హోమ్ /వార్తలు /బిజినెస్ /

Myntra: మింత్ర అతిపెద్ద ఫ్యాషన్ ధమాకా సేల్‌.. టాప్ బ్రాండ్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు..!

Myntra: మింత్ర అతిపెద్ద ఫ్యాషన్ ధమాకా సేల్‌.. టాప్ బ్రాండ్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు..!

Myntra: మింత్ర అతిపెద్ద ఫ్యాషన్ ధమాకా సేల్‌.. టాప్ బ్రాండ్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు..!

Myntra: మింత్ర అతిపెద్ద ఫ్యాషన్ ధమాకా సేల్‌.. టాప్ బ్రాండ్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు..!

Myntra: భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్ ధమాకా సేల్‌ను మింత్ర తాజాగా ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ (BFF) నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో MRPపై ఏకంగా 50-90 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ఈ ఫ్యాషన్‌ సేల్‌లో బెస్ట్ డీల్స్ ఎలాంటి బ్రాండ్స్‌పై ఉన్నాయో చెక్ చేయండి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) స్పెషల్ ఫెస్టివల్ సేల్‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్‌ దుస్తుల విక్రయ సంస్థ మింత్ర (Myntra) కూడా స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్ ధమాకా సేల్‌ను మింత్ర తాజాగా ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ (BFF) నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో MRPపై ఏకంగా 50-90 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ఈ ఫ్యాషన్‌ సేల్‌లో బెస్ట్ డీల్స్ ఎలాంటి బ్రాండ్స్‌పై ఉన్నాయో చెక్ చేద్దాం.

* NIKE

బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ జోర్డాన్‌ కారణంగా ఈ బ్రాండ్ పాపులర్‌ అయింది. ఈ కంపెనీ షూలను జోర్డాన్‌ వినియోగించాడు. వీటిని ఐకానిక్‌గా మార్చాడు. దీంతో నైకీ జోర్డాన్స్‌, ఎయిర్‌ ఫోర్స్‌ కలెక్షన్లు చాలా పాపులర్‌ అయ్యాయి. ప్రస్తుతం నైక్ జోర్డాన్స్, ఎయిర్ ఫోర్స్ కలెక్షన్‌లు రెండూ మింత్రా సేల్‌లో సిద్ధంగా ఉన్నాయి.

* HUGO BOSS

వాచ్‌ తయారీ కంపెనీ హుగో బాస్ బ్రాండ్ లగ్జరీ ఫ్యాషన్ వాచ్‌లను తయారు చేస్తుంది. మింత్ర సేల్‌లో ఈ కంపెనీ బోల్డ్, క్లాసిక్ అనలాగ్ వాచ్‌లను అందిస్తోంది. కనీసం 40% డిస్కౌంట్‌తో వీటిని కొనుగోలు చేయవచ్చు.

* 8Seconds

ఈ సౌత్‌ కొరియన్‌ బ్రాండ్‌ ఫ్యాషన్-ఫార్వర్డ్ షాపర్‌లను ఆకర్షిస్తోంది. 270+ కంటే ఎక్కువ స్టైల్స్ అందిస్తోంది. మింత్రలో క్లీన్ కటస్, సోర్బెట్, న్యూట్రల్ కలర్స్‌, డిజైన్‌లను పరిశీలించవచ్చు.

* BIRKENSTOCK

ఫుట్‌వేర్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు మింత్ర సేల్‌లో ఈ బ్రాండ్‌ ప్రొడక్టులను డిస్కౌంట్లపై పొందవచ్చు. ఈ బ్రాండ్ అల్ట్రా-కంఫర్టబుల్ షూస్, మినిమల్ డిజైన్‌లతో సుమారు అరవై సంవత్సరాలుగా ఈ బ్రాండ్‌ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. గ్వినేత్ పాల్ట్రో, మడోన్నా వంటి ప్రముఖులు BIRKENSTOCK చెప్పులను వినియోగిస్తారు.

* NALLI

నల్లి బ్రాండ్ చీరలు చెన్నైలో రూపొందుతాయి. వీటిని అత్యుత్తమ నైపుణ్యంతో తయారు చేస్తారు. మింత్ర సేల్‌లో వీటి ధర రూ.2,000 నుంచి ప్రారంభమవుతుంది. పటోలా, పట్టు, నార చీరల నుంచి కాంచీపురం బ్రోకేడ్‌ల వరకు ప్రతి రకం అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి : స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఈ ఫోన్ పై రూ.4 వేల తగ్గింపు.. వివరాలివే

* Macy

ఈ బ్రాండ్‌ కోసం ఇండియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మింత్ర సేల్‌లో Macy ట్రెండింగ్ స్టైల్స్ 25% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. మింత్రాలో క్లబ్ రూమ్ వంటి ప్రైవేట్ లేబుల్స్ నుంచి తాజా Macy కలెక్షన్‌ పరిచయం అవుతోంది. ఈ బ్రాండ్ నుంచి మృదువైన, ఒత్తైన దుస్తుల నుంచి చిక్ బాటమ్స్, ఫిట్టింగ్ జీన్స్ వరకు ప్రొడక్టులు ఉన్నాయి.

* సేల్‌లో అడిషినల్‌ బెనిఫిట్స్‌

మింత్ర కస్టమర్లు ప్రైస్‌ డిస్కౌంట్స్‌తో పాటు ఇతర ఆఫర్‌లను కూడా పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు 10% అడిషనల్‌ సేవింగ్స్‌ అందుకోవచ్చు. ఫ్రీ షిప్పింగ్, మింత్ర గిఫ్ట్ కార్డ్‌లు, టాప్‌ బ్రాండ్‌ల నుంచి వోచర్‌లు, తక్కువ సూపర్‌కాయిన్‌లతో OTT సబ్‌స్క్రిప్షన్‌లు వంటి అనేక బెనిఫిట్స్‌ అందిస్తోంది.

First published:

Tags: Fashion, Festival, Top sales

ఉత్తమ కథలు