• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • MY AADHAAR ONLINE CONTEST UNIQUE IDENTIFICATION AUTHORITY OF INDIA EXTENDED MY AADHAAR ONLINE CONTEST DATE SS

Good News: ఆధార్ కాంటెస్ట్ గడువు పొడిగింపు... రూ.30,000 గెలుచుకోండి ఇలా

Good News: ఆధార్ కాంటెస్ట్ గడువు పొడిగింపు... రూ.30,000 గెలుచుకోండి ఇలా

ఆధార్ కార్డు

My Aadhaar Online Contest date extended | కాంటెస్ట్ గడువును జూలై 22 వరకు పొడిగించింది. ఈ కాంపిటీషన్‌లో భారతీయులు ఎవరైనా పాల్గొనొచ్చు.

  • Share this:
    'మై ఆధార్ ఆన్‌లైన్ కాంటెస్ట్‌'ను పొడిగించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఆధార్ ఆన్‌లైన్ సేవలపై అవగాహన కల్పిస్తూ గ్రాఫికల్, యానిమేషన్ వీడియోలు రూపొందించి పంపాలంటూ 'మై ఆధార్ ఆన్‌లైన్ కాంటెస్ట్‌' నిర్వహిస్తోంది UIDAI. ఈ కాంటెస్ట్ 2019 జూలై 8 రాత్రి 11.59 గంటల వరకు కొనసాగుతుందని ముందే ప్రకటించింది. కాంటెస్ట్ గడువును జూలై 22 వరకు పొడిగించింది. ఈ కాంపిటీషన్‌లో భారతీయులు ఎవరైనా పాల్గొనొచ్చు. ఆధార్ లేనివాళ్లు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి అర్హులు కాదు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేవాళ్లు ఆధార్ ఆన్‌లైన్ సేవల్లో ఏదైనా ఒకటి ఎంచుకొని, పూర్తి ప్రాసెస్‌ను వీడియో తయారు చేయాలి. గ్రాఫికల్, యానిమేటెడ్ వీడియోలు తయారు చేయచ్చు. వాటిని మంచి మ్యూజిక్‌తో ఎడిట్ చేసి ఇమెయిల్ ద్వారా ఆధార్ సంస్థకు పంపాలి. విజేతల్ని 2019 ఆగస్ట్ 31 లోగా ప్రకటిస్తారు. పార్టిసిపెంట్ ఆధార్ నెంబర్, ఆధార్‌పైన ఉన్నట్టుగా పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు వెల్లడించాలి. UIDAI కమిటీ విజేతల్ని ఎంపిక చేస్తుంది.


    వీడియో వ్యవధి 30 సెకన్ల నుంచి 120 సెకన్ల మధ్య ఉండాలి. పౌరులందరికీ అర్థమయ్యేలా వీడియోలో మొత్తం ప్రాసెస్ వివరించాలి. గ్రాఫికల్ లేదా వైట్‌బోర్డ్ యానిమేషన్ ఫార్మాట్‌లో ఉండాలి. వాయిస్ ఓవర్, మ్యూజిక్ స్పష్టంగా ఉండాలి. 1920×1080 పిక్సెల్ రెజల్యూషన్, మంచి క్వాలిటీ ఉన్న వీడియోలకు ప్రాధాన్యత ఉంటుంది. వీడియోను యూట్యూబ్ లేదా గూగుల్ డ్రైవ్ లేదా WeTransfer, SendSpace, DropBox, JumpShare, Hightail లాంటి ఆన్‌లైన్ ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా media.division@uidai.net.in ఇమెయిల్‌ ఐడీకి పంపాలి. MP4, AVI, FLV, WMV, MPEG, MOV ఫార్మాట్‌లో మాత్రమే వీడియో ఉండాలి.


    My Aadhaar Online Contest: వీడియోలు రూపొందించాల్సిన ఆన్‌లైన్ సేవలివే


    1. ఆధార్ డౌన్‌లోడ్ ఎలా చేయాలి?
    2. ఆధార్ జెనరేషన్ / అప్‌డేట్ స్టేటస్
    3. ఆధార్ కేంద్రాన్ని గుర్తించడం
    4. ఆన్‌లైన్‌లో అడ్రస్ అప్‌డేట్ చేయడం
    5. అడ్రస్ వేలిడేషన్ లెటర్ కోసం దరఖాస్తు
    6. ఆన్‌లైన్ అడ్రస్ అప్‌డేట్ స్టేటస్ చెక్ చేయడం
    7. ఆధార్ అప్‌డేట్ హిస్టరీ తెలుసుకోవడం
    8. మర్చిపోయిన EID/UID తెలుసుకోవడం
    9. ఆధార్ రీ-ప్రింట్‌కు ఆర్డర్ చేయడం
    10. వర్చవల్ ఐడీ-VID జనరేట్ చేయడం
    11. బయోమెట్రిక్స్ లాక్ / అన్‌లాక్
    12. ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ
    13. ఆధార్ లాక్ / అన్‌లాక్
    14. వెరిఫై ఇమెయిల్ / మొబైల్ నెంబర్
    15. ఆధార్ ఆన్‌లైన్‌లో వెరిఫై చేయడం

    ప్రతీ కేటగిరీలో టాప్ 3 వీడియోలకు 45 క్యాష్ ప్రైజ్‌లు
    మొదటి బహుమతి రూ.20,000
    రెండో బహుమతి రూ.10,000
    మూడో బహుమతి రూ.5,000

    మొత్తం కేటగిరీల్లో టాప్ 3 వీడియోలకు మూడు క్యాష్ ప్రైజ్‌లు
    మొదటి బహుమతి రూ.30,000
    రెండో బహుమతి రూ.20,000
    మూడో బహుమతి రూ.10,000

    Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


    ఇవి కూడా చదవండి:

    Passport: పాస్‌పోర్ట్‌కు అప్లై చేస్తున్నారా? ఈ నకిలీ సైట్లతో జాగ్రత్త

    PAN-Aadhaar: పాన్, ఆధార్ కార్డుల కొత్త నిబంధనలివే... తెలుసుకోండి

    UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటించండి
    Published by:Santhosh Kumar S
    First published: