హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mutual Fund SIP: మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ చేయడానికి బెస్ట్ టైమ్‌ ఏది? నిపుణుల సూచనలు ఇవే

Mutual Fund SIP: మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ చేయడానికి బెస్ట్ టైమ్‌ ఏది? నిపుణుల సూచనలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mutual Fund SIP: ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP). ఇది మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్‌లలో క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టే మార్గం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భవిష్యత్తులో అనుకోకుండా ఎదురయ్యే అవసరాలను తీర్చుకోవడానికి, కలలు, కోరికలు నెరవేర్చుకోవడానికి ఆర్థిక బలం అవసరం. ఈ ప్రణాళికలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇన్వెస్ట్‌మెంట్‌ తప్పనిసరి. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP). ఇది మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్‌లలో క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టే మార్గం. చాలా మందికి సిప్‌ ఎప్పుడు మొదలుపెట్టవచ్చు? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? వంటి సందేహాలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

* ప్రతి నెలా ఫిక్స్‌డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌

మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌ చేయాలనుకునే వారు ఫిక్స్‌డ్‌ అమౌంట్‌ని ప్రతి నెలా ఇన్వెస్ట్‌ చేస్తారు. మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి భయపడకుండా, క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులకు ఈ విధానం సహాయపడుతుంది. ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూడటం వల్ల ప్రయోజనం లేదు. వీలైనంత త్వరగా మొదలు పెడితేనే మంచిది. లాంగ్‌టర్మ్‌లో మంచి రిటర్న్స్‌ అందుకునే అవకాశం ఉంటుంది.

** SIP ఇన్వెస్ట్‌మెంట్ ప్రయోజనాలు

* బెటర్‌ యావరేజ్‌

పెట్టుబడిదారులు మార్కెట్ అస్థిరతను సద్వినియోగం చేసుకోవచ్చు. మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్లను, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. దీంతో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మంచి యావరేజ్‌ ప్రైస్‌ లభిస్తుంది.

* క్రమశిక్షణతో పెట్టుబడి

SIPలు పెట్టుబడిదారులకు క్రమ పద్ధతిలో పొదుపు, పెట్టుబడిని అలవాటు చేసుకోవడానికి సహాయపడతాయి. ఇన్వెస్టర్లు ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకుంటారు.

* ఫ్లెక్సిబిలిటీ

పెట్టుబడిదారులు తక్కువ మొత్తంలో డబ్బుతో SIPని ప్రారంభించవచ్చు. ఆదాయం పెరిగే కొద్దీ కాలక్రమేణా ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తాన్ని పెంచుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది.

* ఎప్పుడు అనేది కాదు, ఎంతకాలం అనేది ముఖ్యం!

సిప్‌ గురించి DSP మ్యూచువల్ ఫండ్ , హెడ్-పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌, CFA అనిల్ ఘెలానీ న్యూస్‌18తో మాట్లాడారు. ‘సిప్‌ని ప్రారంభించే సమయం ముఖ్యం కాదు, ఎంత ఎక్కువ కాలం మార్కెట్‌లో పెట్టుబడులు ఉంచారన్నదే ముఖ్యం. చాలా ఫండ్ హౌస్‌లు నెలలో ఏ తేదీలో అయినా SIP ప్రారంభించే అవకాశం అందిస్తున్నాయి. స్వల్పకాలంలో ఎదురయ్యే మార్కెట్‌ అస్థిరితలకు ఆందోళన చెందకుండా, దీర్ఘకాలం సిప్‌ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.’ అని చెప్పారు.

స్క్రిప్‌బాక్స్ మేనేజింగ్ పార్ట్నర్ వరుణ్ గిరిలాల్ మాట్లాడుతూ, ఈక్విటీ ఫండ్‌లో SIP అనేది లాంగ్‌టర్మ్‌లో సంపదను ఆర్జించి పెట్టే మంచి మార్గమని చెప్పారు. ‘SIPలు లేదా మరేదైనా పెట్టుబడి విషయంలో.. ఇన్వెస్ట్ చేసే టైమ్ గురించి ఆలోచించడం మానేసి వీలును బట్టి పెట్టుబడి పెట్టడం మంచి విధానం.

ఇది కూడా చదవండి : ప్రముఖ కంపెనీల కార్లపై వేలల్లో డిస్కౌంట్లు.. ఇలాంటి ఆఫర్లు మళ్లీ రావు భయ్యా!

ఉదాహరణకు మీరు పదేళ్ల లాంగ్‌టర్మ్ SIPని చూస్తే, ఇన్వెస్ట్‌మెంట్ డేట్, టైమ్ ఏమాత్రం పెట్టుబడిపై ప్రభావం చూపవు. పదేళ్ల SIP ఇన్వెస్ట్‌మెంట్ రోలింగ్ పీరియడ్‌లో.. SIPని నెల ప్రారంభంలో, మధ్యలో లేదా నెల చివరిలో చేసినా రాబడి 15.50% నుంచి 16% మధ్య ఉంటుంది’ అని గిరిలాల్ వివరించారు.

గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయని గుర్తించాలి. పెట్టుబడి పెట్టే ముందు స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. పెట్టుబడిదారులు స్కీమ్ ప్రాస్పెక్టస్‌ను జాగ్రత్తగా రివ్యూ చేసుకోవాలి. ఏదైనా స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు నిర్దిష్ట చట్టపరమైన, పన్ను, ఆర్థికపరమైన చిక్కులకు సంబంధించి నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

First published:

Tags: Investment Plans, Personal Finance, SIP

ఉత్తమ కథలు