Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్... ఆర్‌బీఐ కీలక నిర్ణయం

Money Transfer | నెఫ్ట్ పేమెంట్ సిస్టమ్‌ 24 గంటలు అందుబాటులోకి వస్తుందని ఆగస్ట్‌లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశంలో తెలిపింది ఆర్‌బీఐ. ఇప్పుడు దానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

news18-telugu
Updated: October 4, 2019, 3:09 PM IST
Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్... ఆర్‌బీఐ కీలక నిర్ణయం
Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్... ఆర్‌బీఐ కీలక నిర్ణయం (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 4, 2019, 3:09 PM IST
మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై 24 గంటలు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్-NEFT పేమెంట్ సిస్టమ్ పనిచేస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం వర్కింగ్ డేస్‌లో రాత్రి 7.45 గంటల వరకు మాత్రమే నెఫ్ట్ పనిచేస్తోంది. లావాదేవీలను సులభంగా సెటిల్ చేసేందుకు నెఫ్ట్ సేవల్ని 24 గంటల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. దీని వల్ల బ్యాంకులు నగదు నిర్వహణను ఇంకా బాగా చేయగలవని ఆర్‌బీఐ అభిప్రాయ పడింది. 2019 డిసెంబర్ నుంచి నెఫ్ట్ పేమెంట్ సిస్టమ్‌ 24 గంటలు అందుబాటులోకి వస్తుందని ఆగస్ట్‌లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశంలో తెలిపింది ఆర్‌బీఐ. ఇప్పుడు దానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ఎవరికైనా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే మూడు మార్గాలుంటాయి. అందులో ఒకటి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్-NEFT. నెఫ్ట్ పేమెంట్ సిస్టమ్‌ను ఆర్‌బీఐ నిర్వహిస్తోంది. నెఫ్ట్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే సెటిల్మెంట్ పద్ధతిలో డబ్బులు బదిలీ అవుతాయి. బ్యాంకు పనిచేసే వేళల్లో మాత్రమే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ప్రస్తుతం కస్టమర్లకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నెఫ్ట్ అందుబాటులో ఉంది. చివరి సెటిల్మెంట్ రాత్రి 7.45 గంటలకు జరుగుతుంది. అది కూడా కేవలం వర్కింగ్ డేస్‌లో మాత్రమే. ఇక రెండోది రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS. ఆర్‌టీజీఎస్‌ని కూడా ఆర్‌బీఐ మెయింటైన్ చేస్తుంది. భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS ఉపయోగపడుతుంది. ఆర్‌టీజీఎస్ ద్వారా రూ.2 లక్షల నుంచి ఎంతైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇక మూడోది ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-IMPS. ఇది అందరికీ బాగా తెలిసిన పేమెంట్ సిస్టమ్. ఐఎంపీఎస్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI మెయింటైన్ చేస్తుంది. వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈ పేమెంట్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేవాళ్లు అదనంగా ఛార్జీలు చెల్లించాలి.

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

SBI Charges: ఎస్‌బీఐ ఛార్జీల్లో మార్పు... మనీ ట్రాన్స్‌ఫర్, మంత్లీ బ్యాలెన్స్ కొత్త ఛార్జీలు తెలుసుకోండి

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌... లాభాలేంటో తెలుసా?
Loading...
IRCTC: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ టెక్నిక్‌తో రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ
First published: October 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...