హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ చేయడానికి రూల్స్ ఇవే..

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ చేయడానికి రూల్స్ ఇవే..

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ చేయడానికి రూల్స్ ఇవే..

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ చేయడానికి రూల్స్ ఇవే..

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారికి.. పోర్ట్‌ఫోలియోలను ఎప్పుడు, ఎలా రీబ్యాలెన్స్ చేయాలి? ఇన్వెస్ట్‌ చేసిన స్కీమ్స్‌ను ఎలా తగ్గించాలి? అనే రెండు రకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ రెండింటినీ ఇండివిడ్యుల్‌గా కాకుండా ఒకేసారి చేయవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ప్రస్తుతం ఎక్కువ మంది మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌(Invest) చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి స్థిరమైన రిటర్న్స్‌(Returns) అందించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(Fixed Deposits) కంటే మ్యూచువల్‌ ఫండ్స్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారికి.. పోర్ట్‌ఫోలియోలను ఎప్పుడు, ఎలా రీబ్యాలెన్స్ చేయాలి? ఇన్వెస్ట్‌ చేసిన స్కీమ్స్‌ను ఎలా తగ్గించాలి? అనే రెండు రకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ రెండింటినీ ఇండివిడ్యుల్‌గా కాకుండా ఒకేసారి చేయవచ్చు. ఈక్విటీ- డెట్‌లలో చేసిన కేటాయింపుల నుంచి అందే రాబడి ఆధారంగా, పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేయాలి. ఈ ప్రక్రియను ఎప్పుడు, ఎలా చేయాలో చూద్దాం.

డీవియేషన్‌ బేస్డ్‌ రీబ్యాలెన్సింగ్

కేటాయింపు ముందుగా నిర్ణయించిన టాలరెన్స్ బ్యాండ్ కంటే ఎక్కువగా ఉంటే ఇది అమలు చేయాలి. టాలరెన్స్ బ్యాండ్ +/-5 శాతంగా ఉండాలి. కాబట్టి 60-40గా కేటాయింపులు ఉంటే.. పోర్ట్‌ఫోలియో 55 శాతం కంటే తక్కువగా లేదా 65 శాతానికి మించి ఉంటే డీవియేషన్‌ బేస్డ్‌ రీబ్యాలెన్సింగ్‌ చేయాలి.

పీరియాడిక్‌ రీబ్యాలెన్సింగ్

ఇది సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. కొందరు అర్ధ సంవత్సరానికి ఒకసారి చేస్తారు. కానీ చాలా మందికి సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.

Apple iPhone: వజ్రాలతో కూడిన iPhone.. ధర తెలిస్తే షాక్ అవుతారు..

రెండింటినీ కలపాలి

పైన పేర్కొన్న రెండింటినీ కలపడం మూడో ఆప్షన్‌. పెట్టుబడిదారుడు అర్థసంవత్సరాని రీబ్యాలెన్స్‌ చేస్తుంటే.. ఆ సమయంలో టాలరెన్స్ బ్యాండ్ కంటే ఎక్కువగా మారినప్పుడు మాత్రమే రీబ్యాలెన్స్ చేయాలి.

** పోర్ట్‌ఫోలియోను ఎలా రీబ్యాలెన్స్ చేయాలి?

* మరీ ఎక్కువగా మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ వద్దు

మిడ్, స్మాల్-క్యాప్‌లలో ఇన్వెస్ట్‌ చేయడం మంచి ఆలోచన. కానీ ఈ రెండింటిపై ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పోర్ట్‌ఫోలియో లేకపోతే, ఈ రెండు కేటగిరీలలో ప్రతిదానిలో 1-2 ఫండ్‌లకు పరిమితం కావచ్చు. అధిక-రిస్క్ కారణంగా చాలా మంది స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు దూరంగా ఉంటారు.

CTET 2022: సీటెట్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. అవసరమైన డాక్యుమెంట్స్‌తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు..

* ఎక్కువ లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ అవసరమా?

లార్జ్-క్యాప్ ఫండ్స్ బెంచ్‌మార్క్ సూచీలను అధిగమించడం కష్టమని నిపుణులు సూచిస్తున్నారు. లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడి పెట్టారో పరిశీలించాలి. యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ నుంచి క్రమంగా నిష్క్రమించవచ్చు. లార్జ్ క్యాప్ ఎక్స్‌పోజర్ 1-2 ఇండెక్స్ ఫండ్‌లకు పరిమితం చేయడం మంచిది.

* డెట్ ఫండ్స్ గురించి మర్చిపోవద్దు

మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ ఫండ్స్ లాగే డెట్ ఫండ్‌లు కూడా ముఖ్యమైనవి. డెట్ ఫండ్స్‌పై మోడరేట్‌గా పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు పోర్ట్‌ఫోలియోలో డెట్ ఫండ్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రేట్లు తగ్గినప్పుడు, వడ్డీ రేటు చక్రం రివర్స్ అయినప్పుడు అవి రక్షిస్తాయి.

* డూప్లికేట్స్‌ ఉండకూడదు

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి అతిపెద్ద కారణాలలో ఒకటి డైవర్సిఫికేషన్. రూ.5,000 రూపాయలను కూడా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ 30-60 స్టాక్‌లకు విస్తరించవచ్చు. ఒకే రకమైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌ చేయకూడదు. ఒకే రకమైన స్టాక్‌లలోకి ఇన్వెస్ట్‌మెంట్లు వెళ్లడం సరికాదు.

Job Resume: జాబ్ కోసం ట్రై చేస్తున్నారా..? రెజ్యూమ్‌ ఎలా ఉండాలో తెలుసా..? ఐఏఎస్ ఆఫీసర్ టిప్స్ ఇవే..

* రాణించని స్కీమ్స్‌ నుంచి బయటపడండి

ఫండ్ సొంత బెంచ్‌మార్క్, పీర్స్‌ ట్రాక్ రికార్డ్‌ను తనిఖీ చేయాలి. స్థిరమైన పనితీరు కనబరచకపోతే వాటిని వదులుకోవడం మంచిది. పోర్ట్‌ఫోలియోలో 5-7 శాతం వెయిటేజీ (అంతకంటే తక్కువ) ఉన్న నిధులను తీసివేయాలి. ఇవి పోర్ట్‌ఫోలియోను తిరిగి సమతుల్యం చేయడంలో సహాయపడటమే కాకుండా, నిధుల సంఖ్యను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

First published:

Tags: Investments, Mutual, Mutual Funds, Stocks

ఉత్తమ కథలు