హోమ్ /వార్తలు /బిజినెస్ /

Myntra M-Live: మింత్రా నుంచి కొత్త రకం సేవలు.. ‘M-Live’ పేరుతో లైవ్ కామర్స్ ప్లాట్‌ఫాం.. వివరాలివే

Myntra M-Live: మింత్రా నుంచి కొత్త రకం సేవలు.. ‘M-Live’ పేరుతో లైవ్ కామర్స్ ప్లాట్‌ఫాం.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎం-లైవ్(M-Live) ఫ్లాట్‌ఫాంతో లైవ్ షాపింగ్ మోడల్‌ను ప్రవేశపెట్టిన తొలి ఈ-కామర్స్(E-Commerce) ప్లాట్‌ఫామ్‌లలో మింత్రా ఒకటిగా నిలిచింది. లైవ్ షాపింగ్ మోడల్ ఇప్పటికే వివిధ ప్లాట్‌ఫాంలలో సక్సెస్ అయింది.

ప్రముఖ ఆన్‌లైన్‌ దుస్తుల విక్రయ సంస్థ మింత్రా(Myntra) భారతదేశంలో తన సేవలను విస్తృతంగా విస్తరిస్తోంది. ఎప్పటికప్పుడు అదిరిపోయే సేవలను పరిచయం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎం-లైవ్ (M-Live) పేరుతో లైవ్ కామర్స్ ఫ్లాట్‌ఫాంను తాజాగా ప్రారంభించింది. సోషల్ కామర్స్  బిజినెస్(Business) విస్తరించాలనే లక్ష్యంతో ఇన్‌ఫ్లుయెన్సర్-ఆధారిత లైవ్ కామర్స్ ఫ్లాట్‌ఫాంను మింత్రా(Myntra) లాంచ్ చేసింది. ఎం-లైవ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్లు మింత్రా ఉత్పత్తులను లైవ్‌లో చూపిస్తుంటారు. అలాగే ప్రొడక్ట్స్ గురించి యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. దాంతో యూజర్లకు లైవ్ షాపింగ్ చేసినంత అనుభూతి కలుగుతుంది. ఎం-లైవ్ ఫ్లాట్‌ఫాంతో లైవ్ షాపింగ్ మోడల్‌ను ప్రవేశపెట్టిన తొలి ఈ-కామర్స్(E-Commerce) ప్లాట్‌ఫామ్‌లలో మింత్రా ఒకటిగా నిలిచింది. లైవ్ షాపింగ్ మోడల్ ఇప్పటికే వివిధ ప్లాట్‌ఫాంలలో సక్సెస్ అయింది.

ఎం-లైవ్ సాయంతో ఎక్స్‌పర్ట్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్లు మింత్రా యాప్‌లో వివిధ రకాల ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చెప్పొచ్చు. వీరు లైవ్ స్ట్రీమింగ్ వీడియో సెషన్‌లను హోస్ట్ చేయడానికి ఎం-లైవ్ అనుమతిస్తుంది. వ్యూయర్లు లైవ్ స్ట్రీమింగ్ సమయంలో షాపింగ్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. నిజజీవితంలో షాపింగ్ మాల్ కు వెళ్లి దుస్తుల, బ్యూటీ ఉత్పత్తుల గురించి విక్రేతలతో మాట్లాడినంత అనుభూతిని ఎం-లైవ్ అందిస్తుంది.

Amazon-CAIT: CAIT ఆధ్వర్యంలో అమెజాన్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు..

యూజర్లు మింత్రా యాప్‌లోని స్టూడియో సెక్షన్ లోకి వెళ్లి లైవ్ ఈవెంట్స్‌లో పాల్గొనవచ్చు. ఇవి అచ్చం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్ లాగానే ఉంటాయి. ఇక్కడ యూజర్లు క్వశ్చన్లు పోస్ట్ చేయవచ్చు. తమ ఫీడ్‌బ్యాక్ షేర్ చేయవచ్చు. ఇతర యూజర్ల కామెంట్లు చూడొచ్చు. లైవ్ స్ట్రీమ్ హోస్ట్ చేస్తున్న క్రియేటర్లను ఫాలో చేయవచ్చు. అంతేకాదు, స్క్రీన్ దిగువన ఉండే డెడికేటెడ్ ప్రొడక్ట్ ట్రే ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్ చూపించే అన్ని ఉత్పత్తులను చూడవచ్చు. స్క్రీన్ దిగువన కనిపించే ఉత్పత్తిని విష్ లిస్ట్ కు యాడ్ చేయవచ్చు లేదా లైవ్ స్ట్రీమ్ నుంచి బయటకు రాకుండానే ఆర్డర్‌ చేసి వాటిని కొనుగోలు చేయవచ్చు. ఒకేసారి 70 వేల మింత్రా యూజర్లకు ఎం-లైవ్ సపోర్ట్ చేయనుందని మింత్రా ప్రతినిధులు చెబుతున్నారు.

paradise biryani : ప్యారడైజ్ బిర్యానీ కోసం ఇక హైదరాబాదే రానక్కర్లేదు -43వ ఔట్‌లెట్ ఎక్కడంటే..

ఫ్యాషన్, బ్యూటీ విషయంలో కచ్చితత్వం చాలా ముఖ్యమైనదని.. కలర్ రిప్రజెంటేషన్ కచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉందని.. అందుకే ఎం-లైవ్ ఫ్లాట్‌ఫాంను తొలి దశ నుంచి తామే అభివృద్ధి చేశామని మింత్రా కంపెనీ పేర్కొంది. యూజర్లు ఒక ప్రశ్న అడగగానే ఇన్‌ఫ్లుయెన్సర్లు 10-14 సెకన్లలో సమాధానం ఇచ్చేలా మేం జాగ్రత్తలు తీసుకోగలిగామని మింత్రా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ లలితా రమణి చెప్పారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను సొంతంగా అభివృద్ధి చేయడం వల్ల ఒక స్టైలిస్ట్ సలహా లేదా అనేక మంది హోస్ట్‌లతో టాక్ షోలు వంటి అనేక ఇతర సేవలు జోడించే అవకాశం ఉంటుందన్నారు. మింత్రా ప్రస్తుతం తమ లైవ్ స్ట్రీమ్స్ హోస్ట్ చేయడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రత్యేక యాప్‌ను అందిస్తోంది.

First published:

Tags: E-commerce, Online shopping

ఉత్తమ కథలు