అసలు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏంటీ? దాని వల్ల లాభాలేంటో తెలుసుకోండి.

national pension scheme, national pension scheme sbi, national pension scheme returns, national pension scheme benefits, national pension scheme hdfc, national pension scheme interest rate, nps contribution, how to open national pension scheme account online, nps form, nps benefits, nps returns, nps subscriber, నేషనల్ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ లాభాలు, ఎన్‌పీఎస్, ఎన్‌పీఎస్ లాభాలు, నేషనల్ పెన్షన్ స్కీమ్ రిటర్న్స్, ఎన్‌పీఎస్ రిటర్న్స్


నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS) ఏంటీ?



2004లో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ ప్రారంభించింది. ఐదేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ స్కీమ్ ప్రత్యేకంగా ఉండేది. 2009లో సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. 2011లో కార్పొరేట్ ఉద్యోగుల్ని కూడా చేర్చింది. 18-65 ఏళ్లలోపు వాళ్లు నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు. ఇతర పెన్షన్ స్కీమ్‌లతో ఎన్‌పీఎస్ కాస్త విభిన్నం. ఈ స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బును షేర్, బాండ్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మీకు వచ్చే లాభం స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. ఈ స్కీమ్‌లో ఎక్కువ లాభాలు పొందాలంటే దీర్ఘకాలం పెట్టుబడి పెట్టడం మంచిది. ఇందులో మూడు క్లాసులుంటాయి. ఈఈ క్లాస్ క్లాస్ ఎంచుకుంటే 50 పైసలు ఈక్విటీలోకి వెళ్తాయి. సీ క్లాస్ అయితే డబ్బును కార్పొరేట్ బాండ్లల్లో ఇన్వెస్ట్ చేస్తారు. జీ క్లాస్‌లో డబ్బును బాండ్స్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.

Read this: EPF Withdraw: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలా? నిబంధనలివే...



national pension scheme, national pension scheme sbi, national pension scheme returns, national pension scheme benefits, national pension scheme hdfc, national pension scheme interest rate, nps contribution, how to open national pension scheme account online, nps form, nps benefits, nps returns, nps subscriber, నేషనల్ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ లాభాలు, ఎన్‌పీఎస్, ఎన్‌పీఎస్ లాభాలు, నేషనల్ పెన్షన్ స్కీమ్ రిటర్న్స్, ఎన్‌పీఎస్ రిటర్న్స్
ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS) అకౌంట్

Loading...
నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. వాటిని టైర్-1, టైర్-2 అకౌంట్లు అని పిలుస్తారు. ఎన్‌పీఎస్ కోసం టైర్-1 అకౌంట్ తప్పనిసరి. టైర్-2 అకౌంట్ ఐచ్ఛికం. టైర్-1 అకౌంట్‌లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. టైర్-1 అకౌంట్‌లో నెలకు కనీసం రూ.500 చొప్పున ఏడాదికి రూ.6,000 ఇన్వెస్ట్ చేయాలి. టైర్-2 అకౌంట్‌లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. ఫండ్స్ ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. టైర్-2 అకౌంట్ మ్యూచువల్ ఫండ్‌ లాంటిది. ఒకవేళ ఈ స్కీమ్ మధ్యలో డబ్బులు చెల్లించడం ఆపేస్తే మీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అకౌంట్ రీఓపెన్ చేయడానికి ప్రతీ సంవత్సరానికి రూ.100 చొప్పున ఫీజు చెల్లించాలి.

Read this: Post Office RD: పోస్ట్ ఆఫీసులో రికరింగ్ డిపాజిట్... లాభాలు ఇవే

national pension scheme, national pension scheme sbi, national pension scheme returns, national pension scheme benefits, national pension scheme hdfc, national pension scheme interest rate, nps contribution, how to open national pension scheme account online, nps form, nps benefits, nps returns, nps subscriber, నేషనల్ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ లాభాలు, ఎన్‌పీఎస్, ఎన్‌పీఎస్ లాభాలు, నేషనల్ పెన్షన్ స్కీమ్ రిటర్న్స్, ఎన్‌పీఎస్ రిటర్న్స్


నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS) ఎవరికి?


ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులు, సామాన్యులు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. కంపెనీలు కూడా ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈపీఎఫ్‌తో కలిపి ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్‌పీఎస్ తీసుకుంటే ట్యాక్స్ లాభాలు కూడా ఉంటాయి. మూల వేతనం, డీఏలో 10% ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ లాభాలు పొందొచ్చు. సెక్షన్ 80 సీసీడీ-1 కింద రూ.1.5 వరకు పన్ను మినహాయింపులు పొందొచ్చు. సెక్షన్ 80 సీసీడీ-1బీ కింద అదనంగా రూ.50000 రిబేట్ లభిస్తుంది. కార్పొరేట్లు కూడా తమ ఉద్యోగుల కోసం ఈ స్కీమ్ తీసుకుంటే 80 సీసీడీ కింద పన్ను లాభాలు పొందొచ్చు. NSDL జాబితాలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర ఈ స్కీమ్ తీసుకోవచ్చు. ఇందుకోసం కావాల్సిన పత్రాలను NSDL నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Photos: బజాజ్ నుంచి కొత్త ఫోర్‌వీలర్... క్వాడ్రిసైకిల్ క్యూట్

ఇవి కూడా చదవండి:

CIBIL Score: మీ సిబిల్ స్కోర్ ఇక వాట్సప్‌లో... ఇలా తెలుసుకోవచ్చు

Link PAN-Aadhaar: పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి 4 మార్గాలు... ఐటీ శాఖ టిప్స్

Credit Card Limit: క్రెడిట్ లిమిట్ ఎప్పుడు పెంచుకోవాలో తెలుసా?
First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626