నాగార్జున సిమెంట్ ఇక నుంచి ఎన్సీఎల్ బిల్ టెక్ లిమిటెడ్..

దాదాపు 20 ఏళ్లుగా సిమెంట్ తయారీ రంగంలో సేవలు అందిస్తున్న నాగార్జున సిమెంట్ ఆల్ టెక్ సెక్యూలర్ లిమిటడ్.. ఇప్పుడు ఎన్సీఎల్ బిల్ టెక్ లిమిటెడ్‌గా మారింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 14, 2019, 2:46 PM IST
నాగార్జున సిమెంట్ ఇక నుంచి ఎన్సీఎల్ బిల్ టెక్ లిమిటెడ్..
నాగార్జున సిమెంట్ ప్రతినిధులు
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 14, 2019, 2:46 PM IST
దాదాపు 20 ఏళ్లుగా సిమెంట్ తయారీ రంగంలో సేవలు అందిస్తున్న నాగార్జున సిమెంట్ ఆల్ టెక్ సెక్యూలర్ లిమిటడ్.. ఇప్పుడు ఎన్సీఎల్ బిల్ టెక్ లిమిటెడ్‌గా మారింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటన జారీ చేశారు. హైదరాబాద్‌లో సంస్థ ప్రధాన కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సంస్థ ప్రతినిధులు.. ఇప్పటికే సిమెంట్ తయారీ రంగంలో నెంబర్ వన్‌గా నాగార్జున సిమెంట్ కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో తమ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సంస్థ ఉద్యోగులు 700 మంది ఉన్నారని వచ్చే రెండు నెలల్లో మరో 200 మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. దీంతో పాటు ఎన్సీఎల్ బిల్ టెక్ కంపెనీ అల్యూమినియం విండోస్‌తో పాటు పలు ఇతర ఉత్పత్తులు త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దాదాపు రూ.300 కోట్ల నిధుల సమీకరణ కోసం తమ ఉద్యోగులు పనిచేస్తున్నారని వెల్లడించారు.

First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...