MUTUAL FUNDS TOP PERFORMING VALUE MUTUAL FUNDS WHICH GIVES 64 PERCENT PROFITS GH SK
Value Funds: వాల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? గత ఏడాది భారీగా రాబడి ఇచ్చిన పథకాలు ఇవే
ప్రతీకాత్మక చిత్రం
Mutual Funds: గత కొన్ని సంవత్సరాలు ఒడిదొడుకులు ఎదుర్కొన్న వాల్యూ ఫండ్స్, ఏడాదిన్నరగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఈ విభాగంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన టాప్-5 ఫండ్స్ గురించి తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)లో అనేక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు (Investment Options) ఉన్నాయి. వీటిలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వీటి ద్వారా అందే రాబడి సైతం ఒకేలా ఉండదు. మార్కెట్ పరిస్థితులపై వీటి పనితీరు ఆధారపడి ఉంటుంది. వీటిలో వాల్యూ ఫండ్స్ (Value Funds) కు ఒక ప్రత్యేకత ఉంది. ధర తక్కువగా ఉండే స్టాక్‌లలో వాల్యూ ఫండ్ పెట్టుబడి పెడుతుంది. ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది అధిక రాబడిని అందించే గ్రోత్ ఇన్వెసింగ్కు వ్యతిరేకంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలు ఒడిదొడుకులు ఎదుర్కొన్న వాల్యూ ఫండ్స్, ఏడాదిన్నరగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి.
2020 ప్రారంభానికి ముందు మార్కెట్లలో పెరుగుదల కారణంగా చిన్న స్టాక్ సెట్స్‌కు ఆదరణ పెరిగింది. గత 12-18 నెలల్లో మార్కెట్ విస్తృతంగా పెరిగింది. దీంతో మంచి వాల్యుయేషన్లలో బీట్ డౌన్ స్టాక్స్ అనేక రెట్లు పెరిగాయి. ఈ ట్రెండ్ నుంచి వాల్యూ ఫండ్స్ లాభపడ్డాయి. అయితే ఇలాంటి ఫండ్స్ నుంచి రాబడిని ఆశించాలంటే పెట్టుబడి గడువు ఏడేళ్లకు మించి ఉండాలి. డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో గత రెండు సంవత్సరాలుగా ఇవి అత్యుత్తమ ఫలితాలు నమోదుచేస్తున్నాయి. వాల్యుయేషన్ కోసం ప్రతి ఫండ్ ప్రైస్-టు-ఎర్నింగ్స్ (PE), ప్రైస్-టు-బుక్ (P/B), రిటర్న్ ఆన్ ఈక్విటీ (RoE) వంటి ప్రమాణాలను ఉపయోగిస్తుంది. ఈ విభాగంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన టాప్-5 ఫండ్స్ గురించి తెలుసుకుందాం.
* IDFC Sterling
గత 13 సంవత్సరాలుగా ఉన్న IDFC స్టెర్లింగ్ వాల్యూ ఫండ్.. ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. వాల్యూరీసెర్చ్ డేటా ప్రకారం, ఈ పథకం గత ఏడాది కాలంలో 64 శాతం రాబడిని అందించింది. ఇది భారీ మిడ్, స్మాల్-క్యాప్ బయాస్‌ను కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 70 శాతానికి పైగా ఇలాంటి స్టాక్‌లలో పెట్టుబడి పెట్టింది. ఇది రూ. 4,207 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుంది. డైరెక్ట్ ప్లాన్ కోసం 0.88 శాతం వసూలు చేస్తుంది.
* SBI Contra
గత ఏడాది కాలంలో 58.3 శాతం రాబడులతో SBI కాంట్రా తర్వాతి స్థానంలో ఉంది. ఈ పథకం 1999 జులై నుంచి అమల్లో ఉంది. ఆస్తులలో 55 శాతానికి పైగా మిడ్, స్మాల్-క్యాప్‌లలో పెట్టుబడి పెడుతుంది. మిగిలిన ఎక్స్పోజర్ను లార్జ్ క్యాప్ స్టాక్‌లకు మళ్లిస్తుంది. ఇది రూ. 3,106 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుంది. దీని ఎక్స్పెన్స్ రేషియో 1.47 శాతంగా ఉంది.
* టెంపుల్టన్ ఇండియా వాల్యూ ఫండ్
టెంపుల్టన్ ఇండియా వాల్యూ ఫండ్ గత ఏడాదిలో 51.9 శాతం రాబడిని అందించింది. ఈ ఫండ్ 25 సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. ఈ ఫండ్ 74 శాతానికి పైగా లార్జ్ క్యాప్ బయాస్‌ని కలిగి ఉంది. ఇండివిడ్యువల్ స్టాక్స్‌కు ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రూ. 621 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుంది, 1.64 శాతం చార్జ్ వసూలు చేస్తుంది.
* నిప్పాన్ ఇండియా వాల్యూ ఫండ్
ఈ ఫండ్ గత ఏడాదిలో 46 శాతం రాబడితో జాబితాలో తర్వాతి స్థానంలో ఉంది. ఇది పోర్ట్‌ఫోలియోలో 65 శాతం మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్ రూ. 4,368 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుంది. 1.32 శాతం ఛార్జీలు విధిస్తుంది.
* L&T ఇండియా వాల్యూ ఫండ్
ఈ ఫండ్ గత ఏడాదిలో 44.4 శాతం రాబడిని అందించింది. ఈ పథకం లార్జ్ క్యాప్స్(54 శాతం)తో పాటు మిడ్, స్మాల్ క్యాప్(46 శాతం)లతో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. పోర్ట్‌ఫోలియోలోని కొన్ని టాప్ హోల్డింగ్‌లు ఎక్కువగా నిఫ్టీ స్టాక్స్ కావడం విశేషం. ఈ ఫండ్ రూ. 8,009 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుంది. ఎక్స్పెన్స్ రేషియోగా 0.86 శాతం వసూలు చేస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.