SIP: రోజూ రూ.50 సేవ్ చెయ్యండి... రూ.50 లక్షలు పొందండి... ఎలాగో తెలుసుకోండి

రోజూ రూ.50 సేవ్ చెయ్యండి... రూ.50 లక్షలు పొందండి (ప్రతీకాత్మక చిత్రం)

Mutual Fund SIP: ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే వద్దొద్దు అనే వారు. ఇప్పుడు అవే కావాలంటున్నారు. వాటిలో వస్తున్న లాభాలు అలా ఉన్నాయి మరి. పూర్తి వివరాలు తెలుసుకోండి. లక్షాధికారులు అవ్వండి.

  • Share this:
    Mutual Fund SIP: మీరు బ్యాంకులో లక్ష రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ వేస్తే... నెలకు వచ్చే వడ్డీ అంతా కలిపి రూ.600 కూడా ఉండట్లేదు. అదే డబ్బును మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే... నెలకు కనీసం రూ.2000 దాకా సంపాదించవచ్చు. అదే సిప్‌ (SIP)లో పెడితే... మరింత ఎక్కువ సంపాదించడానికి వీలు ఉంటుంది. ఇందులో నష్టభయం ఉన్నప్పటికీ... ప్రస్తుతం ఇండియాలో చాలా మంది వీటిలోనే పెట్టుబడి పెడుతున్నారు. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించాలంటే... బెస్ట్ ఆప్షన్‌గా మ్యూచువల్ ఫండ్స్ సిప్‌ నిలుస్తోందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం. గందరగోళం లేకుండా సింపుల్‌గా అర్థమయ్యేలా తెలుసుకుందాం.

    డీమ్యాట్ అకౌంట్ కీలకం:
    అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే... కచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఈ అకౌంట్‌ను యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. కాకపోతే... వీటిలో అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఇదే డీమ్యాట్ అకౌంట్‌ను పేటీఎం మనీ, గ్రో (groww) వంటి సంస్థలు కూడా ఇస్తున్నాయి. వీటిలో మెయింటెనెన్స్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఈ అకౌంట్ తెరవడానికి మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ప్యాన్ (PAN) అవసరం. ఇలాంటి వివరాలు ఇచ్చి... ఆన్‌లైన్‌లోనే ఈ అకౌంట్ తెరచుకోవచ్చు. అరగంటలో అకౌంట్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. నెక్ట్స్ మినిట్ నుంచే బ్యాంక్ అకౌంట్ నంబర్ యాడ్ చేసుకొని... డబ్బును స్టాక్ మార్కెట్లలో, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. చాలా మంది ఈ డీమ్యాట్ అకౌంట్ తెరవడం ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటూ వెనుకంజ వేస్తున్నారు. అలాంటి వారు చాలా డబ్బు కోల్పోతున్నట్లే అనుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

    రూ.50 లక్షల సంపాదన:
    రోజూ రూ.50 పక్కన పెట్టడం కొంత కష్టమే అయినప్పటికీ... గట్టిగా ప్రయత్నిస్తే... ఇది భవిష్యత్తులో కాలుమీద కాలేసుకొని కూర్చునేందుకు వీలు కల్పిస్తుంది. ఎలా గంటే... మ్యూచువల్ ఫండ్స్ సిప్ (SIP) ద్వారా. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు. మనం ఈ ఫండ్స్‌లో డబ్బు దాచుకుంటే... ఆ డబ్బును ఆ సంస్థ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడుతుంది. వచ్చిన లాభాల్లో కొంత మనకు ఇస్తుంది. ఈ లాభాలు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ కంటే ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకే ఇప్పుడు అందరూ వీటిలోనే పెట్టుబడి పెడుతున్నారు. నష్టభయం ఉన్నా... వీటినే ఎంచుకుంటున్నారు.

    పోస్టాఫీస్‌లో సేవింగ్స్ ద్వారా ఏడాదికి మాగ్జిమం 8 శాతం వడ్డీ వస్తుంది. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో 12 నుంచి 15 శాతం రిటర్న్స్ వస్తున్నాయి. అందుకే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు హాట్ కేక్స్ అయ్యాయి. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఎంచుకున్నప్పుడు... అందులో మినిమం రూ.100 పెట్టుబడి పెట్టేవి కూడా ఉంటాయి. మీరు రోజుకు రూ.50 అంటే... నెలకు రూ.1500 పెట్టుబడి పెట్టవచ్చు. ఇందుకోసం సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది ఉంటుంది. మీరు ముందుగా గత మూడేళ్లుగా మంచి లాభాలు ఇస్తున్న మ్యూచువల్ ఫండ్‌ని ఎంచుకోవాలి. అందులో పెట్టుబడి పెట్టేందుకు SIP ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఫలానా తేదీన రూ.1500 పెట్టుబడి పెడితే... నెల నెలా అదే తేదీన అంతే డబ్బు పెట్టాల్సి ఉంటుంది. ఇలా సంవత్సరానికి రూ.18,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఓ 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే... మీరు మొత్తం పెట్టిన పెట్టుబడి రూ.3,60,000 మీకు 12 శాతం చొప్పున రిటర్న్స్ వస్తాయని అనుకుంటే... మీకు వచ్చే రిటర్నులు రూ.11,38,722. మొత్తం రిటర్నులతో కలిపి వచ్చే అమౌంట్ రూ.14,98,722.

    ఇలా మీరు నెలకు రూ.500 చొప్పున సంవత్సరానికి రూ.60,00 ఇన్వెస్ట్ చేస్తే... 20 ఏళ్లలో... మొత్తం పెట్టుబడి రూ.1,20,000. వచ్చే రిటర్నులు రూ.3,79,574. మొత్తం రిటర్నులతో కలిపి వచ్చే అమౌంట్ రూ.4,99,574.

    ఇలా మీరు నెలకు రూ.1,000 చొప్పున సంవత్సరానికి రూ.12,000 ఇన్వెస్ట్ చేస్తే... 20 ఏళ్లలో... మొత్తం పెట్టుబడి రూ.2,40,000. వచ్చే రిటర్నులు రూ.7,59,148. మొత్తం రిటర్నులతో కలిపి వచ్చే అమౌంట్ రూ.9,99,148.

    ఇలా మీరు నెలకు రూ.5,000 చొప్పున సంవత్సరానికి రూ.60,000 ఇన్వెస్ట్ చేస్తే... 20 ఏళ్లలో... మొత్తం పెట్టుబడి రూ.12,00,000. వచ్చే రిటర్నులు రూ.37,95,740. మొత్తం రిటర్నులతో కలిపి వచ్చే అమౌంట్ రూ.49,95,740. అంటే రూ.50 లక్షలు అనుకోవచ్చు.

    ఇలా తక్కువ పెట్టుబడితో... ఎక్కువ రిటర్న్ వచ్చేందుకు సిప్‌ ద్వారా వీలవుతుంది. ఈ సిప్ ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. ఎలాంటి పెనాల్టీలూ ఉండవు. పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్ నచ్చకపోతే... అది రద్దు చేసుకొని మరో ఫండ్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. 20 ఏళ్లు, 30 ఏళ్లు ఎంతకాలం కావాలంటే అంతకాలం పెట్టుబడి పెట్టుకోవచ్చు. కాలం పెరిగే కొద్దీ సిప్ రిటర్నులు బాగా పెరుగుతాయి. ఐతే... పెట్టుబడి పెట్టిన ఫండ్ లాభాల్లో ఉందో లేదో 6 నెలలకు ఓసారి చూసుకుంటూ ఉండాలి. అది లాభాలు సరిగా ఇవ్వట్లేదని అనిపిస్తే... దాన్ని రద్దు చేసుకొని... లాభాలు ఇస్తున్న మరో ఫండ్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు.

    ఇది కూడా చదవండి: Gold rate 4-5-2021: బంగారం, వెండి ధరల పెరుగుదల... ఆ సెంటిమెంట్ వల్లే...

    పైన చెప్పుకున్నట్లు రోజుకు రూ.50 సేవ్ చేసి... నెలకు రూ.1500 చొప్పున మ్యూచువల్ ఫండ్ సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తే... 12 శాతం రిటర్న్ వచ్చినట్లు భావిస్తే... 30 ఏళ్లలో రూ.53 లక్షలు వస్తాయి. ఐతే... నష్టభయం ఉంటుంది కాబట్టి... మ్యూచువల్ ఫండ్‌ని గమనిస్తూ ప్లాన్ చేసుకుంటే... భవిష్యత్తు బంగారంలా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: