Aadhaar Contest: ఆధార్ కాంటెస్ట్‌లో గెలిస్తే రూ.30,000 బహుమతి

My Aadhaar Online Contest | ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేవాళ్లు ఆధార్ ఆన్‌లైన్ సేవల్లో ఏదైనా ఒకటి ఉపయోగించుకొని, మొత్తం ప్రాసెస్‌కు సంబంధించిన సమాచారంతో చిన్న వీడియో రూపొందించాలి.

news18-telugu
Updated: June 21, 2019, 10:29 PM IST
Aadhaar Contest: ఆధార్ కాంటెస్ట్‌లో గెలిస్తే రూ.30,000 బహుమతి
Aadhaar Contest: ఆధార్ కాంటెస్ట్‌లో గెలిస్తే రూ.30,000 బహుమతి (image: UIDAI)
  • Share this:
ఆధార్ యూజర్లకు శుభవార్త. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆధార్ యూజర్లకు కాంటెస్ట్ నిర్వహిస్తోంది. 'మై ఆధార్ ఆన్‌లైన్ కాంటెస్ట్‌'లో పాల్గొనడానికి యూజర్లు చేయాల్సిందల్లా ఆధార్ సేవలు ఉపయోగించుకోవడమే. భారతదేశ పౌరులందరూ ఈ కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. ఆధార్ ఉన్నవాళ్లు మాత్రమే కాదు... ఆధార్ లేనివాళ్లు కూడా ఈ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేవాళ్లు ఆధార్ ఆన్‌లైన్ సేవల్లో ఏదైనా ఒకటి ఉపయోగించుకొని, మొత్తం ప్రాసెస్‌కు సంబంధించిన సమాచారంతో చిన్న వీడియో రూపొందించాలి. మంచి మ్యూజిక్‌తో ఎడిట్ చేసి ఇమెయిల్ ద్వారా ఆధార్ సంస్థకు పంపాలి. 'మై ఆధార్ ఆన్‌లైన్ కాంటెస్ట్‌' 2019 జూలై 8 రాత్రి 11.59 గంటల వరకు కొనసాగుతుంది. విజేతల్ని 2019 ఆగస్ట్ 31 లోగా ప్రకటిస్తారు.




My Aadhaar Online Contest: వీడియోలు రూపొందించాల్సిన ఆన్‌లైన్ సేవలివే

1. ఆధార్ డౌన్‌లోడ్ ఎలా చేయాలి?
2. ఆధార్ జెనరేషన్ / అప్‌డేట్ స్టేటస్
3. ఆధార్ కేంద్రాన్ని గుర్తించడం
4. ఆన్‌లైన్‌లో అడ్రస్ అప్‌డేట్ చేయడం
5. అడ్రస్ వేలిడేషన్ లెటర్ కోసం దరఖాస్తు
6. ఆన్‌లైన్ అడ్రస్ అప్‌డేట్ స్టేటస్ చెక్ చేయడం
7. ఆధార్ అప్‌డేట్ హిస్టరీ తెలుసుకోవడం
8. మర్చిపోయిన EID/UID తెలుసుకోవడం
9. ఆధార్ రీ-ప్రింట్‌కు ఆర్డర్ చేయడం
10. వర్చువల్ ఐడీ-VID జనరేట్ చేయడం
11. బయోమెట్రిక్స్ లాక్ / అన్‌లాక్
12. ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ
13. ఆధార్ లాక్ / అన్‌లాక్
14. వెరిఫై ఇమెయిల్ / మొబైల్ నెంబర్
15. ఆధార్ ఆన్‌లైన్‌లో వెరిఫై చేయడం


వీడియో వ్యవధి 30 సెకన్ల నుంచి 120 సెకన్ల మధ్య ఉండాలి. పౌరులందరికీ అర్థమయ్యేలా వీడియోలో మొత్తం ప్రాసెస్ వివరించాలి. గ్రాఫికల్ లేదా వైట్‌బోర్డ్ యానిమేషన్ ఫార్మాట్‌లో ఉండాలి. వాయిస్ ఓవర్, మ్యూజిక్ స్పష్టంగా ఉండాలి. 1920×1080 పిక్సెల్ రెజల్యూషన్, మంచి క్వాలిటీ ఉన్న వీడియోలకు ప్రాధాన్యత ఉంటుంది. వీడియోను యూట్యూబ్ లేదా గూగుల్ డ్రైవ్ లేదా WeTransfer, SendSpace, DropBox, JumpShare, Hightail లాంటి ఆన్‌లైన్ ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా media.division@uidai.net.in ఇమెయిల్‌ ఐడీకి పంపాలి. MP4, AVI, FLV, WMV, MPEG, MOV ఫార్మాట్‌లో మాత్రమే వీడియో ఉండాలి. పార్టిసిపెంట్ ఆధార్ నెంబర్, ఆధార్‌పైన ఉన్నట్టుగా పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు వెల్లడించాలి. UIDAI కమిటీ విజేతల్ని ఎంపిక చేస్తుంది.

ప్రతీ కేటగిరీలో టాప్ 3 వీడియోలకు 45 క్యాష్ ప్రైజ్‌లు
మొదటి బహుమతి రూ.20,000
రెండో బహుమతి రూ.10,000
మూడో బహుమతి రూ.5,000

మొత్తం కేటగిరీల్లో టాప్ 3 వీడియోలకు మూడు క్యాష్ ప్రైజ్‌లు
మొదటి బహుమతి రూ.30,000
రెండో బహుమతి రూ.20,000
మూడో బహుమతి రూ.10,000

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SBI-Aadhaar: ఒక్క నిమిషంలో మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి ఇలా...

Aadhaar Franchise: ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకోండి ఇలా

Aadhaar Card: మీ మొబైల్ నెంబర్‌తో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
First published: June 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు