Mutual fund SIP: మ్యూచువల్ ఫండ్స్ SIPలో నెలవారీ పెట్టుబడులు ఎలా పెట్టాలి? పూర్తి వివరాలు మీకోసం..

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవలి కాలంలో ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్(SIP)లో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ గా ఉంటున్నారు. అయితే..

  • Share this:
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడంపై ఇటీవల కాలంలో ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. అందులోనూ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్(SIP)లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇవి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. జూన్ 2020లో నిశ్చలంగా ఉన్న ఇన్ ఫ్లోలు.. అనంతరం మార్చి నెలలో పెరిగాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా(AMFI) ప్రకారం ఎస్ఐపీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే ప్రవాహం గత నెలలో రూ.9182 కోట్లుగా ఉంది. ముంబయికి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ పరుల్ మహేశ్వరీ ఎస్ఐపీల్లో తెలియని కోణాల గురించి వివరించారు.పెట్టుబడుదారులు ఈ వాయిదాలను వారి ప్రయోజనాలకు ఎలా ఉపయోగించవచ్చో ఆమె తెలిపారు.


SIPల్లో పెట్టుబడి పెట్టేందుకు ధనవంతులు కానక్కర్లేదు..
MRF షేర్ వ్యాల్యూ ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉందా.. దాని ఒక్కో షేర్ విలువ రూ.81,884. హనీవెల్ ఆటోమేషన్ విలువ రూ.43,312. కాబట్టి ఇంత విలువైన షేర్లను ఎలా కొనుగోలు చేయాలో మీకు తెలుసా? మ్యూచువల్ ఫండ్స్ లో రూ.5000లతో ఖాతాను ప్రారంభించి పెట్టుబడి పెడితే చాలు. ఎస్ఐపీని(నెలవారీగా పెట్టుబడి) ప్రారంభించాలనుకుంటే.. మీకు రూ.500ల నుంచే అందుబాటులో ఉంటుంది. కొన్ని ఫండ్ హౌస్ ల్లో ఎస్ఐపీలను రూ.100ల నుంచే అనుమతిస్తాయి.

SIPలను ఆపకుండానే నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు..
మీరు మ్యూచువల్ ఫండ్ పథకంలో ఓపెన్ ఎండెడ్ అయితే ఎప్పుడైనా దాని నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఎస్ఐపీలను కొనసాగించవచ్చు. అలాగే సేకరించిన బ్యాలెన్స్ నుంచి వైదొలగవచ్చు. సాధారణంగా ఫండ్ హౌస్ లు విత్ డ్రా కోస్ం FIFO(First in First Out) పద్ధతిని అనుసరిస్తాయి. కాబట్టి మొదట పెట్టుబడి పెట్టిన యూనిట్లను విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు సాధ్యమైనంత వరకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్(ఏడాదికి ముందే విత్ డ్రా చేసుకుంటే 15 శాతం) చెల్లించకుండా ఉండేందుకు ముందుగానే విత్ డ్రా చేసుకోండి.


గతేడాది కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా చాలా మంది ప్రజలు వారి ఆదాయంలో తగ్గుదల చూశారు. కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి సమయాల్లో మీరు ఎస్ఐపీలను కొన్ని నెలలపాటు పాజ్ చేయవచ్చు. మీ క్యాష్ ఫ్లో పరిస్థితి సడలించిన తర్వాత మీరు మీ ఎస్ఐపీలను తిరిగి ప్రారంభించవచ్చు. ఇందుకోసం మీరు ఓ ఫారం నింపాలి. ఇందులో కొన్ని ఆప్షన్లు ఉంటాయి. మీరు కోరుకున్నదాన్ని బట్టి 3-6 నెలలు ఎస్ఐపీలను పాజ్ చేయవచ్చు. ఇప్పుడు అనుమతించే గరిష్ఠ సమయం 6 నెలలు. మీరు ఇప్పటికే రన్నింగ్ లో ఉన్న ఎస్ఐపీల్లో ఇదే ఫండ్ ను పెట్టుబడిగా పెట్టవచ్చు.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీముల్లో(ELSS) లాక్ ఇన్..
భారీ మొత్తంలో పెట్టుబడులు మాదిరిగానే మీ ఎస్ఐపీ వాయిదాలు కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాక్ ఇన్స్ కు లోబడి ఉంటాయి. ప్రస్తుతం ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీములో అన్ని పెట్టుబడులు మూడేళ్ల పాటు లాక్ చేయబడతాయి. ఇది మీ ఎస్ఐపీలకూ వర్తిస్తుంది. "ఉదాహరణకు ఈ ఆర్థిక సంవత్సరంలో ELSS ఫండ్ లో ఎస్ఐపీని ప్రారంభిస్తే ఏప్రిల్ 2021లో ఎస్ఐపీ లాక్ ఫ్రీగా మారుతుంది. 2021 మేలో ప్రారంభిస్తే తదుపరి విడత అయిన 2024 మే నుంచి లాక్ ఇన్ నుంచి బయటపడుతుంది" అని మహేశ్వరి చెప్పారు. మరో మాటలో చెప్పాలంటే ఈఎల్ఎస్ఎస్ సేకరించిన మొత్తాన్ని ఉపసంహరించుకోవాలంటే మీ ఎస్ఐపీ వాయిదాలన్నీ మూడేళ్ల లాక్ ఇన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఇలా చేయవచ్చు.

SIP రద్దు చేసినా కానీ వాయిదా చెల్లించబడుతుంది..
కొన్నిసార్లు మీ ఎస్ఐపీని రద్దుచేసినప్పటికీ డబ్బు ఇప్పటికీ మీ బ్యాంక్ ఖాతా నుంచి వెళ్లిపోతుంది. ఎందుకంటే సాధారణంగా ఎస్ఐపీ రద్దు చేయడానికి 15 నుంచి 30 రోజుల సమయం పడుతుంది ఎందుకంటే ఏదైనా ఎస్ఐపీ ఓ ఆదేశం ద్వారా జరుగుతుంది. ఇది బ్యాంకులో నమోదు చేయబడుతుంది. ఇప్పుడు ఆ ఆదేశాన్ని నమోదు చేయడానికి, దాన్ని రద్దు చేయడానికి బ్యాంకుకు కొంత సమయం పడుతుంది. తదుపరి ఎస్ఐపీ విడత రాబోయే నెలలో మొదటి రోజు. కాబట్టి మీరు మీ ఎస్ఐపీని క్రితం నెల 20న రద్దు చేస్తే.. మీ తదుపరి విడత ఇంకా కొనసాగుతుంది. అందుకే కొన్నిసార్లు ఎస్ఐపీ చెల్లింపు జరుగుతుంది.

Published by:Nikhil Kumar S
First published: