రతన్ టాటా కాళ్లు మొక్కిన నారాయణ మూర్తి.. నెటిజన్ల ప్రశంసలు

తన కంటే వయసులో పెద్దవారైన రతన్ టాటా (82) అవార్డు ఇచ్చిన వెంటనే నారాయణ మూర్తి (73).. ఆయనకు పాదాభివందనం చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Updated: January 29, 2020, 5:23 PM IST
రతన్ టాటా కాళ్లు మొక్కిన నారాయణ మూర్తి.. నెటిజన్ల ప్రశంసలు
రతన్ టాటా కాళ్లు మొక్కిన నారాయణస్వామి
  • Share this:
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ స్వామి పేరు ఇవాళ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా అన్ని చోట్లా ఈయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా కాళ్లు మొక్కడమే ఇందుకు కారణం..! అవును నారాయణమూర్తి టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటాకు పాదాభివందనం చేశారు. మంగళవారం ముంబైలో జరిగిన TiEconMumbai కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా రతన్ టాటాను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణస్వామి చేతుల మీదుగా రతన్ టాటా అవార్డు అందుకున్నారు. తన కంటే వయసులో పెద్దవారైన రతన్ టాటా (82) అవార్డు ఇచ్చిన వెంటనే నారాయణ మూర్తి (73).. ఆయనకు పాదాభివందనం చేశారు. ఆ ఫొటోలను రతన్ టాటా సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ''నారాణయమూర్తి వంటి మంచి స్నేహితుడి చేతులు మీదుగా అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది.'' అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు రతన్  టాటా.  ఆ ఫొటోలపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. రతన్ టాటాకు పాదాభివందనం చేసి నారాయణమూర్తి తన విధేయతను చాటుకున్నారని కొనియాడాతున్నారు.First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు