Home /News /business /

MYNTRA IS CHANGING ITS LOGO AFTER COMPLAINTS FROM ACTIVISTS BA

Myntra Logo: మింత్ర లోగో బూతులా ఉంది మార్చాలన్న పోలీసులు.. మార్చేసిన కంపెనీ

Myntra New Logo

Myntra New Logo

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్ మింత్ర (Myntra) తమ లోగోను మార్చేసింది. కొత్త లోగోను రిలీజ్ చేసింది. పాత లోగో మీద పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

    ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్ మింత్ర (Myntra) తమ లోగోను మార్చేసింది. కొత్త లోగోను రిలీజ్ చేసింది. పాత లోగో మీద పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న నాజ్ పటేల్ అనే వ్యక్తి గత డిసెంబర్‌లో మింత్ర లోగో అసభ్యకరంగా ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ లోగోను మార్చాల్సిందిగా కోరారు. ముంబైలో ఆయన పోలీసులకు ఫిర్యాలు చేశారు. ముంబై పోలీసులు ఈ విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో పోలీసుల సూచనను పరిగణనలోకి తీసుకుని కంపెనీ తమ లోగోను మార్చేసింది. ఇంతకీ నాజ్ పటేల్ చేసిన ఫిర్యాదు ఏంటంటే... ఆ లోగోను పరిశీలిస్తే అది ఓ మహిళ నగ్నంగా ఉన్నట్టు కనిపిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మహిళలను అగౌరవ పరిచేలా ఉందన్నారు. దీంతో పోలీసులు వెంటనే కంపెనీ దృష్టికి తీసుకెళ్లారు. పటేల్ ఇదొక్కటే కాదు. ఆన్ లైన్ వ్యాపారంలో అసభ్యాలు, సోషల్ మీడియాలో చిల్లర పనులకు సంబంధించి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటారు. సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకుని వెళ్తుంటారు.

    ‘ఆ లోగో మహిళలను అగౌరవ పరిచేలా ఉంది. దీంతో వెంటనే మేం మింత్ర కంపెనీకి ఈమెయిల్ చేశాం. అనంతరం ఆ కంపెనీ ప్రతినిధులు మమ్మల్ని కలిశారు. నెల రోజుల్లో దీన్ని మారుస్తామని వారు హామీ ఇచ్చారు.’ అని సైబర్ క్రైమ్ డీసీపీ రష్మి కరండికర్ తెలిపారు. లోగో మార్పును కేవలం ఆన్ లైన్ వెబ్ సైట్, మొబైల్ యాప్ మీదే కాకుండా, తమ సంస్థ నుంచి డెలివరీ చేసే ప్యాకేజీల మీద కూడా మార్చనుంది. కొత్త లోగోతో ప్యాకేజీ మెటీరియల్ తయారు చేయాల్సిందిగా కంపెనీ ఆర్డర్ ఇచ్చినట్టు తెలిసింది. కొత్తలోగో ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ పాత లోగోకు దగ్గరగా ఉండేలా చూసుకుంటోంది. అయితే, కొత్త లోగో ఇదేనంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటి వైరల్‌గా మారింది.

    మింత్ర పాత లోగో, కొత్త లోగో


    ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫాం మింత్ర ఫ్యాషన్స్‌కు మంచి పేరుంది. బ్రాండెడ్ వస్త్రాలను అందిస్తుంటుంది. ఫ్యాషన్ ట్రెండ్స్ అందించే మింత్ర బిజినెస్ కూడా బాగానే ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Online shopping

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు