Home /News /business /

NATIONAL PAYMENTS CORPORATION OF INDIA CONTEST TWITTER TO CREATE AWARENESS ON CYBER CRIMES WINNERS WILL GET RS 500000 PRIZE MONEY SS

NPCI Contest: ట్విట్టర్‌లో క్రియేటీవ్‌గా కామెంట్ చేస్తే రూ.5 లక్షల ప్రైజ్

NPCI Contest: క్రియేటీవ్‌గా ట్వీట్ చేస్తే రూ.5 లక్షల బహుమతి

NPCI Contest: క్రియేటీవ్‌గా ట్వీట్ చేస్తే రూ.5 లక్షల బహుమతి

NPCI Contest | ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలను ఎలా అడ్డుకోవాలో చెప్పాలంటూ ట్విట్టర్‌లో ఈ కాంటెస్ట్ నిర్వహిస్తోంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మీ క్రియేటీవ్ మెసేజ్‌ని #StopThinkAct హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయాలి.

    మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా? రోజూ ఏదో ఓ అంశంపై ట్వీట్స్ చేయడం మీకు అలవాటా? అయితే మీరు రూ.5 లక్షలు గెలుచుకోవచ్చు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఆ కాంటెస్ట్‌లో గెలిస్తే రూ.5 లక్షలు మీవే కావొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందేమీ లేదు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా జస్ట్ ఓ ట్వీట్ చేస్తే చాలు. కాకపోతే ఆ ట్వీట్ కాస్త క్రియేటీవ్‌గా ఉండాలి. ఫిబ్రవరి 28 వరకు ఈ కాంటెస్ట్ కొనసాగనుంది.


    NPCI కాంటెస్ట్ ఏంటీ?


    ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలను ఎలా అడ్డుకోవాలో చెప్పాలంటూ ట్విట్టర్‌లో ఈ కాంటెస్ట్ నిర్వహిస్తోంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మీ క్రియేటీవ్ మెసేజ్‌ని #StopThinkAct హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయాలి. బ్యాంకు మోసాలు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్‌లో జాగ్రత్తలు, ఆన్‌లైన్ మోసాలపై మీ మెసేజ్ ఉండాలి. NPCI ట్విట్టర్ హ్యాండిల్‌లోనే ఈ పోటీ జరుగుతోంది. టెక్స్ట్ మెసేజ్ మాత్రమే కాదు... ఫోటోలు, వీడియోలు, ఏ ఫార్మాట్‌లో అయినా మీ క్రియేటివిటీ చూపించొచ్చు.

    NPCI కాంటెస్ట్‌లో ఎవరు పాల్గొనొచ్చు?


    18 ఏళ్ల వయస్సు పూర్తై, నిబంధనల ప్రకారం మీ ట్విట్టర్ హ్యాండిల్ ఉంటే చాలు. మీరు NPCI ట్విట్టర్ పేజీ ఫాలో కావాలి. ట్యాగ్ చేయాలి. దాంతో పాటు Meity, Digital India, Consumer affairs, ట్విట్టర్ పేజీలను ఫాలో కావాలి. మీ ట్వీట్‌ను #StopThinkAct హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయాలి. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ముందు నియమనిబంధనలు పూర్తిగా ఓసారి చదువుకోవడం మంచిది. NPCI కాంటెస్ట్ టర్మ్ అండ్ కండీషన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే

    ఇవి కూడా చదవండి:

    Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్... ధర రూ.28,990

    Fixed deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులు ఇవే...

    SBI Offer: హోమ్‌ లోన్‌పై జీరో ప్రాసెసింగ్ ఫీజ్... ఫిబ్రవరి 28 వరకే అవకాశం
    First published:

    Tags: CYBER CRIME

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు