Infosys నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్...జీడీపీ 70 ఏళ్ల కనిష్టానికి...

ఈ ఆర్థిక సంక్షోభం దెబ్బకు దేశం 1947 నాటి జిడిపి వృద్ధి కనిష్టానికి చేరుకుంటుందనే భయాలను నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నివారించడానికి, ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్‌లోకి రావడానికి ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు.

news18-telugu
Updated: August 11, 2020, 8:57 PM IST
Infosys నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్...జీడీపీ 70 ఏళ్ల కనిష్టానికి...
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
  • Share this:
భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం ఊహించనంత స్థాయిలో ఉండే ప్రమాదం ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి హెచ్చరించారు. ఈ ఆర్థిక సంక్షోభం దెబ్బకు దేశం 1947 నాటి జిడిపి వృద్ధి కనిష్టానికి చేరుకుంటుందనే భయాలను ఆయన వ్యక్తం చేశారు. దీనిని నివారించడానికి, ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్‌లోకి రావడానికి ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు. కరోనా వ్యాక్సిన్, నివారణ ఇప్పట్లో లేనప్పుడు, ఆర్థిక కార్యకలాపాలను ఆపలేమని పేర్కొంటూ మహమ్మారితో జీవించడం అలవాటు చేసుకోవాలని నారాయణ మూర్తి ప్రజలను కోరారు.

అంతేకాదుభారతదేశం యొక్క జిడిపి కనీసం 5 శాతం తగ్గిపోతుందని అంచనా వేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, 1947 నాటి అతి తక్కువ జిడిపి స్థాయికి కూడా చేరుకోవచ్చనే నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వర్చువల్‌గా నిర్వహించిన “లీడింగ్ ఇండియా డిజిటల్ రివల్యూషన్ ”పై జరిగిన చర్చలో ఏదేమైనా, ఆర్థిక వృద్ధి పట్టాలు తప్పిన దేశం భారతదేశం మాత్రమే కాదని. ప్రపంచ వాణిజ్యం కూడా తగ్గిపోయిందని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా టూరిజం దాదాపుగా కనుమరుగైందని, ప్రపంచ జిడిపి 5 శాతం నుంచి 10 శాతం మధ్య కుదించే అవకాశం ఉందని ఆయన అన్నారుకరోన
Published by: Krishna Adithya
First published: August 11, 2020, 8:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading